తెలంగాణ

పకడ్బందీగా బందోబస్తు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 13: అసెంబ్లీ ఆవరణలో బందోబస్తుకు వచ్చే పోలీసులు మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని, విధి నిర్వహణలో జాగ్రత్తలు పాటించాలని కౌన్సిల్ చైర్మన్ స్వామిగౌడ్, అసెంబ్లీ స్పీకర్ మధుసూదనాచారి పోలీసు ఉన్నతాధికారులకు సూచించారు. ఈ నెల 16 నుంచి అసెంబ్లీ, కౌన్సిల్ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో చైర్మన్, స్పీకర్ మంగళవారం పోలీసు ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. సమావేశాలు జరిగే సమయంలో కొంతమంది, కొన్ని ప్రజా సంస్ధలు అసెంబ్లీకి వచ్చేందుకు ప్రయత్నిస్తారు కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకోవాలని వారు సూచించారు.
అసెంబ్లీకి కిలోమీటరు దూరం నుంచే కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేయాలని తెలిపారు. కౌన్సిల్‌కు, అసెంబ్లీకి విఐపిలు వస్తుంటారు కాబట్టి ట్రాఫిక్ జామ్ కాకుండా చూసుకోవాలని వారు తెలిపారు. ఎమ్మెల్యే క్వార్టర్లలోనూ భద్రతా చర్యలు చేపట్టాలని వారు సూచించారు.
ప్రదీప్ చంద్రకు సూచనలు
ఇలాఉండగా ఇటీవల కొత్తగా బాధ్యతలు స్వీకరించిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ప్రదీప్ చంద్రతో కౌన్సిల్ చైర్మన్ స్వామిగౌడ్, స్పీకర్ మధుసూదనాచారి, డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్‌రెడ్డి, అసెంబ్లీ కార్యదర్శి డాక్టర్ రాజాసదారామ్ సమావేశమయ్యారు. ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు అడిగే లిఖితపూర్వకమైన ప్రశ్నలకు జాప్యం లేకుండా సంబంధిత శాఖల నుంచి సమాధానాలు పంపించేలా అధికారులను ఆదేశించాల్సిందిగా వారు ప్రదీప్ చంద్రకు సూచించారు.