రాష్ట్రీయం

నగదు దొంగల అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 13: బంజారాహిల్స్‌లో బంగారు వ్యాపారులను బెదిరించి భారీ మొత్తంలో నగదు కాజేసిన ముఠాను మంగళవారం పోలీసులు అరెస్టు చేశారు. టప్పాచబుత్ర సిఐ రాజశేఖర్, కాంగ్రెస్ నాయకుడు తిరుమలేష్ నాయుడు సహ పదిమందిని బంజారాహిల్స్ పోలీసులు అరెస్టు చేశారు. వీరి వద్ద నుంచి రూ. 52 లక్షల కొత్త 2వేల నోట్లు, ఒక స్కార్పియో వాహనం, బొమ్మ తుపాకీ, 7 సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్టు పశ్చిమ మండల డిసిపి వెంకటేశ్వరరావు తెలిపారు. బంజారాహిల్స్‌లో నోట్ల మార్పిడి కోసం వచ్చిన వారిని ఇన్‌స్పెక్టర్ రాజశేఖర్, కాంగ్రెస్ నేత తిరుమలనాయుడు టార్గెట్ చేశారు. ధీర్ అగర్వాల్, పూనంచంద్ సహ నలుగురు వ్యాపారుల నుంచి వీరు 78 లక్షలు దోచుకున్నారు. కాగా ఈనెల 6న బంగారు వ్యాపారి అగర్వాల్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న బంజారాహిల్స్ పోలీసులు ఎట్టకేలకు వారిని అరెస్టు చేశారు. వీరిలో తిరుమలేష్‌నాయుడు సహ ఇద్దరు కానిస్టేబుళ్లు హైదరాబాద్‌లోనే అరెస్టు కాగా, ఇన్‌స్పెక్టర్ రాజశేఖర్‌ను విజయవాడలో అరెస్టు అయినట్టు పోలీసులు తెలిపారు. వీరిపై చీటింగ్ కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు.

చిత్రం..దొంగల ముఠాను అరెస్టు చేసినట్లు మంగళవారం విలేఖరుల సమావేశంలో వివరిస్తున్న పశ్చిమ మండల డిసిపి వెంకటేశ్వరరావు