తెలంగాణ

కొత్తనోట్ల పంపిణీలోనూ కోత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 13: కొత్త నోట్ల పంపిణీలోనూ తెలంగాణకు కోత విధించారు. దేశ వ్యాప్తంగా కొత్త నోట్ల పంపిణీలో తెలంగాణకు దక్కాల్సిన వాటా కన్నా తక్కువ కరెన్సీ పంపించారు. తెలంగాణకు ఇప్పటి వరకు 17,500 కోట్ల రూపాయల కొత్త నోట్లను ఆర్‌బిఐ పంపించింది. వాస్తవానికి తెలంగాణకు ఇప్పటి వరకు 20వేల కోట్ల రూపాయల కొత్త కరెన్సీ పంపిణీ జరగాలి. రెండున్నర వేల కోట్ల రూపాయల వరకు కరెన్సీ తక్కువ పంపించారు. పైగా ఈ కొత్త నోట్లలో 96శాతం రెండువేల రూపాయల నోట్లే పంపించారు. 4 శాతం మాత్రమే చిన్న నోట్లు. ఈ విషయాలను ఆర్‌బిఐ అధికారులతో మంగళవారం జరిగిన సమావేశంలో ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ స్పష్టం చేశారు. నోట్లకష్టాలు మరో నెల రోజుల పాటు తప్పవని, నెల తరువాత సాధారణ పరిస్థితులు ఏర్పడతాయని ఆర్‌బిఐ అధికారులు తెలిపారు. నోట్ల రద్దు తరువాత పరిణామాలపై ఆర్‌బిఐ అధికారులు, కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ మంగళవారం నగరంలో సమావేశం ఏర్పాటు చేసి సమస్యలపై చర్చించారు. సమావేశంలో పాల్గొన్న ఆర్థిక మంత్రి ఈటల రాజేంద్ర తెలంగాణలో కరెన్సీ సమస్యలపై వివరించారు. ఆర్‌బిఐ అధికారులు చెబుతున్న వివరాల ప్రకారమే దేశ వ్యాప్తంగా నాలుగు లక్షల కోట్ల రూపాయల కొత్త నోట్ల పంపిణీ జరిగింది. జిఎస్‌డిపిలో తెలంగాణ వాటా ఐదు శాతం కాబట్టి నాలుగు లక్షల కోట్లలో 20శాతం అంటే 20వేల కోట్ల రూపాయల కొత్త కరెన్సీ తెలంగాణకు పంపిణీ చేయాలి కానీ అలా చేయలేదని 17500 కోట్ల కరెన్సీ మాత్రమే వచ్చిందని చెప్పారు. ఐదువందల రూపాయల నోట్లు పంపిస్తున్నట్టు చెప్పడమే కానీ పంపలేదన్నారు. కనీసం ఐదువేల కోట్ల రూపాయల చిన్ననోట్లు పంపితే కానీ తెలంగాణలో తీవ్రంగా ఉన్న కరెన్సీ సమస్య తీరదని చెప్పారు.
బ్యాంకు ఖాతాలు లేని వారికి పాత నోట్లు తీసుకుని కొత్త నోట్లు ఇచ్చే ఏర్పాట్లు బ్యాంకులు చేయాలని ఈటల కోరారు. తెలంగాణలో మొత్తం 1.03 కోట్ల కుటుంబాలు ఉండగా, 30 లక్షల కుటుంబాలకు అసలు బ్యాంకు ఖాతాలే లేనందున వారి వద్ద ఉన్న పాత నోట్లు ఏం కావాలని మంత్రి ఆర్‌బిఐ అధికారులను ప్రశ్నించారు. నవంబర్ 8 నుండి ఇప్పటి వరకు తెలంగాణలో 1.66లక్షల కొత్త ఖాతాలు ప్రారంభం అయినట్టు ఆర్‌బిఐ అధికారులు తెలిపారు. ఒక వైపు పేద ప్రజలు డబ్బుల కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు, మరోవైపు వేల కోట్ల రూపాయల కొత్త నోట్లు కొందరి వద్ద లభిస్తున్నాయి, బ్యాంకు అధికారులు కుమ్మక్కు కాకుండా ఇది జరిగే అవకాశమే లేదని మంత్రి అన్నారు. నగదు రహిత విధానాలకు తెలంగాణ ప్రభుత్వం పూర్తి మద్దతు తెలుపుతోందని చెప్పారు. ఆర్‌బిఐ కూడా తెలంగాణకు సహకరించాలని మంత్రి కోరారు.
రెండు రోజుల్లో మరో 1500 కోట్ల నగదు: దత్తాత్రేయ
రెండు తెలుగు రాష్ట్రాల్లో నగదు కొరత తగ్గించేందుకు మరో రెండు రోజుల్లో 1500 కోట్ల రూపాయలను ఆర్బీఐ అందుబాటులో ఉంచుతుందని కేంద్ర కార్మిక శాఖా మంత్రి బండారు దత్తాత్రేయ పేర్కొన్నారు. తెలంగాణకు మరో ఐదు వేల కోట్లు వస్తే నగదు సమస్య తీరుతుందని చెప్పారు. మంగళవారం సాయంత్రం ఆయన పిఎఫ్ కార్యాలయంలో పాత్రికేయులతో మాట్లాడుతూ దేశంలో పెద్ద నోట్లను రద్దు చేస్తూ ప్రధాని నరేంద్రమోదీ తీసుకున్న నిర్ణయానికి ప్రజల ఆమోదం ఉందని పేర్కొన్నారు. ఇప్పటికే రెండు లక్షల కోట్లు విలువైన కొత్త రెండు వేల రూపాయల నోట్లను ముద్రించడం జరిగిందని పేర్కొన్నారు. నోట్ల రద్దు అనంతర పరిణామాలు, నగదు రహిత లావాదేవీలపై ఎప్పటికపుడు సమీక్షిస్తున్నామని, ప్రజలకు ఇబ్బందులు లేకుండా నగదు అందుబాటులో ఉంచాలని ఆర్‌బిఐని కోరామని అన్నారు. రెండు రాష్ట్రాల్లో డిజిటల్ అక్షరాస్యత పెరగాలన్నారు.

చిత్రం..ఆర్‌బిఐ అధికారులతో మంగళవారం జరిగిన సమావేశంలో పాల్గొన్న తెలంగాణ ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్, కేంద్రమంత్రి దత్తాత్రేయ