తెలంగాణ

జిల్లా ప్రణాళికల ఆధారంగానే బడ్జెట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 14: ‘బడ్జెట్ రూపకల్పనలో జిల్లా ప్రణాళికలు చాలా ముఖ్యం, ఈ ప్రణాళికల ఆధారంగా బడ్జెట్ రూపకల్పన జరుగుతుంది, ఆయా జిల్లాలలో అవసరాలను గుర్తించి ప్రతిపాదనలు పంపాలి’ అని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు కలెక్టర్లను ఆదేశించారు. ప్రగతి భవన్‌లో బుధవారం మధ్యాహ్నం జరిగిన సెషన్‌లో ప్రభుత్వ కార్యక్రమాల అమలుపై ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారు. రాష్ట్రాన్ని ఆయా ప్రాంతాల్లోని భూమి స్వరూపం, స్వభావాన్ని అనుసరించి క్రాప్ కాలనీలుగా మార్చాలన్నారు. భూమి రకం, వాతావరణం, వర్షపాతం ఆధారంగా ఆ భూములు ఏ పంటకు అనుకూలమో నిర్ధారించాలని, భూసార పరీక్షలు నిర్వహించాలని, నగర ప్రాంతాల పరిసరాలలో ఎలాంటి వ్యవసాయాన్ని ప్రోత్సహించాలి, మెక్రో ఇరిగేషన్ విస్తరణ, వ్యవసాయ ప్రణాళిక తదితర అంశాలపై దృష్టి పెట్టాలని ముఖ్యమంత్రి చెప్పారు.
కలెక్టర్లకు సిఎం సూచనలు
* సమీకృత కలెక్టరేట్లు, పోలీస్ హెడ్‌క్వార్టర్స్, కోర్టు భవనాల నిర్మాణం కోసం స్థలాలను గుర్తించాలి.
* జిల్లాల్లో మానవ వనరులను గుర్తించి, వారికి శిక్షణ ఇచ్చి నగదు రహిత లావాదేవీలపై అవగాహన కల్పించాలి
* ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఒక బిసి గురుకుల పాఠశాల ఏర్పాటుకు స్థలాన్ని గుర్తించాలి.
* సాదా బైనామాలను ఆమోదించి, ఉచితంగా రిజిస్ట్రేషన్ చేసే అంశంలో కఠినంగా ఉన్న నిబంధనలను తొలగించాలి.
* నకిలీ ఎరువులు, విత్తనాలు, క్రిమిసంహారక మందులు అమ్మే వారిపై పిడి యాక్ట్ ప్రయోగించాలి. ఆహార పదార్థాల కల్తీని అరికట్టడానికి స్పెషల్ స్క్వాడ్ లుఏర్పాటు చేయాలి.
రాష్ట్ర సరిహద్దు ప్రాంతాల నుంచి ఇవి రాష్ట్రంలోకి రాకుండా నిఘా పెంచాలి.
* గ్రామీణ, గిరిజన ప్రాంతాలలో అవసరం లేకున్నా గర్భసంచుల తొలగించే ఆపరేషన్లు జరుగుతున్నాయి. వీటిని అరికట్టడానికి తీసుకోవాల్సిన చర్యలను సూచించడానికి మంత్రివర్గ ఉప సంఘం ఏర్పాటు
* మారుమూల, గిరిజన ప్రాంతాలలో పని చేసే వైద్యులకు అదనపు అలవెన్స్‌లు ఇవ్వాలి.
* వరంగల్ జిల్లా గూడెప్పాడ్‌లో కూరగాయల మార్కెట్, నర్సంపేటలో మిర్చి పరిశోధన కేంద్రం ఏర్పాటుకు అవకాశాలను పరిశీలించాలి.
* కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తయ్యే నాటికి ఎస్‌ఆర్‌ఎస్‌పి కాలువల మరమ్మతులు పూర్తి చేయాలి.
* వరంగల్లు నగరాన్ని గొప్పగా తీర్చిదిద్దడానికి ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలి. రింగ్ రోడ్డ్ నిర్మాణానికి రూ. 300 కోట్లు కేటాయింపు.
* వరంగల్లులో మామునూర్ ఎయిర్ పోర్టు పునరుద్ధరణ కోసం కేంద్రంపై ఒత్తిడి.
ఇలా ఉండగా అంతకుముందు కొత్త జిల్లాల ఏర్పాటు తర్వాత ఎదుర్కొన్న అనుభవాలను కలెక్టర్లు ఒకొక్కరుగా ముఖ్యమంత్రికి వివరించారు.

చిత్రం... బుధవారం హైదరాబాద్‌లో జరిగిన కలెక్టర్ల సమావేశంలో ‘నో యువర్ డిస్ట్రిక్, ప్లాన్ యువర్ డిస్ట్రిక్’ మార్గదర్శిని ఆవిష్కరిస్తున్న ముఖ్యమంత్రి కెసిఆర్. చిత్రంలో ఉప ముఖ్యమంత్రులు మహమూద్ అలీ, కడియం శ్రీహరి, ప్రభుత్వ ముఖ్య సలహాదారుడు రాజీవ్ శర్మ తదితరులు ఉన్నారు.