తెలంగాణ

‘పాలమూరు-రంగారెడ్డి’ని నిలిపివేయండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 14: పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల స్కీం మొదటి దశ పనులను చేపట్టకుండా చెన్నైలోని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆఫ్ సదరన్ జోన్ స్టే మంజూరు చేసింది. ఈ స్టే ఆదేశాలు వచ్చే ఏడాది జనవరి 17వ తేదీ వరకు అమలులో ఉంటాయి. ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులను పిఎస్‌రావు నేతృత్వంలోని బెంచ్ జారీ చేసింది. మహబూబ్‌నగర్ జిల్లాలో అంజనగిరి- నర్లాపూర్ గ్రామాల మధ్య పాలమూరు రంగారెడ్డి స్కీం ప్రాజెక్టు పనులను ప్రభుత్వం చేపట్టడాన్ని సవాలు చేస్తూ హైదరాబాద్‌కు చెందిన బి హర్షవర్ధన్ అనే వ్యక్తి పిటిషన్ దాఖలు చేశారు. ఎటువంటి పర్యావరణ అనుమతులు లేకుండా 279 హెక్టార్ల అటవీ భూములకు ఎటువంటి క్లియరెన్సులు లేకుండా ప్రభుత్వం ఈ ప్రాజెక్టు పనులను చేపడుతోందని పిటిషనర్ తరఫున న్యాయవాదులు బి రచనారెడ్డి, సిద్ధార్థ నాయక్ వాదనలు వినిపించారు. నల్లమల అడవుల్లోని రాజీవ్ టైగర్ రిజర్వు ఫారెస్టుపై ఈ ప్రాజెక్టు పనులు ప్రతికూల ప్రభావం చూపిస్తాయని ట్రిబ్యునల్ దృష్టికి వారు తీసుకెళ్లారు. రాష్ట్రప్రభుత్వం పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని ప్రతిష్టాకరంగా తీసుకున్న విషయం విదితమే.
ఈ ప్రాజెక్టు వల్ల మహబూబ్‌నగర్, రంగారెడ్డి, నల్లగొండ జిల్లాల్లో 12.30 లక్షల ఎకరాలకు సాగునీరు, తాగునీరు సరఫరా అవుతుంది. కృష్ణా నది వరద సమయంలో 60 రోజుల పాటు 120 టిఎంసి నీటిని ఈ ప్రాజెక్టు స్కీం కింద లిఫ్ట్ చేస్తారు.