తెలంగాణ

లైఫ్ లైన్ ప్రాజెక్టుగా మేడిగడ్డ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గోదావరిఖని, డిసెంబర్ 14: గోదావరి నుంచి వృధాగా పోతున్న నీటి నిల్వలను పరిపూర్ణంగా వినియోగంలోకి తీసుకువస్తూ, నీటి కొరతగల ప్రాంతాలకు రివర్స్ పంపింగ్ ద్వారా నిరంతరం నీటిని సరఫరా చేసే అవకాశం ఉన్నందున కాళేశ్వరం మేడిగడ్డ ప్రాజెక్ట్‌ను లైఫ్ లైన్ ప్రాజెక్ట్‌గా ప్రభుత్వం గుర్తించిందని తెలంగాణ ఆర్టీసీ చైర్మన్ సోమారపు సత్యనారాయణ తెలిపారు. బుధవారం అంతర్గాం మండలం గోలివాడ గ్రామ శివారులో 1737 కోట్ల రూపాయలతో నిర్మాణం కాబోతున్న పంప్ హౌస్ పనులకు ఆయన భూమి పూజ చేసి పనులను ప్రారంభించారు. అనంతరం ఏర్పాటయిన సభకు ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. వందల టిఎంసిల నీటిని వినియోగించుకుంటూ రాష్ట్రంలోని సాగు భూములన్నింటికి నీరు ఇచ్చేందుకు గోదావరిపై సుందిల్ల, అన్నారం, మేడిగడ్డ బ్యారేజీల నిర్మాణం, అలాగే కనె్నపల్లి, సుందిల్ల, గోలివాడలో పంప్ హౌస్‌ల ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. కోటి ఎకరాలకు నీళ్లు ఇవ్వాలని ప్రభుత్వం సిద్ధమవుతున్న క్రమంలో దానిలో సగం భూములకు మన ప్రాంతం నుంచే నీటి సరఫరా అవుతుందని, మేడిగడ్డతో రాష్ట్రం సస్యశ్యామలంగా విరాజిల్లబోతోందని స్పష్టం చేశారు. భూములు కొల్పోతున్న రైతులందరికి న్యాయమైన పరిహారం చెల్లిస్తున్నామని, ఈ విషయంలో అపోహలకు పోయి ప్రాజెక్ట్‌లను అడ్డుకోవడం సరైంది కాదని, రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ సంకల్పించిన నీటి వినియోగ యజ్ఞానికి అందరూ సహకరించాలని కోరారు. ప్రాజెక్ట్ సిఇ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఈ ప్రాజెక్ట్ పూర్తయితే రోజుకు 2 టిఎంసిల నీటిని తరలించుకోవచ్చని, 18 నెలల్లో పనులు పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. సమావేశంలో పెద్దపల్లి ఆర్డీ ఓ అశోక్ కుమార్, తహశీల్దార్ సతీష్ కుమార్, ఎంపిపి ఆడేపు రాజేశం, జడ్పిటిసి సంధ్య, సర్పంచ్ రమ్య, నేతలు అరుణ్ కుమార్, నారాయణ రెడ్డి, జలపతి, మైసయ్యతోపాటు అధికారులు పాల్గొన్నారు.

గోలివాడలో మేడిగడ్డ పంప్ హౌస్ పనులకు భూమి పూజ చేసి, పనులను ప్రారంభిస్తున్న ఆర్టీసీ చైర్మన్