తెలంగాణ

ఇంటర్నెట్ కేఫ్‌లపై దాడులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 14: హైదరాబాద్ పాతబస్తీలోని పలు ప్రాంతాల్లో గల ఇంటర్నెట్ కేఫ్‌లపై బుధవారం సౌత్‌జోన్ పోలీసులు మెరుపు దాడులు నిర్వహించారు. ఇంటర్నెట్ సెంటర్లలో అసభ్యకర, నీలి చిత్రాలు చూస్తున్న 65 మంది టీనేజర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హోంవర్కు పేరిట ఎక్కువ సేపు ఇంటర్నెట్ సెంటర్లలో గడుపుతున్నారని వచ్చిన ఫిర్యాదుల మేరకు పోలీసులు ఇంటర్నెట్ కేంద్రాలపై దాడులు జరిపారు. నిబంధనల ప్రకారం ఇంటర్నెట్ కేఫ్‌లలో సిసి కెమెరాలు ఏర్పాటు చేయకపోగా, మైనర్లను అసభ్యకర వీడియోలకు దూరంగా ఉంచాలన్న కనీస ప్రమాణాలు పాటించని 16 సైబర్ కేఫ్‌లపై పోలీసులు కేసు నమోదు చేసినట్టు సౌత్‌జోన్ డిసిపి సత్యనారాయణ తెలిపారు. అదేవిధంగా ఇటీవల పాతబస్తీలోని 92 ఇంటర్నెట్ కేఫ్‌లలో తనిఖీలు నిర్వహించామని, 37 కేసులు నమోదు చేసి, 47 మంది మైనర్లను అదుపులో తీసుకుని తల్లిదండ్రుల సమక్షంలో కౌనె్సలింగ్ నిర్వహించి, మళ్లీ ఇంటర్నెట్ కేఫ్‌ల వద్ద కనిపిస్తే చర్య తీసుకుంటామని హెచ్చరిస్తూ వదిలిపెట్టామని డిసిపి సత్యనారాయణ వివరించారు.

నిజాంసాగర్ నీటి విడుదల

నిజాంసాగర్, డిసెంబర్ 14: కామారెడ్డి జిల్లాలో రబీ పంట కోసం నిజాంసాగర్ ప్రాజెక్ట్ నీటిని బుధవారం జలవిద్యుత్ ప్రాజెక్ట్ రెండవ గేట్ ద్వారా విడుదల చేశారు. జుక్కల్ ఎమ్మెల్యే హన్మంత్ షిండే, జడ్‌పి చైర్మన్ దఫేదార్ రాజు, మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి తనయుడు సురేందర్ రెడ్డి కలిసి బటన్ నొక్కి నీటిని విడుదల చేశారు. పురోహితుడు సంజీవ్‌కుమార్ శర్మ ఆధవర్వంలో ముందుగా గంగమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించాక నీటిని విడుదల చేశారు. 720 క్యూసెక్కుల నిజాంసాగర్ ప్రాజెక్ట్ నీటిని ప్రాజెక్ట్ ప్రధాన కాల్వలోకి విడుదల చేశారు. ఈ నీరు జలవిద్యుత్ కేంద్రంలోని రెండవ టర్బయిన్ ద్వారా దిగువకు వస్తోంది. దీని వల్ల జలవిద్యుత్ కేంద్రంలో 3.8 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి కూడా జరుగుతోందని జెన్‌కో ఎడిఇ శ్రీకాంత్ తెలిపారు.

కామారెడ్డి జిల్లాలోని నిజాంసాగర్ విద్యుత్ జలాశయంనుండి నీటి విడుదల దృశ్యం
(ఇన్‌సెట్‌లో నీటిని విడుదల చేస్తున్న జుక్కల్ ఎమ్మెల్యే హన్మంత్‌షిండె)