తెలంగాణ

రూ. 7500 కోట్లకు గండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 15: పెద్ద నోట్ల రద్దు వల్ల రాష్ట్రానికి ఈ ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి (13 మార్చి 2017) రూ. 7500 కోట్ల మేరకు నష్టం వాటిల్లుతుందని రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేసింది. పెద్ద నోట్ల రద్దు ప్రకటన తర్వాత నెలకు రూ. 1500 కోట్ల నుంచి రూ. 2000 కోట్ల మేరకు రాష్ట్ర ఆదాయానికి గండిపడనుందని ప్రభుత్వం అంచనా వేసింది. రాష్ట్ర ఆదాయ రాబడికి రూ. 3000 కోట్ల మేరకు నష్టం వాటిల్లినట్టు కేంద్ర బృందానికి నివేదిక ఇచ్చిన విషయం తెలిసిందే.
శాసనసభ శీతాకాల సమావేశాల తొలి రోజు శుక్రవారం సభలో నోట్ల రద్దు వల్ల రాష్ట్ర ఆదాయానికి కలిగిన నష్టంపై ప్రభుత్వం ప్రకటన చేయనుంది. నోట్ల రద్దు వల్ల స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్, రవాణాశాఖ, అమ్మకం పన్నులు, వాణిజ్యపన్నులు, ఎక్సైజుశాఖకు ప్రధానంగా నష్టం వాటిల్లడంతోపాటు పరోక్షంగా కేంద్ర పన్నులపై రాష్ట్రానికి రావాల్సిన వాటా కూడా తగ్గనుందని అంచనా వేస్తున్నట్టు ప్రభుత్వం స్పష్టం చేయనుంది. నోట్ల రద్దువల్ల రియల్ ఎస్టేట్ రంగం రాష్ట్రంలో పూర్తిగా కుదేలైందని, దీనివల్ల 10 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులకు జీవనోపాధి లేకుండా పోయిందని ప్రభుత్వం పేర్కొంది.
స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ శాఖకు రోజుకు రూ.23 కోట్ల చొప్పున నెలకు రూ.100 కోట్లు వచ్చే మార్చి నాటికి రూ. 400 కోట్ల నష్టం వాటిల్లుతుందని అంచన వేసింది. ఎక్సైజు శాఖకు నెలకు రూ.50 కోట్ల చొప్పున వచ్చే మార్చి నాటికి రూ.250 కోట్లు, వాణిజ్య పన్నుల శాఖకు నెలకు రూ. 420 కోట్ల నుంచి 450 కోట్ల చొప్పున వచ్చే నాలుగు నెలలలో రూ. 1800 కోట్లు, రవాణాశాఖకు నెలకు రూ. 90 కోట్ల చొప్పున వచ్చే నాలుగు నెలల్లో రూ. 450 కోట్లు నష్టం వాటిల్లనుందని ప్రభుత్వం అంచన వేసింది. రాష్ట్ర ఆదాయానికి ప్రత్యేక్షంగా కలిగే నష్టమే కాకుండా పరోక్షంగా కేంద్ర పన్నుల ద్వారా రాష్ట్రానికి రావాల్సిన వాటా నెలకు రూ. 400 కోట్ల చొప్పున ఆర్థిక సంవత్సరం ముగింపు నాటికి రూ.1600 కోట్లు తగ్గే అవకాశం ఉన్నట్టు అంచన వేసింది.
నోట్ల రద్దు వల్ల రాష్ట్ర ఆదాయం తగ్గడంతో అక్టోబర్ నెలలో కేంద్ర పన్నుల నుంచి రాష్ట్రానికి రావాల్సిన రూ.956 కోట్లకుగాను రూ. 600 కోట్లు మాత్రమే వచ్చాయని, దీంతో రాష్ట్రంలో ఉద్యోగులకు, పెన్షనర్లకు వేతనాలు చెల్లించడమే కష్టతరం కాబోతుందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ దృష్టికి తీసుకెళ్లడంతో కోత విధించిన రూ. 400 కోట్లతో కలిపి నవంబర్ నెలలో రావాల్సిన రూ. 956 కోట్లతో కలిపి మొత్తంగా రాష్ట్రానికి కేంద్రం రూ.1800 కోట్లు విడుదల చేసిందని శాసనసభకు వెల్లడించడానికి ఆర్థికశాఖ నివేదిక సిద్దం చేసింది.