తెలంగాణ

యుపికి ఐఎం నిందితులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 15: దిల్‌సుక్‌నగర్ బాంబు పేలుళ్ల కేసులో దోషులుగా నిర్ధారణ అయిన ఇండియన్ ముజాహిదీన్ (ఐఎం)కు చెందిన ఐదుగురు నిందితులను దేశంలో ఇతర పేలుళ్ల ఘటనలతో సంబంధం ఉన్న అభియోగాలపై ఇతర జైళ్లకు తరలించే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం వీరు చర్లపల్లి జైలులో ఉన్నారు. ఉత్తరప్రదేశ్‌లోని వారణాసి, లక్నో, ఫైజాబాద్ పరిధిలో జరిగిన పేలుళ్ల కేసుల్లో వీరు నిందితులుగా ఉన్నారని, వీరిని వీలైనంత త్వరలో పిటి వారెంట్‌పై తరలించేందుకు నేషనల్ ఇనె్వస్టిగేషన్ టీం (ఎన్‌ఐటి) సన్నాహాలు చేస్తున్నట్లు తెలిసింది. 2008 మే నెలలో జైపూర్‌లో జరిగిన బాంబు పేలుళ్లలో 63 మంది మరణించారు.
ఈ ఘటనలో కూడా వీరు నిందితులుగా ఉండడం గమనార్హం. ఈ నెల 19వ తేదీన కోర్టు వీరికి శిక్షలను ఖరారు చేయనుంది. అనంతరం వీరిని పేలుళ్లు జరిగిన ప్రాంతాల జైళ్లకు తరలించే అవకాశం ఉంది. చర్లపల్లి జైలులో ప్రస్తుతం ఐదుగురు దోషులకు పటిష్ఠమైన భద్రత ఏర్పాట్లు చేశారు. సాయుధ బలగాలు వీరు ఉన్న సెల్ వద్ద పహారా కాస్తున్నాయి.
కాగా తమను కోర్టు దోషులుగా నిర్ధారించిన అంశంపై హైకోర్టులో ఈ నిందితులు సవాలు చేసే విషయమై తమ న్యాయవాదితో సంప్రదింపులు జరిపినట్లు తెలిసింది. అహమ్మద్ జరార్ అలియాస్ యాసిన్ భత్కల్, అసదుల్లా అక్తర్ అలియాస్ హద్దీ, జియా ఉర్ రెహమాన్ షేక్ అలియాస్ వక్వాస్, మహమ్మద్ తహ్సీన్ అక్తర్ అలియాస్ హసన్‌లు ఈ విషయమై తమ కుటుంబ సభ్యులను కోరినట్లు తెలిసింది. ఒకసారి కోర్టు తీర్పు వచ్చిన తర్వాత ప్రత్యేక ఎన్‌ఐఏ కోర్టు ఇచ్చిన తీర్పుపై హైకోర్టులో అపీల్ చేసుకునే అవకాశం నిందితులకు ఉంది.
కాగా ఈ కేసు విచారణలో పాకిస్తాన్‌కు చెందిన నిందితుడు జియా ఉర్ రెహమాన్ అలియాస్ వక్వాస్ తాలిబన్ల నుంచి శిక్షణ పొందినట్లు ఎన్‌ఐఏ విచారణలో వెల్లడైంది. తాను పాకిస్తాన్, అఫ్గానిస్తాన్ సరిహద్దులో తాలిబన్ల శిక్షణకు హాజరైనట్లు వెల్లడించారు. దిల్‌సుక్‌నగర్‌లో అమర్చిన బాంబులను వక్వాస్ తయారు చేశాడని ప్రాసిక్యూషన్ పేర్కొంది. వక్వాస్ పాకిస్తాన్‌లోని పంజాబ్‌లో గల గుజ్రా ప్రాంతానికి చెందినవాడు. భారత్‌కు వచ్చిన తర్వాత ఇక్కడ తాను వెళ్లిన ప్రాంతాలు, తాను కలుసుకున్న వ్యక్తుల వివరాలను ఎన్‌ఐఏ అధికారులకు వెల్లడించాడు.
పాకిస్తాన్‌లో లష్కరే తోయిబా శిక్షణ శిబిరాల గురించి కూడా సమాచారం ఇచ్చాడు. దిల్‌సుక్‌నగర్ పేలుళ్ల తర్వాత ఇక్కడి నుంచి నేపాల్‌కువెళ్లి అక్కడి నుంచి పాకిస్తాన్‌కు విమానంలో వెళ్లాలని ప్రయత్నిస్తూ నేపాల్ పోలీసులకు దొరికిపోయాడు.