తెలంగాణ

లంచం తీసుకున్న కేసులో మాజీ తహశీల్దార్‌కు ఏడాది జైలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 15: కరీంనగర్ జిల్లా (జయశంకర్, భూపాలపల్లి జిల్లా) మహాముత్తారం మాజీ తహశీల్దార్ కుమ్మరి బాలకిషన్‌కు ఏసిబి ప్రత్యేక కోర్టు లంచం తీసుకున్న కేసులో ఏడాది జైలు శిక్షతోపాటు రూ. 2,500లు జరిమానా విధిస్తూ తీర్పునిచ్చింది. తహశీల్దార్ బాలకిషన్ 2009, జనవరి 19న మహాముత్తారానికి చెందిన బోడ భాస్కర్ వద్ద నుంచి గ్రామ సేవకుడిగా నియామకానికి గానూ రూ. 10వేలు లంచం డిమాండ్ చేశారు. దీంతో భాస్కర్ ఏసిబి అధికారులను ఆశ్రయించాడు. తహశీల్దార్‌కు ఒప్పుకున్న రూ. 10వేలు ఇస్తుండగా ఏసిబి అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుని అవినీతి నిరోధక చట్టం కింద కేసు నమోదు చేశారు. ఈ మేరకు మాజీ తహశీల్దార్‌పై విచారణ జరిపిన ఏసిబి కోర్టు లంచం తీసుకున్న నేరం రుజువు కావడంతో అతనికి ఏడాది పాటు జైలు, రూ. 2500లు జరిమానా విధిస్తూ జస్టిస్ పి భాస్కర్ రావు తీర్పునిచ్చారు. నిందితుడు జరిమానా చెల్లించని పక్షంలో మరో మూడు నెలలు సాధారణ కారాగార శిక్ష అనుభవించాల్సి ఉంటుందని న్యాయమూర్తి తీర్పు వెలువరించారు.