తెలంగాణ

కల్తీ కల్లు తాగి 20మందికి అస్వస్థత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎల్లారెడ్డిపేట, డిసెంబర్ 15: సిరిసిల్ల రాజన్న జిల్లా వీర్నపల్లి మండలం మద్దిమళ్లలో గురువారం కల్తీ కల్లు తాగి 20 మంది అస్వస్థతకు గురయ్యారు. వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. కల్లు తాగిన వెంటనే వాంతులు చేసుకుని అపస్మారక స్థితిలోకి వెళ్లిపోగా బాధితులను ఆటోలలో ఎల్లారెడ్డిపేటలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అస్వస్థతకు గురైన వారిలో ప్యాట్ల మల్లయ్య, మాలోతు రాజు, మేడ్దుల మల్లయ్య పరిస్థితి విషమంగా ఉంది. తిమ్మాపూర్‌కు చెందిన కొండ నారాయణ గౌడ్ మద్దిమళ్లలో కల్లు దుకాణం నిర్వహిస్తున్నారు. ఆ దుకాణానికి రోజులాగే గురువారం ఉదయం కల్లు తాగిన జజ్జరి పెద్దిరాజు, ఎరవేణి దేవరాజు, మాలోతు హరిదాస్, ఇస్కిల్ల కొమురయ్య, గుంటి మల్లేశం, కడవ రాజయ్య, దయ్యాల శ్రీబాబు, ఎల్లయ్య, శ్రీనివాస్, ప్యాట్ల రవితోపాటు మరో ఏడుగురు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. తాగి పనులు చేసేందుకు పొలాలకు కొందరు వెళ్లి పడిపోగా మరికొందరు ఇళ్లకు వెళ్లి వాంతులు చేసుకుని స్పృహతప్పి పడిపోయారు. దాదాపు 20మంది ఇలా అస్వస్థతకు గురికావడంతో గ్రామం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. సర్పంచ్ సుదర్శన్, ఉప సర్పంచ్ రఫీ గ్రామస్థులతో కలసి బాధితులను ఆసుపత్రికి తరలించగా చికిత్స చేస్తున్నారు.

చిత్రం..ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కల్తీ కల్లు బాధితులు