తెలంగాణ

23్ఠణాల ఆధునీకరణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సైదాబాద్, డిసెంబర్ 15: నగరంలోని 23పోలీస్‌స్టేషన్‌లను రూ.75 ఆధునీకరించి మోడల్ ఠాణాలుగా తీర్చిదిద్దనున్నామని హోంమంత్రి నాయిని నర్సింహ్మరెడ్డి తెలిపారు. ఆధునీకరించే వాటిలో 16 శాంతిభద్రతలు, ఆరు ట్రాఫిక్, ఒక మహిళా పోలీస్‌స్టేషన్ ఉందని వివరించారు. గురువారం సైదాబాద్ పోలీస్‌స్టేషన్ నూతన భవన నిర్మాణానికి భూమి పూజచేసి శంకుస్థాపన చేశారు. 4కోట్ల 13లక్షల వ్యయంతో మూడు అంతస్థులలో నిర్మించనున్న సైదాబాద్ నూతన పోలీస్‌స్టేషన్ భవనంలో అన్ని ఆధునాతన వసతులు ఏర్పాటు చేస్తామని తెలిపారు. నగరంలోని పోలీస్‌స్టేషన్‌లన్నీ కార్పొరేట్ కార్యాలయాల తరహాలో ఆధునీకరిస్తామని అన్నారు. నగరంలోని ప్రతి పోలీస్‌స్టేషన్‌కు 75వేల రూపాయలు నెలవారి ఖర్చులకు అందజేస్తన్నామని తెలిపారు. లంచగొండితనానికి తావు లేకుండ పోలీస్ వ్యవస్థ ప్రజలకు మెరుగైన సేవలు అందించేలా తెలంగాణ ప్రభుత్వం పాటుపడుతుందని అన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న నగర పోలీస్ కమిషనర్ మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసి ఆర్ విజన్ ప్రకారం పోలీస్‌స్టేషన్‌లన్నీ సిటిజన్ ఫ్రెండ్లీగా తీర్చిదిద్దుతున్నామని అన్నారు. మోసాలు, మాదకద్రవ్యాలు, కల్తీరహిత నగరంగా హైదరాబాద్‌ను మారుస్తామని పేర్కొన్నారు. నగరం పూర్తిగా సిసి కెమెరాలు ఏర్పాటుచేసి కమాండ్ కంట్రోల్ వ్యవస్థ ఏర్పాటు ద్వారా ఎవరైనా ఎక్కడైనా నేరం చేయాలంటే భయపడేలా చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో ఐజిలు మల్లారెడ్డి, శ్రీనివాస్, మురళికృష్ణ, ప్రేమ్‌కుమార్, ప్రమోద్, ఈస్ట్‌జోన్ డిసిపి రవీందర్, ఎమ్మెల్యే ముంతాజ్‌ఖాన్, కార్పొరేట్లు సింగిరెడ్డి స్వర్ణలత శ్రీనివాస్‌రెడ్డి, సామ స్వప్నాసుందర్‌రెడ్డి, ఏసిపి సుధాకర్ పాల్గొన్నారు.

చిత్రం..గురువారం సైదాబాద్ పోలీస్‌స్టేషన్ నిర్మాణానికి భూమి పూజచేసి శంకుస్థాపన శిలాఫలకాన్ని
ఆవిష్కరిస్తున్న హోంమంత్రి నాయిని