తెలంగాణ

ఐదునెలల కొడుకును చంపేశాడు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నూతనకల్, డిసెంబర్ 15: కోర్టు కేసులో అత్త, భార్య రాజీకి రాలేదన్న కోపంతో ఐదునెలల కన్నబిడ్డను కర్కశంగా కడతేర్చాడు. ఇష్టపడి పెళ్లి చేసుకున్న రెండో భార్యపై గొడ్డలితో దాడి చేసి గాయపరిచాడు. మద్యం తాగి, కోపంతో చిందులువేసి దారుణానికి ఒడిగట్టిన ఆ వ్యక్తి మత్తుదిగాక.. భార్య, కుమారుడు మరణించారని భావించి తను ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన సూర్యాపేట జిల్లా మద్దిరాల మండలం ముకుందాపురంలో బుధవారం రాత్రి జరిగింది.ముకుందాపురం గ్రామానికి చెందిన బోర వెంకన్న (30) వరంగల్ జిల్లా ఊకల్లుకు చెందిన తన అక్క కుమార్తె గంగమ్మను 13 సంవత్సరాల క్రితం వివాహం చేసుకున్నాడు. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. ఆటో డ్రైవర్ అయిన వెంకన్న రెండేళ్ల క్రితం అదే గ్రామానికి చెందిన బోర స్వప్నను ప్రేమపేరుతో హైదరాబాద్‌కు తీసుకెళ్లి రెండవ వివాహం చేసుకున్నాడు. కొన్నిరోజుల తర్వాత వెంకన్న గ్రామానికి వచ్చి తన మొదటి భార్య గంగమ్మ, రెండవ భార్య స్వప్నతో కలిసి జీవనం కొనసాగిస్తున్నాడు. ఐదునెలల క్రితం రెండో భార్య స్వప్నకు కుమారుడు జన్మించాడు. అప్పటి నుంచి ఇద్దరి మధ్య గొడవులు మొదలయ్యాయి. వెంకన్న తన కుమార్తె స్వప్నను కిడ్నాప్ చేశాడంటూ ఆమె తల్లి గతంలో ఫిర్యాదు చేసింది. ఈ కేసు విచారణ ఇప్పుడు కోర్టులో చివరి దశకు చేరింది. కాగా కేసు విషయంలో స్వప్న, ఆమె తల్లి పద్మను రాజీ పడాలని వెంకన్న కోరాడు. కానీ అందుకు వారు ఒప్పుకోవడం లేదు. దీంతో కక్ష పెంచుకున్న వెంకన్న బుధవారం రాత్రి బాగా తాగి వచ్చి భార్య స్వప్నతో గొడవపడ్డాడు. కట్టలు తెంచుకున్న కోపంతో ఐదునెలల కుమారుడు ప్రదీప్‌ను నేలకేసి కొట్టడంతో ఆ పసికందు అక్కడికక్కడే మరణించాడు. అడ్డుకోబోయిన భార్యపై గొడ్డలితో నరకడంతో ఆమె తీవ్రంగా గాయపడి అపస్మారక స్థితిలోకి చేరడంతో 108 వాహనంలో సూర్యాపేట ఏరియా ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు తరలించారు. కుమారుడు, భార్య మరణించారని భావించిన వెంకన్న రాత్రి గ్రామ శివారులోని ఓ చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. వెంకన్న మృతదేహానికి తుంగతుర్తి ఏరియా ఆసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు మద్దిరాల ఎస్‌ఐ బలరాం నాయక్ తెలిపారు.

చిత్రాలు..తండ్రి చేతిలో హతమైన ఐదునెలల పసికందు ప్రదీప్. ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన బోర వెంకన్న .