తెలంగాణ

బాసర ట్రిపుల్ ఐటి విద్యార్థిని శ్రీజ కన్నుమూత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాసర, డిసెంబర్ 15: బాసర ట్రిపుల్ ఐటి యూనివర్శిటిలో పియుసి మొదటి సంవత్సరం విద్యనభ్యసిస్తున్న సిద్దిపేటకు చెందిన శ్రీజ బుధవారం మరణించింది. ఈనెల 1వ తేదీన ఆత్మహత్యకు ప్రయత్నించింది. కాగా ఆ విషయం గమనించిన తోటి విద్యార్థులు అప్రమత్తమవడంతో శ్రీజను రక్షించి హైదరాబాద్ నిమ్స్‌కు తరలించారు. పదిహేను రోజులుగా చికిత్స పొందుతున్న శ్రీజ బుధవారం తుదిశ్వాస విడిచింది. కాగా ఆమె మృతిపట్ల ట్రిపుల్ ఐటీ యాజమాన్యం, సిబ్బంది, విద్యార్థులు సంతాపం వ్యక్తం చేస్తూ రెండు నిముషాల వౌనం పాటించారు. శ్రీజ ఆత్మకు శాంతి చేకూరాలని కళాశాల వైస్ ఛాన్స్‌లర్ సత్యనారాయణ, ఎవొ రాజేశ్వర్ అన్నారు.
నామమామాత్రంగానే విచారణ
బాసర ట్రిపుల్ ఐటి యూనివర్శిటిలో పియుసి మొదటి సంవత్సరం చదువుతున్న ఎస్.శ్రీజ ఈ నెల 1వ తేదిన కళాశాలలోని వసతిగది బాత్‌రూమ్‌లో ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. గమనించిన తోటి విద్యార్థినులు శ్రీజను కళాశాల సిబ్బందితో కలిసి నిజామాబాద్ ఆసుపత్రికి తరలించారు. అక్కడినుంచి మెరుగైన చికిత్స కోసం శ్రీజను హైదరాబాద్‌కు తరలించారు. హైదరాబాద్‌లోని యశోద, నిమ్స్‌లలో చికిత్స చేయించారు. చివరకు నిమ్స్‌లో చికిత్స పొందుతూ 15 రోజుల అనంతరం శ్రీజ బుధవారం మరణించడంతో కుటుంబ సభ్యులు రోదనలు మిన్నంటాయి. గత సంవత్సరం కూడా ట్రిపుల్ ఐటికి చెందిన ఓ విద్యార్థిని ఇంటి వద్దే ఆత్మహత్యకు పాల్పడింది. తన సూసైడ్‌నోట్‌లో కళాశాలకు చెందిన లెక్చరర్ వేధింపుల కారణంగానే ఆత్మహత్యకు పాల్పడినట్లు సూసైడ్ లెటర్ రాసినప్పటికి కళాశాల యాజమాన్యం ఆ ఘటనపై కమిటి వేయలేదు.
ఆ సంఘటనతో ప్రమేయం ఉందన్న ఆరోపణలు ఎదుర్కొన్న మెంటర్‌పై చర్యలు తీసుకోలేదు. శ్రీజ సంఘటన జరిగి 15 రోజులు గడుస్తున్నప్పటికి కళాశాల యాజమాన్యం ఇప్పటి వరకు ఏ అధికారిపై చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు.
వారి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు ఈనెల డిసెంబర్ 7న కళాశాల యూనివర్సిటికి చేరుకుని శ్రీజ ఆత్మహత్యకు కారకులను శిక్షించాలని కళాశాల వైస్ ఛాన్స్‌లర్‌ను కోరారు. శ్రీజ ఆత్మహత్య ఘటనలో కౌన్సిలింగ్ పేరిట ఓ అధికారి తీవ్రంగా వేధించాడని, ఆ అధికారిపై చర్యలు తీసుకోవాలని శ్రీజ తల్లిదండ్రులు కోరినప్పటికి అధికార యంత్రాంగం నామమాత్రపు విచారణ చేపట్టి చేతులు దులుపుకున్నారని విమర్శలు వస్తున్నాయి.

నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందిన శ్రీజ
శ్రీజ (ఫైల్ ఫొటో)