తెలంగాణ

మే 19న ఐసెట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరంగల్: 2016- 17 విద్యాసంవత్సరానికి ఎంబిఏ, ఎంసిఏలో ప్రవేశాలకు ఐసెట్ - 2016 మే 19వ తేదీన నిర్వహించడానికి ఏ ర్పాట్లు చేసినట్లు ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ పాపిరెడ్డి, ఐసెట్ కన్వీనర్ ప్రొఫెసర్ ఓంప్రకాష్ తెలిపారు. హైదరాబాద్‌లో గురువారం ఐసెట్‌కు సంబంధించిన వివరాలను వారు వెల్లడించారు. ఫిబ్రవరి 24వ తేదీన నోటిఫికేషన్ విడుదల అవుతుందని, మార్చి 1వ తేదీ నుండి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని ఆయన తెలిపారు. ఎలాంటి అపరాధ రుసుము లేకుండా ఏప్రిల్ 5వరకు దరఖాస్తులు చేసుకోవచ్చని అన్నారు. రూ. 500 అపరాధ రుసుముతో ఏప్రిల్ 6వ తేదీ వరకు, 2వేల అపరాధ రుసుముతో ఏప్రిల్ 25 వరకు, 5వేల అపరాధ రుసుముతో మే 5వ తేదీ వరకు, 10వేల అపరాధ రుసుముతో మే 16 వరకు దరఖాస్తులు చేసుకోవచ్చన్నారు. ఈ విషయాన్ని గమనించి విద్యార్థులు తమ దరఖాస్తులను ఆన్‌లైన్‌లో సమర్పించాలన్నారు.