తెలంగాణ

ముస్లిం రిజర్వేషన్లకు కాంగ్రెస్ మద్దతు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 18: ముస్లిం బిసిలకు 12శాతం రిజర్వేషన్లు కల్పించే అంశంలో తాము పూర్తి మద్దతుగా ఉన్నామని తెలంగాణ పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, సిఎల్‌పి నాయకుడు కె జానారెడ్డి తెలిపారు. బిసి రిజర్వేషన్లపై రాష్ట్ర బిసి కమిషన్ అభిప్రాయ సేకరణ జరపుతోంది. బిసి కమిషన్ చైర్మన్ బిఎస్ రాములు, కమిషన్ సభ్యులకు పార్టీ తరఫున ఆదివారం లేఖ అందజేశారు. న్యాయపరమైన సమస్యలు ఉత్పన్నం కాకుండా చూసే బాధ్యత బిసి కమిషన్ నిర్వర్తించాలని సూచించారు. శాసన మండలి సభ్యులు షబ్బీర్ అలీ మాట్లాడుతూ గోపాల్ కిషన్ కమిషన్, సుధీర్ అధ్యయన కమిషన్, సచార్ కమిషన్, అమితాబ్ కుంద్ కమిషన్, జస్టిస్ రంగనాథ మిశ్రా కమిషన్ , జస్టిస్ దాళ్వా సుబ్రమణ్య కమిషన్‌లు అన్నీ ముస్లింలు దశాబ్దాలుగా సామాజికంగా విద్యా, ఉద్యోగ, ఆర్థిక రంగాల్లో పూర్తి నిర్లక్ష్యానికి, వివక్షకు గురయ్యాయని నిర్ధారించినట్టు చెప్పారు. బిసి కమిషన్ కేవలం సుధీర్ అధ్యయన కమిషన్ నివేదిక మీదనే ఆధారపడవద్దని, వాస్తవాల సేకరణకు జిల్లాల్లో ముస్లింలు ఎక్కువ సంఖ్యలో ఉండే ప్రాంతాల్లో పర్యటించాలని కోరారు. హైకోర్టు, సుప్రీంకోర్టుల్లో ఇప్పటికే ముస్లిం రిజర్వేషన్లపై న్యాయపరమైన సమస్యలు ఎదుర్కొంటున్న విషయాన్ని గుర్తించాలని సూచించారు. లోతైన అధ్యయనం చేయకుండా నివేదిక అందజేస్తే న్యాయస్థానాల్లో ఇబ్బందులు వస్తాయని చెప్పారు. నివేదిక ఇచ్చే ముందు కమిషన్ రాష్టమ్రంతటా పర్యటించాలని ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి కోరారు. వెంటనే రిజర్వేషన్లు అమలు చేసే విధంగా తక్షణం నివేదిక ఇవ్వాలని మరో ఎమ్మెల్యే డికె అరుణ కోరారు. ముస్లిం మైనారిటీ సంస్థల నుండి ప్రతినిధులు, పలువురు వ్యక్తిగతంగా కమిషన్ ముందు హాజరై లిఖిత పూర్వకంగా అభిప్రాయాలను వెల్లడించారు.

చిత్రం..బిసి కమిషన్ చైర్మన్ బిఎస్ రాములు, సభ్యులకు కాంగ్రెస్ పార్టీ తరఫున
ఆదివారం లేఖ అందజేస్తున్న పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి. చిత్రంలో షబ్బీర్ అలీ తదితరులు ఉన్నారు