తెలంగాణ

డబుల్ బెడ్‌రూమ్‌కు ఆధునిక పరిజ్ఞానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: నాణ్యత, తక్కువ వ్యయం, ఆధునిక పరిజ్ఞానంతో డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లను నిర్మించేందుకు ప్రభుత్వం వివిధ సంస్థలతో చర్చలు జరుపుతోంది. నల్లగొండ జిల్లా సూర్యాపేట, తుంగతుర్తి రెండు నియోజక వర్గాల్లో తొలుత ప్రయోగాత్మకంగా నూతన పరిజ్ఞానంతో డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను నిర్మిస్తారు. హుద్‌హుద్ తుఫాన్‌లో గూడు కోల్పోయిన వారికి నూతన పరిజ్ఞానంతో తక్కువ సమయంలో ఇళ్లు నిర్మించిన ఏజెన్సీలతో విద్యుత్, ఎస్సీ సంక్షేమ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి చర్చలు ప్రారంభించారు. హైదరాబాద్ నగర శివార్లలో ఆధునిక పరిజ్ఞానంతో నిర్మించిన విల్లాలను నల్లగొండ జిల్లా రోడ్లు భవనాలు, గృహ నిర్మాణ శాఖ అధికారులతో కలిసి జగదీశ్‌రెడ్డి ఆదివారం పరిశీలించారు. వీటిని నిర్మించిన వారి అంచనా ప్రకారం ప్రయోగాత్మకంగా సూర్యాపేటలో ఎనిమిది బ్లాకుల్లో నిర్మించే 192 డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణానికి 10 కోట్ల 17లక్షల 14 వేలు ఖర్చవుతుందని అంచనా వేశారు. పట్టణ ప్రాంతాల్లో నిర్మించే ఇండ్ల విస్తీర్ణం 560 చదరపు అడుగులు. చదరపు అడుగు వ్యయం 946 రూపాయలుగా ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ఈ ఆధునిక పరిజ్ఞానం ప్రకారం ఒక చదరపు అడుగు వ్యయం 920 రూపాయలు అవుతోంది. ప్రభుత్వం నిర్ణయించిన ధర కన్నా ఇది చదరపు అడుగుకు 26 రూపాయలు తక్కువ వ్యయం అవుతుంది. పైగా ఆధునిక పరిజ్ఞానంతో తక్కువ సమయంలో నిర్మించవచ్చు. సూర్యాపేట పట్టణంలో గొల్ల బజార్‌లో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణానికి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు శంకుస్థాపన చేశారు. నార్సింగ్‌లో నిర్మించిన విల్లాలలను ఆదివారం పరిశీలించిన వారిలో మంత్రి జగదీశ్‌రెడ్డితో పాటు గృహ నిర్మాణ శాఖ పిడి రాజ్‌కుమార్, రోడ్లు భవనాల శాఖాధికారి మోహన్ నాయక్ తదితరులు ఉన్నారు.

చిత్రం... నగర శివార్లలోని విల్లాల్లో చేపడుతున్న ఆధునిక
సాంకేతిక నిర్మాణ పద్ధతులను పరిశీలిస్తున్న మంత్రి జగదీశ్‌రెడ్డి