తెలంగాణ

ఎంసెట్ లీకేజిపై రగడ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 19: రాష్ట్రంలో ఇటీవలి ఎంసెట్ ప్రశ్నా పత్రాల లీకేజి వ్యవహరం సోమవారం సభను కుదిపేసింది. రాష్ట్రంలో సంచలనం రేకిత్తించిన ఎంసెట్ లీకేజీకి సంబంధించిన వివరాలను ప్రభుత్వం వివరించాలని, అందుకు సంబంధించిన దోషులలో ఎందరిని అరెస్ట్ చేశారని ప్రశ్నిస్తూ ప్రతిపక్ష పార్టీలు పట్టుబట్టాయి. ఈ విషయంలో ప్రభుత్వం తరపున సరైన సమాధానం రాకపోవడంతో కాంగ్రెస్ సభ్యులు వాకౌట్ చేశారు. అంతకు ముందు సభ్యులు మహ్మద్ అలీ షబ్బీర్, ఎం.రంగారెడ్డి, పొంగులేటి సుధాకర్‌రెడ్డి, అకుల లలితలు అడిగిన ప్రశ్నకు ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి సమాదానం ఇచ్చారు. ఎంసెట్ పరీక్ష లీకేజి అంశాన్ని హైదరాబాద్‌లోని తెలంగాణ సిఐడి దర్యాప్తు చేస్తుందని, ఇప్పటికి వరకు నిర్వహించిన దర్యాప్తులో ఢిల్లీ, ముంబై, బీహర్, కర్నాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన కొంతమంది బ్రోకర్లు, వారికి సహకరించిన వారిలో 49 మంది నిందితులను అరెస్ట్ చేయడం జరిగిందన్నారు. వీరి వద్ద నుండి రూ.2.87కోట్ల నగదుతో పాటు రూ.34లక్షల విలువ చేసే ఫ్లాట్, కార్లు తదితరు సామాగ్రిని జప్తు చేయడం జరిగిందన్నారు. ఎంసెట్ పేపర్ లీకేజీకి సంబందించి 155 మందిపై కేసులు నమోదు చేసి దర్యాప్తు ముమ్మరం చేశామన్నారు. ఈ కేసులో పలుకుబడి కలిగిన వారెందరున్నా వారిని విడిచిపెట్టే ప్రసక్తే లేదన్నారు. పేపర్ లీకేజికి సంబంధించి ముందు మంత్రి రాజీనామా చేసి విచారాణ చేపట్టాల్సి ఉండేదని, కంచె చేను మేసిన్నట్లుందని సభ్యుడు రంగారెడ్డి ప్రభుత్వంపై ద్వజమెత్తారు.