తెలంగాణ

శివానంద ఎమినెంట్ సిటిజెన్‌లుగా రంగరాజన్, శ్రీ్ధరన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 20: సనాతన ధర్మ చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో ‘శివానంద ఎమినెంట్ సిటిజన్ అవార్డు 2016’ ప్రదానోత్సవ సభ బుధవారం జరగనుంది. సికిందరాబాద్ టివోలీ గార్డెన్‌లో సాయంత్రం ఆరు గంటలకు నిర్వహించనున్న ఈ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమానికి గవర్నర్ నరసింహన్ ముఖ్య అతిధిగా, పద్మవిభూషణ్ అవార్డు గ్రహీత, కౌన్సిల్ ఆఫ్ ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్(బెంగుళూరు) చైర్మన్ డా.పి.రామారావు గౌరవ అతిధిగా హజరవుతారని మేనేజింగ్ ట్రస్టీ కె.బసవరాజు ఓ ప్రకటనలో తెలిపారు. ఈ ఏట అవార్డులను పద్మవిభూషణ్ అవార్డు గ్రహీత, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ గవర్నర్ డా.సి.రంగరాజన్‌లకు ప్రదానం చేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. అలాగే మరో పద్మ విభూషణ్ అవార్డు గ్రహీత డా.ఇ.శ్రీ్ధరన్‌లకు అందజేయనున్నట్లు ఆయన తెలిపారు. వీరిలో రంగరాజన్ ప్రదాన మంత్రికి ఆర్థిక సలహాదారుడుగా, 12వ ప్రణాళిక సంఘం చైర్మన్‌గా, రిజర్వు బ్యాంకు గవర్నర్‌గా అత్యుత్తమ సేవలందించారు. అలాగే డా.ఇ.శ్రీ్ధరన్ కూడా రైల్వే శాఖలో డివిజన్ సూపరింటెండెంట్‌గా, చీఫ్ ఇంజనీర్‌గా, వెస్టర్న్ రైల్వేశాఖకు జనరల్ మేనేజర్‌గా, చీఫ్ మేనేజింగ్ డైరెక్టర్‌గా కూడా సేవలందించారు. మెట్రోమెన్‌గా పేరుగాంచిన శ్రీ్ధరన్ దేశ రాజధానిలో 180 కిలోమీటర్ల పొడువున ఏర్పాటు చేసిన దిల్లీ మెట్రోకు బాధ్యతాయుతమైన సేవలందించటంతో పాటు దేశంలోని వివిధ ప్రాంతాల్లో మెట్రోరైలు ప్రాజెక్టులకు స్ఫూర్తిదాయకుడిగా నిలిచారు.