తెలంగాణ

350 కోట్లతో కొత్తగా 1436 మినీ బస్సులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 20: తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థను పటిష్టపరచడానికి అనేక చర్యలు తీసుకుంటున్నామని, వచ్చే నెల 350 కోట్లతో కొత్తగా 1436 మినీ బస్సులను ప్రవేశపెడతామని రవాణా మంత్రి పి మహేందర్‌రెడ్డి మంగళవారం నాడు శాసనసభలో చెప్పారు. అన్ని జిల్లా కేంద్రాల నుండి హైదరాబాద్‌కు ఎసి బస్సులను నడపుతామని పేర్కొన్నారు. కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు, దాస్యం వినయ్ భాస్కర్, ఆశన్నగారి జీవన్‌రెడ్డి తదితరులు అడిగిన ప్రశ్నలకు మంత్రి బదులిస్తూ హైదరాబాద్ నగరంలో నడుపుతున్న బస్సులపై ప్రతి సంవత్సరం కార్పొరేషన్‌కు వస్తున్న నష్టాలను జిహెచ్‌ఎంసి ద్వారా తిరిగి చెల్లించడం జరుగుతోందని, 2015-16 ఆర్థిక సంవత్సరానికి 336.40 కోట్లు మొత్తాన్ని విడుదల చేసిందని అన్నారు. 2013 ఆర్‌పిఎస్ భారాన్ని ఎదుర్కోవడానికి సంస్థకు సహాయంగా ప్రభుత్వం 600 కోట్లు మొత్తాన్ని ఇచ్చిందని అన్నారు. పాత బస్సుల స్థానంలో కొత్త బస్సుల కొనుగోలు, బస్సుల సంఖ్యను పెంచడానికి మినీ బస్సులతో సహా 1436 బస్సుల సేకరణ కోసం ఆర్థిక సాయంగా 350 కోట్ల రూపాయిలను సమకూర్చామని తెలిపారు. రవాణా శాఖ క్రమబద్ధ తనిఖీల ద్వారా అక్రమ ఆపరేటర్లు అధిక బరువును ఎక్కించకుండా అరికట్టడానికి రవాణా శాఖ, టిఎస్ ఆర్‌టిసి అధికారులతో ఒక సమన్వయ కమిటీని ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. ఆర్టీసీ నిర్వహణ సామర్థ్యాన్ని పెంచడానికి కూడా అనేక చర్యలు చేపట్టామని తెలిపారు. ఇంటి వద్దకే సర్వీసు అనే ఉద్దేశ్యంతో తెలంగాణలోని నగరాల మధ్య సర్వీసులను నడపడం కోసం 21 సీట్ల సామర్థ్యం ఉన్న వంద మినీ ఎసి బస్సులను సంస్థ కొనుగోలు చేసిందని చెప్పారు. కండక్టర్లు లేకుండా తక్కువ ఆక్యుపెన్సీ, తక్కువ దూరపు గ్రామీణ రూట్లలో నాన్ ఎసి మినీ బస్సులను కూడా ప్రవేశపెడుతున్నామని వివరించారు.