తెలంగాణ

త్వరలో 69,706 వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లకు అనుమతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 20: తెలంగాణ రాష్ట్రంలో త్వరలో 69,706 వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లకు అనుమతి మంజూరు చేయనున్నట్టు విద్యుత్ శాఖ మంత్రి జగదీష్‌రెడ్డి మంగళవారం నాడు శాసనసభలో తెలిపారు. ఇప్పటికే రాష్ట్రంలో 21.64 లక్షల విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయని వెల్లడించారు. గోవర్ధన్ బాజిరెడ్డి, ఆళ్ల వెంకటేశ్వరరెడ్డి అడిగిన ప్రశ్నలకు ఆయన బదులిస్తూ, విద్యుత్ శాఖలో పనిచేస్తున్న అవుట్‌సోర్సింగ్ సిబ్బందిని క్రమబద్ధీకరించనున్నట్టు తెలిపారు. సిబ్బంది కొరతను త్వరలో తీరుస్తామని, అలాగే ఇళ్ల మీద నుండి విద్యుత్ లైన్లు ఉండటం వల్ల ఇబ్బందులు లేకుండా రాష్టవ్య్రాప్తంగా అలా ఇళ్లపై నుండి విద్యుత్ లైన్లు ఉన్న వాటిని ఒకేసారి తొలగించాలని నిర్ణయించినట్టు తెలిపారు. ఇందుకు ఎంత ఖర్చవుతుందో లెక్కలు వేయమని కోరామని, అందుకు సరిపడా బడ్జెట్ రూపొందించి ఒకేసారి ఈ కార్యక్రమాన్ని పూర్తి చేస్తామని వెల్లడించారు. పెండింగ్‌లో ఉన్న వ్యవసాయ పంప్‌సెట్ల కనెక్షన్ల ప్రక్రియను మే 2017 నాటికి పూర్తి చేస్తామని ఆయన చెప్పారు.