తెలంగాణ

స్టేషన్ ఘన్‌పూర్‌లో మెగా లెదర్ పార్క్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 20: జనగామ జిల్లా స్టేషన్ ఘన్‌పూర్ నియోజకవర్గంలో 270.10 కోట్ల రూపాయల వ్యయంతో 117.02 ఎకరాల విస్తీర్ణంలో మెగా లెదర్ పార్కును ఏర్పాటు చేస్తున్నట్టు ఐటి, పరిశ్రమల మంత్రి కె తారకరామారావు మంగళవారం నాడు శాసనసభలో చెప్పారు. ప్రశ్నోత్తర కార్యక్రమంలో తాటికొండ రాజయ్య, ఆరూరి రమేష్ తదితరులు అడిగిన ప్రశ్నలకు మంత్రి బదులిస్తూ లెదర్ పార్కు మంజూరును, కేంద్రప్రభుత్వ భారత తోళ్ల అభివృద్ధి కార్యక్రమం పథకం కింద 105.00కోట్ల మొత్తాన్ని కోరుతూ కేంద్ర ప్రభుత్వ పారిశ్రామిక విధానం, అభివృద్ధి శాఖకు ఒక ప్రతిపాదనను సమర్పించామని చెప్పారు. కేంద్రప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం ఆమోదించిన తేదీ నుండి రెండేళ్లలో దానిని పూర్తి చేయాల్సి ఉంటుందని మంత్రి చెప్పారు. దీంతో పాటు రాష్ట్రంలో మరో 9 మినీ మెగా ప్రాజెక్టులను ఏర్పాటు చేస్తున్నట్టు మంత్రి చెప్పారు. ఈ ప్రాజెక్టు వల్ల పాతిక వేల మందికి ఉపాధి దక్కుతుందని మంత్రి వివరించారు. కేంద్రం 105 కోట్లు ఇస్తే మిగిలిన మొత్తాన్ని రాష్ట్రం భరిస్తుందని తెలిపారు.