తెలంగాణ

నల్లమలలో మళ్లీ కలకలం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబ్‌నగర్, డిసెంబర్ 20: నల్లమల అటవీ ప్రాంతంలో మళ్లీ కలకలం రేగింది. మూడేళ్ల క్రితం విదేశీయులకు చెందిన డిబిర్స్ అనే వజ్రాల కంపెనీకి నల్లమల అటవీ ప్రాంతంలో వజ్రాల తవ్వకానికి కేంద్రం అప్పట్లో గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. అయితే ఆ కంపెనీ కృష్ణానది తీరాన నల్లమల అటవీ ప్రాంతంతోపాటు పక్కనే ఉన్న కర్ణాటక రాష్ట్రంలో కృష్ణానది తీరమంతా వజ్రాలు ఉన్నట్లు గుర్తించేందుకు ఐదువందల నుండి వెయ్యి ఫీట్లలోపు బోర్లు డ్రిల్లింగ్ చేశారు. ఈ నేపథ్యంలో నల్లమల అటవీ ప్రాంతంలోని చెంచు జాతి మనుగడకే గొడ్డలి పెట్టులాంటిదని డిబిర్స్‌కు వ్యతిరేకంగా ఆందోళనలు చేపట్టి మహబూబ్‌నగర్ కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడించడంతో పాటు హైదరాబాద్‌కు పాదయాత్ర చేసి తవ్వకాలను నిలిపివేయాలని ధర్నాకు దిగారు. దీంతో అప్పటి కేంద్రంలోని యుపిఏ ప్రభుత్వం, రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం వెనుకడుగు వేసింది. అప్పటినుండి నల్లమల ప్రాంతంలో ఎలాంటి తవ్వకాలు ఉండబోవని చెంచులు భావించారు. అయితే ప్రస్తుతం నల్లమల అటవీ ప్రాంత ప్రజలపై మరో పిడుగు పడింది. ఇటీవలి కాలంలో కేంద్ర పభుత్వం వన్యప్రాణుల సంరక్షణ బోర్డు సైతం అనుమతించడంతో నాగర్‌కర్నూల్ జిల్లా అమ్రాబాద్, పదర, లింగాల, అచ్చంపేట, ఉప్పునుంతల, బల్మూర్, కొల్లాపూర్, పెద్దకొత్తపల్లి మండలాల పరిధిలోని నల్లమల అటవీలో యురేనియం తవ్వకాలకు సంబంధించి సర్వేకు సిద్ధమవుతున్న నేపథ్యంలోనే చెంచులకు మద్దతుగా కాంగ్రెస్ పార్టీతోపాటు చెంచు సంఘాలు, ఇతర కుల, ప్రజాసంఘాలు ఆందోళన బాట పట్టాయి. మంగళవారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన పాదయాత్ర రెండవ రోజుకు చేరుకుంది. అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే వంశీకృష్ణ ఆధ్వర్యంలో దట్టమైన నల్లమల అటవీలోని పదర మండల కేంద్రం నుండి పాదయాత్ర ప్రారంభమైంది. అచ్చంపేట ఆర్డీఓ కార్యాలయం వరకు ఈ యాత్ర కొనసాగనుంది. ఈ యాత్రలో ప్రజాసంఘాలు, అన్ని కులసంఘాలు కాంగ్రెస్ పార్టీ చేపట్టిన పాదయాత్రలో పాల్గొని యురేనియం తవ్వకాలకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన అనుమతులను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నేత, మాజీ ఎమ్మెల్యే వంశీకృష్ణ మాట్లాడుతూ నల్లమల అటవీ ప్రాంతంలో వన్యప్రాణులతో పాటు వందల రకాల ఔషధ మొక్కలు, మానవళికి ఉపయోగపడుతున్నాయని, ఇలాంటి ప్రదేశంలో యురేనియం ఖనిజ నిక్షేపాల తవ్వకాల కోసం అనుమతించడం ఏమిటని ఆయన ప్రశ్నించారు. యురేనియం తవ్వకాలకు రాష్ట్ర ప్రభుత్వం ఎలా ఒప్పుకుందని ప్రశ్నించారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని, లేనిపక్షంలో చెంచులతో కలిసి అసెంబ్లీని ముట్టడిస్తామని ఆయన హెచ్చరించారు.

చిత్రం.. నల్లమల అటవీ ప్రాంతంలోని పదర నుండి అచ్చంపేటకు పాదయాత్ర చేస్తున్న మాజీ ఎమ్మెల్యే వంశీకృష్ణ, కాంగ్రెస్ నాయకులు.