తెలంగాణ

ఆయకట్టుకు సాగునీరు ఇవ్వాల్సిందే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబ్‌నగర్, డిసెంబర్ 20: కోయిల్‌సాగర్ ఆయకట్టుకు సాగునీరు వదలాల్సిందేనని, యాసంగి సీజన్ ప్రారంభమై నెల రోజులు గడుస్తున్నా తమ పొలాలకు సాగునీరు ఎందుకు విడుదల చేయడం లేదని మహబూబ్‌నగర్ ఎంపి జితేందర్‌రెడ్డి, దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డిలను కోయిల్‌సాగర్ ఆయకట్టు రైతులు నిలదీశారు. మంగళవారం కోయిల్‌సాగర్ ప్రాజెక్టు దగ్గర మహబూబ్‌నగర్ జిల్లా కలెక్టర్ రోనాల్డ్ రోస్ కోయిల్‌సాగర్ ప్రాజెక్టుపై, మిషన్ భగీరథ పనుల పురోగతిపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఎంపి జితేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి హాజరయ్యారు. సమావేశం ప్రారంభంలోనే కోయిల్‌సాగర్ ఆయకట్టు రైతులు సాగునీరు వదలాలని కలెక్టర్‌ను కోరారు. అనంతరం సమావేశానికి ఎంపి, ఎమ్మెల్యే విచ్చేశారు. వెంటనే కోయిల్‌సాగర్ ప్రాజెక్టు ఆయకట్టు పరిధిలోని కోయిలకొండ, మరికల్, ధన్వాడ, చిన్నచింతకుంట, దేవరకద్ర మండలాల పరిధిలోని వివిధ గ్రామాల రైతులు సమావేశంలోకి చొచ్చుకొచ్చారు. ఆయకట్టు చైర్మన్ ఉమామహేశ్వర్‌రెడ్డి ముందుగా ఎంపి, ఎమ్మెల్యేను ప్రశ్నిస్తూ యాసంగి సీజన్ ప్రారంభమై నెలరోజులు గడుస్తున్నా ఆయకట్టుకు సాగునీరు ఎందుకు వదలడం లేదని, తక్షణమే నిర్ణయం తీసుకుని 12 వేల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు వదలాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే కల్పించుకుని రాజకీయం చేయొద్దని ఎదురుదాడికి దిగారు. ఎంపి, ఎమ్మెల్యే వెంట ఉన్న టిఆర్‌ఎస్ నాయకులు రైతులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో ఎవరినీ అడగలేదని, ప్రాజెక్టు గురించి ఎవరూ పట్టించుకోకపోయినా ప్రస్తుతం ఎంపి, ఎమ్మెల్యేను ప్రశ్నిస్తారా అంటూ రైతులపైకి తిరగబడ్డారు. రైతులు సైతం ఎదురుదాడికి దిగారు. గతంలో 12 వేల ఎకరాలకు సాగునీరు అందిందని ప్రాజెక్టులో డెడ్ స్టోరేజీ వరకు నీరు ఉన్న సాగునీటికి ఇబ్బంది పెట్టలేదని, ప్రస్తుతం 28 అడుగుల నీటి సామర్థ్యం ఉన్న ఎందుకు నీటిని వదలడం లేదని టిఆర్‌ఎస్ నాయకులతో రైతులు వాగ్వాదానికి దిగారు. జితేందర్‌రెడ్డి కల్పించుకుని సంక్రాంతిలోపు అధికారులతో చర్చించి నీటిని విడుదల చేస్తామని హామీ ఇచ్చారు. కుడి ఎడమ కాలువల పరిధిలోని 8 వేల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు వదలాల్సిందేనని రైతులు డిమాండ్ చేశారు. ఈ ప్రాజెక్టు ద్వారానే డిసెంబర్ చివరి నాటికి మిషన్ భగీరథ ట్రయల్ రన్ చేయాల్సి ఉందని ఎమ్మెల్యే వెంకటేశ్వర్‌రెడ్డి అనగానే, రైతులు కల్పించుకుని ట్రయల్ రన్ చేసినా సాగునీటి విడుదలకు ఇబ్బంది ఉండదని, తాము నారుమళ్లు సిద్ధం చేసుకున్నామని, నీటిని వదిలి ఆదుకోవాలని కోరారు. త్వరలోనే సాగునీటి సలహా సంఘం సమావేశం ఏర్పాటు చేస్తామని రైతులు సహనం పాటించాలని ఎంపి జితేందర్‌రెడ్డి రైతులకు తెలిపారు.

చిత్రం..కోయిల్‌సాగర్ ఆయకట్టుకు సాగునీరు వదలాలని ఎంపి, ఎమ్మెల్యేను కోరుతున్న ఆయకట్టు రైతులు