తెలంగాణ

మూడేళ్లలో రెండువేల మెగావాట్ల పవన విద్యుదుత్పత్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: వచ్చే మూడేళ్లలో రాష్ట్రంలో రెండు వేల మెగావాట్ల పవన విద్యుత్‌ను ఉత్పత్తి చేయాలని తెలంగాణ రాష్ట్రం లక్ష్యంగా పెట్టుకుంది. దీనికి సంబంధించిన విధి విధానాలతో కూడిన ముసాయిదా పత్రాన్ని తెలంగాణ సంప్రదాయేతర ఇంధన వనరుల సంస్థ వెబ్‌సైట్‌లో ఉంచింది. పవన విద్యుత్‌ను ఉత్పత్తి చేసేందుకు ముందుకు వచ్చే పారిశ్రామికవేత్తలకు వంద శాతం పన్ను మినహాయింపులతో పాటు ప్రోత్సాహకాలు ఉంటాయి. రాష్ట్రంలో 4,244 మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేసే వనరులు ఉన్నాయి. భూసేకరణకు భూమి సీలింగ్ పరిమితి అడ్డుకాదని కూడా పేర్కొన్నారు. ఐదేళ్ల పాటు వ్యాట్, ఎస్‌జిఎస్‌టి పన్నులు ఉండవు. వంద శాతం స్టాంపు డ్యూటీని మినహాయిస్తున్నట్లు పరిశ్రమల శాఖ పేర్కొంది. కాలుష్య నియంత్రణ మండలి నుంచి కూడా నిరభ్యంతర ధ్రువపత్రం అక్కర్లేదు. ఇక్కడ ఉత్పత్తి అయిన విద్యుత్‌ను రాష్ట్రంలోనే వినియోగిస్తారు. ఏకగవాక్ష పథకం కింద అన్ని అనుమతులు ఒకేచోట లభిస్తాయి.
కానిస్టేబుల్ అజీముద్దీన్‌కు
కమిషనర్ అభినందన
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, మార్చి 1: నగరంలోని మహంకాళి ట్రాఫిక్ పోలీసు స్టేషన్‌లో పనిచేస్తున్న కానిస్టేబుల్ సయ్యద్ అజీముద్దీన్ హుస్సేన్ (పిసి 9457) ప్రైమ్ మినిస్టర్ పోలీస్ మెడల్ ఫర్ లైఫ్ సేవింగ్-2015 అవార్డు అందుకున్నందుకు నగర పోలీస్ కమిషనర్ మహేందర్ రెడ్డి అభినందించారు. కానిస్టేబుల్ అజీముద్దీన్ హుస్సేన్ ఫలక్‌నుమా ట్రాఫిక్ పిఎస్‌లో విధులు నిర్వహిస్తున్నప్పుడు 2012 జూలై 10న నాగుల్ చింతా, లాల్‌దర్వాజ వద్ద అకస్మాత్తుగా వర్షం రావడంతో మదీనా కాలనీకి చెందిన ఉమర్ (25) అనే వ్యక్తి పోలీస్ ఔట్‌పోస్టు వద్దకు పరుగెత్తుకుంటూ వస్తున్న సందర్భంలో కరెంట్ తీగ అతనిపై పడింది. దీనిని గమనించిన కానిస్టేబుల్ పరుగెత్తుకుంటూ వచ్చి సమీపంలోని కరెంట్ కనెక్షన్‌ను తొలగించి, ఒక కర్ర సహాయంతో అతన్ని కాపాడాడు. సాహసంతో, సమయస్ఫూర్తితో ఓ వ్యక్తిని కాపాడినందుకు హర్యానాలో జరిగిన ఓ కార్యక్రమంలో అజీముద్దీన్‌కు ఈ మెడల్‌ను ప్రదానం చేశారు.
హైదరాబాద్‌లో దలైలామా సెంటర్
మంత్రి కెటిఆర్‌తో సంస్థ ప్రతినిధులు భేటీ
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, మార్చి 1: హైదరాబాద్ నగరంలో మరో ప్రఖ్యాత సంస్థ ఏర్పాటు కానుంది. ప్రపంచ ప్రఖ్యాతి చెందిన మసాచుసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎంఐటి) కేంబ్రిడ్జి కేంద్రంగా పనిచేసే దలైలామా సెంటర్ ఫర్ ఎథిక్స్ అండ్ ట్రాన్స్‌ఫర్‌మేటివ్ వాల్యూస్ కేంద్రాన్ని దక్షిణాసియాలో ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చింది. సంస్థ డైరెక్టర్ టెన్జీన్ ప్రియదర్శిని మంత్రులు తారక రామారావు, చందూలాల్‌ను మంగళవారం హైదరాబాద్‌లో కలిశారు. టెన్జీన్ ప్రియదర్శిని ప్రతిపాదన పట్ల మంత్రులు ధన్యవాదాలు తెలిపారు. నాగార్జున సాగర్ లాంటి ప్రదేశాలు బౌద్ధులకు ఆలవాలమని, ఇలాంటిచోట దలైలామా సెంటర్ ఫర్ ఎథిక్స్‌ను ఏర్పాటు చేయడం తెలంగాణ ప్రభుత్వం గర్వంగా భావిస్తోందని తెలిపారు. ఈ కేంద్రం కోసం నగరానికి దగ్గరగా ఐదు ఎకరాల స్థలం కేటాయించేందుకు ప్రభుత్వం సూత్రప్రాయంగా అంగీకరించినట్టు చెప్పారు. ముఖ్యమంత్రితో చర్చించి ప్రభుత్వం తరఫున అందించే పూర్తి సహాయ సహకారాల వివరాలు తెలుపుతామని కెటిఆర్ చెప్పారు. ప్రభుత్వం చేపట్టే బుద్ధవనం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి దలైలామాను ఆహ్వానిస్తామని కెటిఆర్ తెలిపారు.

టామ్‌కామ్ రక్షణ
పోర్టల్ ప్రారంభం
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, మార్చి 1: తెలంగాణ రాష్ట్రం నుంచి ఉద్యోగ, ఉపాధి కోసం వెళ్లే విదేశాలకు వెళ్లి మోసాలకు గురికాకుండా ఉండేందుకు గానూ తెలంగాణ ఓవర్‌సీస్ మాన్‌పవర్ కంపెనీ లిమిటెడ్ (టామ్‌కామ్)ను ఏర్పాటు చేసినట్టు రాష్ట్ర హోం, కార్మిక, ఉపాధి శాఖల మంత్రి నాయిని నరసింహారెడ్డి అన్నారు. మంగళవారం ఆయన సచివాలయంలో టామ్‌కామ్ వెబ్‌పోర్టల్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి నాయిని మాట్లాడుతూ రాష్ట్రం నుంచి దుబాయి, గల్ఫ్‌కు ఉపాధి కోసం వెళ్లే కార్మికులు తప్పడు వీసాలతో మోసానికి గురవుతున్నారనే ఉద్దేశంతో ఈ పోర్టల్ ఏర్పాటు చేశారని తెలిపారు. ఈ కంపెనీని చట్ట ప్రకారం రిజిష్టర్ చేయడమే కాకుండా విదేశాలలో ఉండే కార్మికులకు అసౌకర్యం జరుగకుండా కేంద్ర మంత్రి సుష్మాస్వరాజ్ ఇతర అధికారులతో మాట్లాడామన్నారు. ఇక్కడి నుంచి వెళ్లే కార్మికులు టామ్‌కామ్‌తో ఎప్పటికప్పుడు సంబంధాలు కలిగివుండాలని, ఆన్‌లైన్ ద్వారా సమాచారం ఇస్తే వీసాలు ఇప్పించడంలో సహకారం అందిస్తామని చెప్పారు.