తెలంగాణ

హైకోర్టును ఆశ్రయించిన దిల్‌సుఖ్‌నగర్ దోషులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 26: దిల్‌సుఖ్‌నగర్ బాంబు పేలుళ్ల కేసుల్లో ఉరిశిక్ష పడిన ముద్దాయిలు ఎన్‌ఐఎ కోర్టు ఇచ్చిన తీర్పును హైకోర్టులో సవాలు చేశారు. ఐఎం అనుబంధ వ్యక్తులుగా తమను నిర్ధారించకుండానే శిక్ష పడిందని వారు పేర్కొన్నారు. డిసెంబర్ 13వ తేదీన ఎన్‌ఐఎ కోర్టు అదనపు జిల్లా జడ్జి బాంబు పేలుళ్ల కేసులో నిందితులకు ఉరి శిక్ష విధించారు. మరో పక్క ఎన్‌ఐఎ న్యాయమూర్తి సైతం ఉరిశిక్షను నిర్ధారించాలని కోరుతూ హైకోర్టుకు దస్త్రాలను పంపించారు.
వారం గడువు
తెలంగాణ రాష్ట్రానికి చెందిన న్యాయవివాదాలను ఎపి అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ నుండి హైకోర్టుకు బదలాయించిన అంశంపై వారం రోజుల లోపు కోర్టుకు వివరణ ఇవ్వాలని హైకోర్టు సోమవారం నాడు ఆదేశించింది. హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేష్ రంగనాధన్, జస్టిస్ ఎ శంకరనారాయణలతో కూడిన డివిజన్ బెంచ్ ఈ ఆదేశాలు ఇచ్చింది.
వారిని అనుమతించండి
హైదరాబాద్‌లో పోలీసులుగా పనిచేస్తున్న కొంత మంది స్థానికేతరులను సబ్ ఇన్‌స్పెక్టర్ల రిక్రూట్‌మెంట్‌లో దేహదారుఢ్య పరీక్షలకు డిసెంబర్ 29న అనుమతించాలని హైకోర్టు తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఉమ్మడి రాష్ట్రంలో తాము పోలీసు కానిస్టేబుళ్లుగా ఎంపికై హైదరాబాద్‌లో పనిచేస్తున్నామని, ఎస్‌ఐ రిక్రూట్‌మెంట్‌కు తమను అనుమతించడం లేదని పేర్కొంటూ కడపకు చెందిన అభ్యర్ధులు హైకోర్టును ఆశ్రయించడంతో ఈ ఆదేశాలను కోర్టు ఇచ్చింది.