తెలంగాణ

కప్పేసిన పొగమంచు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదిలాబాద్, డిసెంబర్ 27: ఉత్తరాది నుండి వీస్తున్న శీతలగాలులతో ఆదిలాబాద్ జిల్లా వణికిపోతోంది. రోజురోజుకు పడిపోతున్న ఉష్ణోగ్రతలతో జనజీవనం స్తంభించిపోతోంది. ఉట్నూ రు, ఆసిఫాబాద్, బోథ్ ఏజెన్సీ ప్రాంతాల్లో చలి తీవ్రత అధికంగా ఉండడంతో గడపదాటి బయటకు వెళ్లలేక జనం సతమతమవుతున్నారు. మంగళవారం ఆదిలాబాద్‌లో 5.0, ఉట్నూరులో 4.8 డిగ్రీల సెల్సియస్ కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. ఉదయం వేళల్లో పొగమంచు కమ్మేయడంతో రహదారులన్నీ వెలుతురు లేక అంథకారంతో నిండిపోయాయి. ఎముకలు కొరికే చలితీవ్రతకు చర్మ, శ్వాసకోశ సంబంధిత వ్యాధులు పట్టిపీడిస్తున్నాయి. పిల్లలు, వృద్ధులు, మహిళలు చలి ప్రభావంతో అస్వస్థతకు లోనవుతున్నారు.
ఉట్నూరులో...
మంగళవారం 4.8 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదుకాగా 29 డిగ్రీల పగటి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మూడేళ్ల అనంతరం ఈ సీజన్‌లోనే రికార్డు స్థాయిలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతుండడంతో ప్రజలు బెంబేలెత్తుతున్నారు. ముఖ్యంగా ప్రభుత్వ వసతి గృహాల్లో ఉంటూ చదువుకుంటున్న విద్యార్థిని విద్యార్థులు చలి తీవ్రతతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అరకొర వసతుల నడుమ కిటికీలు లేని వసతి గృహాల గదుల్లో విద్యార్థులు చలితో అవస్థలపాలవుతున్నారు. ఉదయం 9 గంటలకే పాఠశాలల్లో ఉండాల్సిన విద్యార్థులు చలిధాటికి అతికష్టం మీద బడికి వెళ్లాల్సి వస్తోంది. పాఠశాలల్లో హాజరుశాతం ఉదయం 10 గంటల వరకు సగటున 60 శాతం మాత్రమే ఉంటోందని ప్రైవేట్ విద్యాసంస్థల యాజమన్యాలు పేర్కొంటున్నాయి. ఇదిలా ఉంటే తమ పిల్లలను ఉదయం పూట సిద్దంచేసి బడికిపంపడం తల్లిదండ్రులకు కష్టసాధ్యంగా మారింది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల జిల్లాల్లో రికార్డు స్థాయిలో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నందునా పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాల సమయాన్ని గంటకు పొడగించాలని కోరుతున్నారు.