తెలంగాణ

గ్యాంగ్ రేప్ ఘటనపై ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరీంనగర్: కరీంనగర్ జిల్లా వీణవంక మండలం చల్లూరు గ్రామానికి చెందిన దళిత యువతిపై జరిగిన సామూహిక అత్యాచారం ఘటన కేసులో ఫాస్ట్ ట్రాక్ కోర్టును ఏర్పాటు చేసి మూడు నెలల్లోగా విచారణ పూర్తి చేసి నిందితులను శిక్షిస్తామని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్ స్పష్టం చేశారు. శుక్రవారం కరీంనగర్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటుకు సంబంధించి లేఖ రాయడం జరిగిందని తెలిపారు. నిందితుల్లో శ్రీనివాస్, అంజి ఇద్దరూ మేజర్లుగా తేలిందని, రాకేష్‌ను వైద్య పరీక్షల ద్వారా నిర్ధారిస్తామని, అయినా సుప్రీంకోర్టు తెచ్చిన కొత్త చట్టం ప్రకారం 16 సంవత్సరాలుపైబడిన ఈ ముగ్గురు విచారణకు అర్హులేనని, శిక్ష పడుతుందని చెప్పారు. ఈ ఘటనపై గత నెల 26న గ్రామస్థుల ద్వారా తనకు సమాచారమందిందని, అదేరాత్రి వెంటనే జిల్లా ఎస్పీ, ఆపై అధికారులకు దోషుల పట్ల కఠినంగా వ్యవహరించాలని, బాధిత యువతికి వైద్య పరీక్షలు నిర్వహించడంతోపాటు మానసిక నిపుణులతో ఆమెలో ధైర్యం నింపేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించడం జరిగిందని అన్నారు. ఆ తెల్లవారి బాధిత కుటుంబాన్ని స్వయంగా కలిసి పరామర్శించి, ప్రభుత్వ పరంగా అన్ని విధాల ఆదుకుంటామని, దోషులను కఠినంగా శిక్షిస్తామని హామీ ఇవ్వడం జరిగిందని గుర్తు చేశారు. ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు పార్టీలకతీతంగా, రాజకీయాలకతీతంగా బాధిత కుటుంబానికి ధైర్యాన్నిచ్చే ప్రయత్నం చేయాలి, నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేయాలే తప్ప, ఈ ఘటనను రాజకీయ కోణంలో వాడుకోవాలని చూడటం దురదృష్టకరమని అన్నారు. విజ్ఞత కలిగిన సంఘాలు, బాధ్యత కలిగిన పార్టీలు ఆలోచించాలని సూచించారు. ఈ కేసులో జిల్లా ఎస్పీ స్వయంగా విచారణ జరుపుతున్నారని, నిందితులను కఠినంగా శిక్షిస్తామని అన్నారు. సెల్‌ఫోన్, టివిలలో రోజు ప్రసారమయ్యే దృశ్యాలు మానవ సంబంధాలకు విఘాతం కలిగేలా ఉంటున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. సమాజంలో మానవ విలువలు, మానవ సంబంధాలు మెరుగుపడాలని అన్నారు. మహిళల రక్షణ కోసం ‘షీ’ బృందాలను ఏర్పాటు చేయటం జరిగిందని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అన్ని చర్యలు తీసుకుంటామని అన్నారు. ఇచ్చిన హామీ మేరకు బాధిత కుటుంబాన్ని అన్ని విధాల ఆదుకుంటామని తెలిపారు. బాధిత యువతికి ఉద్యోగం ఇచ్చే విషయంలో కూడా ఆలోచన చేస్తున్నట్లు చెప్పారు.

చిత్రం... విలేఖరుల సమావేశంలో
మాట్లాడుతున్న మంత్రి రాజేందర్