మహబూబ్‌నగర్

ఓటమి భయంతోనే కూటమి అసత్య ప్రచారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అచ్చంపేట: నగరపంచాయతీ ఎన్నికలలో టిఆర్‌ఎస్ చేతిలో చిత్తుగా ఓడిపోతామనే భయంతో జాతీయ పార్టీలని చెప్పుకుంటున్నా కాంగ్రెస్, బిజెపి, టిడిపి పార్టీలు ఐక్య కూటమిగా మారి పోటీ చేస్తున్నారని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ లక్ష్మారెడ్డి అన్నారు. నగరపంచాయతీ ఎన్నికల ప్రచారంలో భాగంగా చివరి రోజైన శుక్రవారం ఆయన 9, 11వ వార్డులలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఓటర్లనుద్దేశించి ఆయన మాట్లాడుతూ రాష్ట్భ్రావృద్ధికి టిఆర్‌ఎస్ ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందన్నారు. తెలంగాణ ఉద్యమంలో కాంగ్రెస్, టిడిపి పాల్గొనకుండా ప్రత్యేక రాష్ట్రం ఏర్పడకుండా అడ్డుపడ్డారని, ఇప్పుడు మళ్లీ పట్టణ అభివృద్ధిని అడ్డుకునే కుట్రతోనే ఎన్నికలలో మభ్యపెట్టి ప్రజలకు ఓట్లు అడుగుతున్నారని ఆరోపించారు. జిల్లాలో ఎక్కడా లేని రెండు పడకల ఇళ్లను అచ్చంపేట పట్టణానికి 1900 ఇళ్లు మంజూరు చేయడం జరిగిందన్నారు. కృష్ణానదిలో ఒక్కసారి నీళ్లు వచ్చి చేరితే పదేళ్ల వరకు నియోజకవర్గంలో వర్షాలు కురవకపోయినా సస్యశ్యామలంగా ఉండేందుకు నిరంతరం సాగునీరు సరఫరా ఉండేలా స్థానిక ఎమ్మెల్యే గువ్వల బాలరాజు సిఎంతో మాట్లాడి ప్రత్యేక నిధులు మంజూరు చేయించారని అన్నారు. ఒక సంవత్సరంలోపు పట్టణంతోపాటు నియోజకవర్గంలోని అన్నీ గ్రామాలలోని ప్రతి కుటుంబానికి తాగునీటిని అందిస్తామన్నారు. పట్టణంలో ఈనెల 6న నిర్వహించే ఎన్నికలలో ముగ్గురు నాయకులు ఏకమై ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. ఓడిపోతామనే భయంతోనే ధర్నాలు, రాస్తారోకోలాంటి ఆందోళన కార్యక్రమాలను చేస్తూ ప్రజలను మభ్యపెడుతున్నారని అన్నారు. నియోజకవర్గంలోని యువత కోసం నైపుణ్య అభివృద్ధికి కేంద్రం ఏర్పాటుకు కృషి చేస్తామన్నారు. 20 వార్డులలో టిఆర్‌ఎస్ అభ్యర్థులు భారీ మెజార్టీతో గెలుపొందడం ఖాయమనే ధీమాను వ్యక్తం చేశారు.
పసికందు
కుక్కలపాలు
కోడేరు, మార్చి 4: మండల కేంద్రంలో సుమారు ఐదురోజుల వయస్సుగల పసికందును ఎవరో కరుణలేని తల్లి కుక్కలపాలు చేసింది. ఈ ఘటన శుక్రవారం గ్రామస్థులను ఆందోళనకు గురిచేసింది. మానవత్వం మరిచిన ఆ తల్లి ఆడబిడ్డ అనేసాకుతోనో, మారో ఇతర కారణమో తెలియదు కాని ఊరగుంట అలుగులో పసికందును పడేస్తే కుక్కలు పీక్కొని తిన్నాయి. సంఘటన తెలుసుకున్న స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
నిలిచిపోయిన
విద్యుత్ సరఫరా
* చీకట్లో మగ్గిన ‘మామిడిపల్లి’
కొత్తూరు, మార్చి 4: విద్యుత్ సరఫరా లేక మామిడిపల్లి అంధకారంలో ఉంది. గురువారం ఉదయం తొమ్మిది గంటల నుండి శుక్రవారం మూడు గంటల వరకు సాయంత్రం వరకు విద్యుత్ సరఫరా కాలేదు. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో మంచినీటి కోసం ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. గురువారం ఉదయం గ్రామంలో ఉన్న ట్రాన్స్‌ఫార్మర్ కాలిపోవడంతో దాన్ని మరమ్మతులు చేయించేందుకు ఎవరు కూడా ముందుకు రాకపోవడంతో సరఫరాలో అంతరాయం నెలకొంది. అసలే ఎండకాలం..ఆపై విద్యుత్ సరఫరా 24గంటలకు పైగా నిలిచిపోవడంతో తాగునీటి కోసం ప్రజలు తీవ్ర ఇష్టాలను ఎదుర్కొన్నారు. ప్రజలే ఇలా ఉంటే మూగజీవాల పరిస్థితి దారుణంగా ఉందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే విషయాన్ని మామిడిపల్లి సర్పంచ్ శోభారెడ్డిని వివరణ కోరగా, గురువారం ఉదయం గ్రామంలో ఉన్న ట్రాన్స్‌ఫార్మర్ కాలిపోవడంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయిందని, శుక్రవారం నాలుగు గంటల తరువాత ట్రాన్స్‌ఫార్మర్‌కు మరమ్మతులు నిర్వహించి గ్రామానికి విద్యుత్ సరఫరా చేసినట్లు తెలిపారు.
బంగారు ఆభరణాలపై
ఎక్సైజ్ డ్యూటీని తొలగించాలి
నారాయణపేటటౌన్, మార్చి 4: బంగారు ఆభరణాలపై ప్రభుత్వం బడ్జెట్‌లో విధించిన 1శాతం ఎక్సైజ్ డ్యూటీని రద్దు చేయాలని బులియన్ మర్చంట్ అసోసియేషన్ అధ్యక్షులు హరినారాయణ్‌భట్టడ్ డిమాండ్ చేశారు. శుక్రవారం స్థానిక బాలాజీ మందిర్ నుండి బంగారు వర్తక సంఘం ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించి ఆర్డీఓకు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం బంగారు ఆభరణాలపై ఎక్సైజ్ సుంకాన్ని విధించిన సమయంలో ప్రతిపక్ష హోదాలో ఉన్న బిజెపి దీనిని తీవ్రంగా వ్యతిరేకించి తీరా అధికారంలోకి వచ్చిన తరువాత ఆ సుంకాన్ని వసూలు చేసేందుకు నిర్ణయించడం తగదన్నారు. ఈ సుంకం కారణంగా ఎందరో స్వర్ణకారులు రోడ్డున పడాల్సిన దుస్థితి ఏర్పడుతుందని దీనిని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం తన నిర్ణయం మార్చుకోవాలని, దీనిపై దేశంలోని వ్యాపారులు, స్వర్ణకారులంతా ఐక్యంగా ఉద్యమించేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు గులాం మైనోద్దీన్ చాంద్, పవన్‌కుమార్, వెంకట్రాములు సరాఫ్, షఫీచాంద్, సరాఫ్ నాగరాజ్, శ్యాంసుందర్‌చారి, సరాఫ్ రాజు, ఓంప్రకాశ్, జ్యోతిర్నాథ్, సతీష్ లాహోటీ, ప్రవీణ్‌కుమార్ పాల్గొన్నారు.
అచ్చంపేట నగర పంచాయతీ
ఎన్నికలకు సర్వం సిద్ధం
* రేపే పోలింగ్...18614 మంది ఓటర్లు
*20బూత్‌ల ఏర్పాట్లు.. 10సమస్యాత్మక కేంద్రాలు
* ఇవిఎంల ద్వారానే ఓటింగ్ .. 9న కౌటింగ్
* పోలింగ్ కేంద్రాల దగ్గర 144 సెక్షన్
ఆంధ్రభూమి బ్యూరో
మహబూబ్‌నగర్, మార్చి 4: అచ్చంపేట నగర పంచాయతీ ఎన్నికల పోలింగ్ సమయం దగ్గరపడుతుండడంతో అన్ని రాజకీయ పార్టీల నాయకులలో ఉత్కంఠత రేకెతెస్తుంది. పోలింగ్‌కు మరో 24 గంటల సమయం ఉండడంతో ఎన్నికల సిబ్బంది ఏర్పాట్లపై దృష్టిపెట్టారు. ఈ నెల 6వ తేదీన పోలింగ్ జరుగనున్న నేపథ్యంలో పోలింగ్ కేంద్రాల దగ్గర 144 సెక్షన్‌ను అమలలోకి తీసుకొచ్చారు. అడుగడుగునా పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేశారు. అచ్చంపేట నలుదిక్కుల రహదారులను పోలీసులు తమ గుప్పిట్లోకి తీసుకున్నారు. వచ్చిపోయే వాహనాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. అచ్చంపేట నగర పంచాయతీ పరిధిలో 20 వార్డులు ఉండగా పట్టణంలో 18614 మంది ఓటర్లు ఉన్నారు. వీరంతా రేపే తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి అవకాశం ఉంది. 2005లో అచ్చంపేట నగర పంచాయతీ ఎన్నికలు జరిగాయి. దాదాపు 10 ఏళ్ళ తర్వాత ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో అందరి దృష్టి ఇటువైపు మళ్ళింది. 20 వార్డులకు గాను 20 బూతులను ఏర్పాటు చేశారు. ఈ ఎన్నికలు ఇవి ఎంల ద్వారానే నిర్వహిస్తున్నారు. వందమంది ఎన్నికల సిబ్బందిని ఏర్పాటు చేయగా, అందులో 10 మంది సూపర్‌వైజర్లు, నలుగురు జోనల్ అధికారులు కూడా అదనంగా ఏర్పాటు చేశారు. 300 మంది పోలీస్ సిబ్బందిని ఎస్పీ విశ్వప్రసాద్ రంగంలోకి దింపారు.మొత్తం ఈ ఎన్నికలలో 20 వార్డులలో 57 మంది అభ్యర్థులు రంగంలో ఉన్నారు. 17 మంది స్వతంత్ర అభ్యర్థులు కూడా ఈ ఎన్నికలలో పోటీ చేస్తున్నారు. ముఖ్యంగా కాంగ్రెస్, టిడిపి, బిజెపిలు ఏకమై ఐక్యకూటమిగా ఏర్పడి ఎన్నికలలో టి ఆర్ ఎస్‌ను ఎదుర్కోవడానికి రంగంలో దిగారు. ఇదిలా ఉండగా ఐక్య కూటమిని చిత్తు చేసేందుకు కూడా టి ఆర్ ఎస్ నేతలు రంగంలోకి దిగి వ్యూహాలకు పదునుపెట్టారు. ప్రస్తుతం అచ్చంపేట నగర పంచాయతీ ఎన్నికలు హాట్‌టాఫీక్‌గా మారాయి. ఎన్నికల ప్రచారానికి తెరపడడంతో ఇక ఓటర్లను తమవైపు మళ్ళించుకోవడానికి అటు ఐక్య కూటమి నాయకులు, ఇటు తెరాస నాయకులు ఓటర్లను ప్రలోభపెట్టేందుకు మద్యం, డబ్బును విచ్చలవిడిగా పంపిణీ చేస్తున్నారు. ఇరుపార్టీల నాయకుల ఒకరిపై ఒకరు ఆరోపణలు గుప్పించుకుంటూ వారు పంపిణీ చేస్తున్న మద్యం, డబ్బులను కూడా పట్టుకుంటున్నారు. నల్లమల అటవీ ప్రాంతంలో గల ఏకైక నగర పంచాయతీ ఎన్నికలకు పోలీంగ్ జరుగనున్న నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటలు చోటు చేసుకోకుండా గతంలో జరిగిన కొన్ని సంఘటలను దృష్టిలో ఉంచుకొని ముఖ్యంగా పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేసి అచ్చంపేట అడుగడుగున నిఘా వర్గాలు కూడా రంగంలోకి దిగి ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు కృషి చేస్తున్నారు. ఇదిలా ఉండగా మరో 24గంటలలోపే పోలింగ్ జరుగనున్న నేపథ్యంలో పోలింగ్ కేంద్రాలను కూడా శుక్రవారం పోలీసులు ముమ్మరంగా తనిఖీ చేశారు. అచ్చంపేటలోని 10 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను కూడా గుర్తించడంతో ఆ కేంద్రాల దగ్గర మూడెంచల వ్యవస్థతో కూడిన పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఆయా వార్డులలో కూడా పోలీసులు నిఘా ఉంచారు. ఈ నెల 6వ తేదీన పోలింగ్ నిర్వహించగా, ఈనెల 9వ తేదీన అచ్చంపేటలో కౌటింగ్ నిర్వహించనున్నారు. ఐదు రౌండ్లల్లో కౌంటింగ్ ఏర్పాటు చేయాలని ఎన్నికల అధికారులు నిర్ణయించారు. ఏదీ ఏమైనప్పటికీ పోలింగ్ సమయం దగ్గర పడుతుండడంతో అటు రాజకీయ నాయకులలో ఉత్కంఠత నెలకొనడం, ఇటు ఎన్నికల సిబ్బంది మాత్రం పోలింగ్ నిర్వహణకు సర్వం సిద్దం చేసుకుంటున్నారు.
బంగారు తెలంగాణలో భాగంగానే
ప్రజలు తీర్పునివ్వాలి
ఎన్నికల రోడ్‌షోలో మంత్రి జూపల్లి
ఆంధ్రభూమి బ్యూరో
మహబూబ్‌నగర్, మార్చి 4: ముఖ్యమంత్రి కెసి ఆర్ బంగారు తెలంగాణకు బాటలు వేస్తున్నారని అందులో భాగంగానే అచ్చంపేట ప్రజలు ఇచ్చే తీర్పు బంగారు తెలంగాణకు బాటలు వేసే విధంగా ఉండాలని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు కోరారు. శుక్రవారం అచ్చంపేట నగర పంచాయతీ ఎన్నికల ప్రచారంలో భాగంగా నిర్వహించిన రోడ్‌షోలో మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ అచ్చంపేట అభివృద్ధి జరుగాలంటే టి ఆర్ ఎస్‌కు పఠం కట్టాలని గత పదేళ్ళకు పైగా అభివృద్ధి నోచుకోలేదని ఎన్నికలు వాయిదా పడడంతో మరో ఐదేళ్ళ అభివృద్ధి వెనక్కి వెళ్ళిందని తెలిపారు. ఈ ఐదేళ్ళలో జరిగిన నష్టాన్ని అచ్చంపేట పట్టణ ప్రజలు పూడ్చుకోవాలంటే టి ఆర్ ఎస్‌ను తప్పకుండా ఆదరించాలని ఈ ఎన్నికలలో టి ఆర్ ఎస్ అభ్యర్థులను ప్రజలు అక్కున చేర్చుకోవాలని కోరారు.పట్టణ ప్రజలు చైతన్యవంతులని, తెలివిపరులని ఆయన అన్నారు. ఈ ఎన్నికలలో టి ఆర్ ఎస్ అభ్యర్థులను గెలిపిస్తే ఐదేళ్ళల్లో జరిగిన నష్టాన్ని ఏడాదిలో పూర్తి చేస్తామని వెల్లడించారు. 60 ఏళ్ళుగా పాలించిన పాలకులు మళ్ళీ తిరిగి ఓట్లడగటానికి వచ్చారని వారికి డిపాజిట్లు రాకుండా చేయాలని అన్నారు.అనైతికంగా పొత్తులు పెట్టుకొని దొంగల కూటమిగా ఏర్పడి టి ఆర్ ఎస్‌పై దుర్మార్గమైన ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వారిది ముమ్మాటికి ద్రోహుల కూటమియేనని, ఓటర్లు ఆ పార్టీలను భూస్థాపితం చేయాలని పిలుపునిచ్చారు. తెలంగాణ ఉద్యమంలో కలిసి రాని నాయకులు ఇప్పుడు మరో కుట్రలకు తెరలేపి అనైతికంగా కలిసి అచ్చంపేట ప్రజలను మభ్యపెట్టడానికి కృషి చేస్తున్నాడని ఆరోపించారు. అచ్చంపేట పట్టణంలో మంచినీటి ఎద్దడికి కారకులెవరని, ఈ ప్రాంతానికి సాగు,తాగునీరు ఎందుకు రాలేదని అందుకు గత పాలకులు కారణం కాదా అని మంత్రి ప్రశ్నించారు. ఏడాదిలోపు మంచినీటి సమస్యను పరిష్కరించడానికి శాశ్వత పరిష్కారం చేస్తామని, ఏడాదిన్నర తర్వాత అచ్చంపేట పట్టణంతో పాటు నియోజకవర్గంలో ప్రతి గ్రామానికి మంచినీరును అందిస్తామని, వాటర్‌గ్రిడ్‌తో ప్రతి గుడిసెకు నీరు అందుతాయని అన్నారు. నల్లమల అటవీ ప్రాంతంలోని చెంచుపెంటలకు కూడా మంచినీరు అందిస్తామని, ఆడబిడ్డల బాధలను తీర్చుతామన్నారు. ప్రజలకు మేలు చేయని దుర్మార్గులు మేలు చేసే ముఖ్యమంత్రి కెసి ఆర్‌పై,టి ఆర్ ఎస్‌పై బుడదచల్లే కార్యక్రమాలకు పూనుకున్నారని దుయ్యబట్టారు. ఈ ఎన్నికలలో ప్రజల తీర్పు వన్‌సైడ్ ఉండాలని దాంతో కూటమి కుదేలు కావాలని, కూటమిగా ఏర్పడ్డవారు సిగ్గుపడాలని ఎద్దేవా చేశారు. అచ్చంపేట నగర పంచాయతీ ఎన్నికలలో తెరాస అభ్యర్థులను గెలిపించి ఈ పీఠాన్ని ముఖ్యమంత్రి కెసి ఆర్‌కు బహుమతిగా ఇవ్వాలని ఆయన కోరారు. అప్పుడే అచ్చంపేట నగరం ఆశించిన స్థాయి కన్నా అభివృద్ధి చెందుతుందని, ఇక మీదట అచ్చంపేట పట్టణంపై దృష్టి పెట్టి ప్రతి వార్డులో నెలకొన్న సమస్యలను పరిష్కరిస్తామన్నారు. తాము వార్డులలో తిరుగుతుంటే ప్రజలు కొన్ని సమస్యలు తమ దృష్టికి తీసుకొచ్చారని ఇప్పుడు ఎన్నికల సమయం కాబట్టి ఏది హామీ ఇచ్చినా ఎన్నికల నియామవళి కిందికి వస్తుంది కాబట్టి ఎన్నికలలో టి ఆర్ ఎస్‌కు పట్టం కడితే తానంతకుతానే అభివృద్ధి మీ ఇళ్లముందుకొస్తుందని మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు.
అరాచకాలు, భయబ్రాంతులతో
ప్రజల మనుస్సులను గెలువలేరు
రోడ్‌షోలో గద్వాల ఎమ్మెల్యే అరుణ
ఆంధ్రభూమి బ్యూరో
మహబూబ్‌నగర్, మార్చి 4: అరాచకాలు, భయబ్రాంతులతో ప్రజల మనస్సులను గెలువలేరనే విషయాన్ని మంత్రి జూపల్లి కృష్ణారావు గ్రహించుకోవాలని, గుండాయిజం, రౌడీయిజంతో ప్రజలను తమ వైపు మళ్ళించుకుంటానని ఎమ్మెల్యే గువ్వల బాల్‌రాజు అనుకుంటున్నాడని అందుకే నెలకొకరిని కొడుతూ అచ్చంపేటలో రౌడీలా ప్రవర్తిస్తున్నాడని గద్వాల కాంగ్రెస్ ఎమ్మెల్యే డికె అరుణ ఆరోపించారు. శుక్రవారం అచ్చంపేట నగర పంచాయతీ ఎన్నికల ప్రచారంలో భాగంగా నిర్వహించిన రోడ్‌షోలో డికె అరుణ మాట్లాడుతూ అచ్చంపేట నియోజకవర్గంలో అరాచకం మొదలైందని ఇక్కడి ఎమ్మెల్యే ప్రజలపై దాడులు చేస్తూ రౌడీయిజాన్ని ప్రదర్శిస్తున్నాడని విమర్శించారు. రౌడీలకు, గుండాలకు గుణపాఠం చెప్పే రోజు ఆసన్నమైందని అచ్చంపేట ప్రజానీకం టి ఆర్ ఎస్‌కు తగిన గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. మంత్రులు ఈ ఎన్నికలలో బరి తెగించి సిగ్గుమాలిన రాజకీయాలు చేస్తూ ఓటర్లను ప్రలోభపెట్టడానికి మద్యం, డబ్బులు విచ్చలవిడిగా పంపిణచేస్తున్నారని స్వయంగా తానే పట్టుకున్నానని వెల్లడించారు. మంత్రులకు ఒకటి తెలిసిపోయిందని అచ్చంపేట ప్రజలు తమ చెంపచెల్లుమనే విధంగా టి ఆర్ ఎస్‌ను భూస్థాపితం చేసే విధంగా తీర్పునిస్తున్నారని తెలిసి భయంతో ఎలాగైనా గెలువాలనే కుతంత్రాలు పని మంత్రులు 15రోజుల నుంచి అచ్చంపేటలో తిష్టవేసి కూర్చోవడం సిగ్గుచేటన్నారు. టి ఆర్ ఎస్ నాయకులు ఆబోతులా తయారయ్యారని ప్రజల మనోభావాలను దెబ్బతీస్తూ, ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తూ ఎన్నికలలో లబ్దిపొందాలని చూస్తున్నారని విమర్శించారు. మంత్రి జూపల్లి కృష్ణారావు చెలరేగిపోతున్నారని, కాంగ్రెస్,టిడిపి, బిజెపిల పొత్తుపై సిగ్గుమాలిన వ్యాఖ్యలు చేస్తున్నారని ఆరోపించారు. ఆయనకు రాజకీయ బిక్ష పెట్టిందే కాంగ్రెస్ పార్టీయే అని, అలాంటి పార్టీని పట్టుకొని తిట్టడమేమిటన్నారు. అసలు మంత్రి జూపల్లి జీవితాన్ని కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందని, అప్పుల ఊబిలో కూరుకుపోయి దిక్కుతోచని స్థితిలో ఉంటే కాంగ్రెస్ ముఖ్యమంత్రి వై ఎస్ రాజశేఖర్‌రెడ్డితో అప్పులు మాఫీ చేయించుకున్నది నిజం కాదా అని కాంగ్రెస్ పార్టీతో పొందిన లబ్దితో అప్పులు తేర్చుకోలేదా అంటూ ఆమె ప్రశ్నించారు. అధికార పార్టీ కళ్ళుతెరిచే విధంగా అచ్చంపేట ప్రజలు తీర్పునివ్వాలని గత పదిహేను రోజుల నుంచి గల్లిగల్లితిరిగి ఈ పట్టణ ప్రజలను భయబ్రాంతులకు గురి చేసిన టి ఆర్ ఎస్ నాయకులకు గుణపాఠం చెప్పే విధంగా ఓటర్లు తమ తీర్పునివ్వాలని డికె అరుణ కోరారు. గ్రామ పంచాయతీ పన్ను చెల్లింపు విషయంలో కూడా పించన్లు పొందుతున్న వృద్దులు, వికలాంగులు, వితంతువులను వేధిస్తున్నారని, వారి పించన్ల నుంచి వచ్చిన డబ్బును కట్‌చేసి ఇంటి పన్నులు కట్టించుకోవడమేమిటని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి కెసి ఆర్ ఇప్పటికే లక్షల కోట్ల రూపాయలు హామీలు ఇచ్చారని ఆరోపించారు. రాజకీయాలు చిల్లర చేశారని, సమానత్వంతో అభివృద్ధి ఫలాలు అందించాలని, అలాకాకుండా ముఖ్యమంత్రి కెసి ఆర్ పాలమూరు జిల్లాపై వివక్షత చూపిస్తే సహించేది లేదని హెచ్చరించారు. ప్రభుత్వం పేదల కడుపుకొడుతుందని అందుకే అచ్చంపేట నగర పంచాయతీ ఎన్నికలలో కాంగ్రెస్, బిజెపి, టిడిపి కూటమిల అభ్యర్థులను గెలిపించి రాష్ట్రంలో అచ్చంపేట ప్రజలు చరిత్ర సృష్టించాలని ఆమె కోరారు. ఈ రోడ్‌షోలో ఎంపి నంది ఎల్లయ్య, ఎమ్మెల్యే చిన్నారెడ్డి, మాజీ మంత్రి రాములు, మాజీ ఎమ్మెల్యే వంశీకృష్ణ, కాంగ్రెస్ నాయకురాళ్ళు అనురాధ, మణెమ్మ, సరిత, బిజెపి నేత మంగ్యానాయక్, టిడిపి జిల్లా అధ్యక్షుడు బక్కని నర్సింహులు తదితరులు పాల్గొన్నారు.

సాగునీటి ప్రాజెక్టుల డిజైన్ మార్చాలి
కొత్తకోట, మార్చి 4: జిల్లాలోని ప్రాజెక్టుల డిజైన్ మార్పులు చేసి సాగు,తాగునీరు అందించాలని మాజీ ఎమ్మెల్యేలు సీతమ్మ, దయాకర్‌రెడ్డిలు డిమాండ్ చేశారు. శుక్రవారం మండల పరిధిలోని సరళసాగర్ ప్రాజెక్టును వారు పరిశీలించి విలేఖరుల సమావేశంలో మాట్లాడారు. గత పాలకులు, అధికారుల నిర్లక్ష్యం వల్లే జూరాలకు తక్కువ నీటిని కేటాయించడంతో ఇక్కడి ప్రజలకు, రైతులకు సాగు నీరందడం లేదన్నారు. ఇకనైనా పాలకులు స్పందించి జూరాలతోపాటు సరళసాగర్, కోయిల్‌సాగర్ డిజైన్లను మార్పు చేయాలన్నారు. 0.5టియంసిల నీరున్నా సరళాసాగర్ వనపర్తి సంస్థానాధీశంలో ప్రాజెక్టులు రూపకల్పన చేశారని, కాలక్రమేణ ప్రాజెక్టులో సిల్టు పేరుకుని 0.3టిఎంసిల నీరు మాత్రమే ఉంటుందన్నారు. దీంతో 575 ఎకరాలు మాత్రమే పంట పడుతుందని, ప్రకృతి వైపరీత్యాలవల్లే ఇటీవలే కరువు తాండవించిందని, దీంతో రైతులు వేసుకున్న పంటలు ఎండిపోయాయన్నారు. జిల్లాలోని ఇరిగేషన్, పోలీసు అధికారులు ఇక్కడి పరిస్థితులను అధ్యయనం చేసి ముఖ్యమంత్రికి తెలిపి కరువుపై నివేదిక అందించాలన్నారు. సరళసాగర్ మోటార్లు చెడిపోవడంతో ఎంపి నిధుల నుండి 15.75 లక్షల రూపాయలతో మోటార్లు రిపేరు చేస్తున్నట్లు ఆయన చెప్పారు. సిఎంలు, మంత్రులు ఉత్తర తెలంగాణపై ఉన్న ప్రేమ దక్షిణ తెలంగాణపై లేదని, ఇక్కడి నీటినంతా అక్కడికి తరలిస్తున్నారన్నారు. ఇటీవలే 5టిఎంసిల నీరు నిరంజన్‌రెడ్డి, జూపల్లి కృష్ణారావు రామన్‌పాడు నుండి తరలించుకుపోయారని, ఈ నీరు వృథా అయిందని ఆయన అన్నారు. భవిషత్ ప్రణాళిక లేకపోవడం వల్లే ఇలాంటి పరిస్థితి నెలకొందని, జూరాల ఎండిపోయి కరవు తాండవించిందని వారు అన్నారు. వారికి చిత్త శుద్ధి లేకపోవడం వల్లే ఇలాంటి పరిస్థితి నెలకొందని, కోయిల్ సాగర్‌నుండి మహబూబ్‌నగర్‌కు తాగునీరు తీసుకువెళుతున్నారని, బొల్లారం వద్ద నీటి ఎద్దడి ఏర్పడిందని అన్నారు. పాలమూరు ప్రాజెక్టుకుపూర్తిచేసి ఇక్కడి జిల్లా స్థాయిలో పూర్తిస్థాయిలో నీటిని అందించాకే ఇతరప్రాంతాలైన నల్గొండ, రంగారెడ్డికి తరలించాలని వారు అన్నారు. ఈసమావేశంలో నాయకులు నాగన్నయాదవ్, భరత్‌బూషన్, రాజవర్థన్‌రెడ్డి, చీర్ల శ్రీనివాసులు, సుల్తాన్, మధుసూదన్‌రెడ్డి, జగన్మోహన్‌రెడ్డి, అమరేందర్‌రెడ్డి, గోకారయ్య, తిరుపతయ్య, శ్రీనివాస్‌యాదవ్ పాల్గొన్నారు.
భక్తజన సంద్రమైన పోలేపల్లి

* కన్నుల పండువగా అమ్మవారి సిరిమానోత్సవం
బొంరాస్‌పేట, మార్చి 4: మహబుబ్‌నగర్ జిల్లా బొంరాస్‌పేట మండల పరిధిలోని పోలేపల్లి గ్రామం భక్తజన సంద్రమైంది. శుక్రవారం రేణుక ఎల్లమ్మ జాతరలో కీలక ఘట్టమైన (సిడే) సిరిమానోత్సవాన్ని కనులారా తిలకించేందుకు భక్తులు వెళ్లువల తరలివచ్చారు. ఉదయం నుండే క్యూలైన్‌లలో భక్తులు కిక్కిరిసిపోయారు. మండుతున్న ఎండలు మా భక్తిముందు భలాదూర్ అన్నట్లు గంటలాదిపాటు అమ్మవారి దర్శనం కోసం వేచి ఉండి మొక్కులు తీర్చుకున్నారు. గ్రామీణ ప్రాంత ప్రజల ఇలవేల్పు అయిన ఎల్లమ్మతల్లికి జనం నీరాజనం పడుతోంది. ఆలయం పక్కనే ఉన్న కోనేట్లో పవిత్ర స్నానాలు ఆచరించి నెత్తిన బోనం...సంకన కోడిపుంజుతో అమ్మవారికి మొక్కులు సమర్పించుకున్నారు. లక్షలాది సంఖ్యలో తరలివచ్చిన భక్తులు అమ్మవారిని కనులార దర్శించుకొని భక్తి పారవశ్యంలో తరిస్తున్నారు. తెలంగాణ నుండే కాకుండా పోరుగు రాష్టల్రైన మహరాష్ట్ర కర్నాటక, గుజరాత్, ఆంధ్రప్రదేశ్‌ల నుండి భక్తులు అధిక సంఖ్యలో అమ్మవారి దర్శనం కోసం ఒకరోజు ముందే పోలేపల్లికి చేరుకున్నారు. జనం.. జనం..ప్రభంజనం అన్నట్లుగా పోలేపల్లి గ్రామం జనారణ్యాన్ని తలపిస్తోంది.
దేవాలయ పునఃనిర్మాణం కారణంగా భక్తులు అమ్మవారిని దర్శించుకునే సమయంలో తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. అలయం స్లాబ్ పూర్తయి కేవలం వారం రోజులు మాత్రమే కావడంతో స్లాబ్‌కు ఉంచిన కర్రలు తొలగించలేదు. భక్తులు దర్శన సమయంలో ఆలయంలోకి వెళ్ళే సమయంలో అవస్థలు పడ్డారు.
బోనాలతో బారులుతీరిన మహిళలు
అమ్మవారికి మొక్కులు సమర్పించేందుకు సుదూర ప్రాంతాల నుండి వచ్చిన భక్తులే కాకుండా స్థానిక మహిళలు బోనాలతో బారులు తీరారు.అమ్మవారికి ఇష్టమైన కల్లును సాకపట్టి,నెత్తిన బోనం,చంకన కోడిపుంజుతో ఆలయం ముందు బారులుతీరారు.ముఖ్యంగా గిరిజన జనాభ అధికంగా ఉండటంతో గిరిజన మహిళలు సైతం అమ్మవారి దర్శణంకోసం తండోపతండాలుగా తరలివచ్చారు.
షోలాపూర్ ప్రజల ఇంటి దేవత ఎల్లమ్మ
పోలేపల్లి జాతరకు వచ్చే భక్తులలో సింహాభాగం మహరాష్టల్రోని షోలాపూర్ వాసులదే అని చెప్పవచ్చు. ఎల్లమ్మదేవతను షోలాపూర్‌వాసులు తమ ఇంటిదేవతగా భావిస్తారు. జాతరకు వారం రోజుల ముందుగానే వారు పోలేపల్లికి చేరుకుంటారు. కొడంగల్ మండలం హస్నబాద్‌లోని ఎల్లమ్మకు తీపి వంటకాలతో నైవేద్యం సమర్పించిన అనంతరం పోలేపల్లికి చేరుకుంటారు. పోలేపల్లి ఎల్లమ్మ దేవత, హస్నబాద్ ఎల్లమ్మ దేవతలు ఇద్దరు అక్కచెల్లెల్లని అందుకే ముందు హస్నబాద్ ఎల్లమ్మను దర్శించుని ఇక్కడకు వస్తామని తెలిపారు. తరతరాలుగా రేణుక ఎల్లమ్మ దేవతను దర్శించుకునేందు వస్తున్నామని వారు వివరించారు.
మావురాల ఎల్లమ్మతల్లి మమ్మల్ని చల్లంగా చూడు
తెల్లవారు జామునుండే బారులుతీరిన భక్తులు సాయంత్రం (సిడే) సిరిమానోత్సవం జరుగు సమయంతో మావురాల ఎల్లమ్మతల్లీ మమ్మల్ని చల్లంగా చూడంటూ మొక్కుతూ పసుపు గవ్వల మిశ్రమమైన గవ్వల బండారును సిడేపైకి చల్లుతూ మొక్కుకున్నారు.
సిడే ఆలయం చుట్టూ ప్రదక్షనలు చేస్తున్న సమయంలో ఎల్లమ్మ మాతకి జై అంటూ జయజయ ధ్వానాలతో ఆలయ ప్రాంగణం దద్దరిల్లింది. అంతకు ముందు అమ్మవారికి మంగళస్నానం చేయించేందుకు ఎల్లమ్మబావి దగ్గరకు తీసుకువెళ్లీ స్నానాధిపూజల అనంతరం జల్దిబోనంతో ఆలయానికి చేరుకొని ప్రత్యేక పూజల అనంతరం ముచ్చటి వెంకటేష్, దేవాలయ మేనేజరు రాజేందర్‌రెడ్డి,సిఐ విశ్వప్రసాద్, బొంరాస్‌పేట ఎస్‌ఐ హన్నప్పలు అమ్మవారిని సిడేకు కట్టిన తొట్టేలలో ప్రతిష్టించేందుకు తీసుకువచ్చారు.వచ్చే బడ్జెట్‌లో
వైద్య రంగానికి అధిక ప్రాధాన్యం

* ఆర్నెల్లలో ప్రభుత్వ ఆస్పత్రుల స్వరూపం మారుస్తాం
* రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి వెల్లడి
నాగర్‌కర్నూల్, మార్చి 4: రాష్ట్ర బడ్జెట్‌లో వైద్య రంగానికి అధిక ప్రాధాన్యతను ఇవ్వడం జరుగుతుందని, ప్రభుత్వ ఆస్పత్రులలో పేదలకు మంచి వైద్య అందించాలనే కృతనిశ్చయంతో సిఎం కెసిఆర్ ఉన్నారని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి వెల్లడించారు. శుక్రవారం ఉదయం మహబూబ్‌నగర్ జిల్లా నాగర్‌కర్నూల్ ఏరియా ఆస్పత్రిని ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డితో కలిసి మంత్రి లక్ష్మారెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వారు ఆస్పత్రిలోని ప్రతివార్డును పరిశీలించి రోగులతో మాట్లాడారు. ఆస్పత్రిలో ఉన్న పరికరాలను పరిశీలించి సమస్యలను తెలుసుకున్నారు. అనంతరం మంత్రి లక్ష్మారెడ్డి విలేఖరులతో మాట్లాడుతూ గత పాలకులు వైద్య రంగం పట్ల పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరించారని, అనేక సమస్యలు ఉన్నాయని, సర్కార్ దవాఖానాకు రావాలంటేనే ప్రజలు భయపడే పరిస్థితి కల్పించారని ఆరోపించారు. ఇటీవల వైద్యరంగానికి సంబంధించి సిఎం కెసిఆర్ సమీక్షిస్తూ వైద్యరంగంలో సమూల మార్పులు తీసుకొని రావాల్సిన ఆవశ్యకత గురించి వివరించారని, అధిక నిధులను కేటాయించడంతోపాటు వచ్చే ఆరు నెలల్లో సమూల మార్పులు తెచ్చేందుకు మార్గనిర్దేశం చేశారని తెలిపారు. తమిళనాడులో మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నారని, అక్కడి సిబ్బంది రోగులకు అందుబాటులో ఉంటూ వైద్యసేవలు అందిస్తున్న విషయాన్ని ఇటీవల పర్యటించిన సమయంలో గుర్తించడం జరిగిందన్నారు. ఇక్కడ కూడా అదేవిధంగా సేవలు అందించేవిధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. నాగర్‌కర్నూల్ ఏరియా ఆస్పత్రిని జిల్లాలోనే మోడల్ ఆస్పత్రిగా తీర్చిదిద్దడం జరుగుతుందన్నారు. ఆస్పత్రికి కావలసిన వైద్య పరికరాలను ఏర్పాటు చేయడం, వైద్యుల పోస్టులను భర్తీ చేయడం జరుగుతుందన్నారు. ఏరియా ఆస్పత్రిలో సివిల్ పనులను సత్వరంగా పూర్తిచేసే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. అచ్చంపేటలోని సివిల్ ఆస్పత్రిని వంద పడకల ఆస్పత్రిగా స్థాయి పెంచడం జరుగుతుందన్నారు. నాగర్‌కర్నూల్ ఏరియా ఆస్పత్రిలో డయాలసిస్ కేంద్రాన్ని ఏర్పాటు చేయడంతోపాటు, ఐసియు కేంద్రాన్ని కూడా నెలకొల్పేందుకు చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ఈ విలేఖరుల సమావేశంలో ఎమ్మెల్యే మర్రి జనార్ధన్‌రెడ్డి పాల్గొన్నారు.
కేజిబివిలో పివో తనిఖీ
కొత్తకోట, మార్చి 4: మండల పరిధిలోని అమడబాకులలో ఉన్న కేజిబివి, ఆదర్శ పాఠశాలను శుక్రవారం ఆర్వీయం పివో గోవిందరాజులు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ 10వ తరగతి ఫలితాల్లో ఉత్తమఫలితాలు సాధించి జిల్లాకు పేరుప్రఖ్యాతులు తేవాలన్నారు. పాఠశాల నిర్వహణపై ఆయన సంతృప్తి వ్యక్తంచేశారు. రికార్డులను, ఉపాద్యాయుల పనితీరును ఆయన పరిశీలించారు. పాఠశాలలో విద్యార్థులను పలు ప్రశ్నలు అడిగి తెలుసుకున్నారు.
ఉపాధి పథకం.. పంచాయతీలో విలీనం
* సిబ్బంది అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు : డ్వామా పిడి దామోదర్‌రెడ్డి
నర్వ, మార్చి 4: జాతీయ ఉపాధి హామీ పథకం త్వరలోనే పంచాయతీల్లో విలీనం చేస్తూ ఇకనుండి ఫీల్డు అసిస్టెంట్లకు జీతాలు కూడా పంచాయతీ ఇచ్చే రోజులు వస్తున్నాయని డ్వామా పిడి దామోదర్‌రెడ్డి అన్నారు. శుక్రవారం ఎంపిపి చుక్క మునెమ్మ అధ్యక్షతన మండల సమావేశంలో మాట్లాడుతూ గ్రామాల్లో ఉపాధి పథకం గొలుసుకట్టులాంటిదని అందరి సహకారంతో పనిచేయాలని సిబ్బందికి సూచించారు. ఐ సి ఐసి బ్యాంక్ ద్వారా కూలీలకు సరిగా డబ్బులు అందడం లేదని, త్వరలో కూలీలకు బ్యాంక్‌ల ద్వారా కూలీ చెల్లించే విధంగా చూస్తామని చెప్పారు. గతంలో 80లక్షల రూపాయలు కూలీలకు అందకుంటే వాటిని తిరిగి ఇప్పించామన్నారు. అన్ని గ్రామాల ఫీల్డు అసిస్టెంట్లు కూలీలకు అక్కౌంట్లు తెరిపించాలని ఆదేశించారు. ఉపాధి పథకాన్ని గ్రామపంచాయతీలకు అనుసంధానం చేస్తూ అన్ని కార్యక్రమాలు సర్పంచ్ అధీనంలోనే కొనసాగించేందుకు రంగం సిద్ధవౌతున్నట్లు తెలిపారు. జిల్లాలో కందకాలు తవ్వడం జరుగుతుందని, వాటి ద్వారా వర్షపునీరు నిలువ ఉంటుందని ఆయన అన్నారు. ఉపాధి సిబ్బంది తప్పులు చేస్తే సిబ్బందిపై వేటు పడుతుందని హెచ్చరించారు. దొంగ హాజర్లు, కొలతల్లో తప్పులు చూయిస్తే గ్రామపంచాయతీ సిబ్బందిని నిలదీయాలని అన్నారు. మరుగుదొడ్లకు నేటికీ బిల్లులు రావడం లేదని ఆరోపించారు. గ్రామకంఠంలో ఉన్న ముళ్ల పొదలను తొలగించాలన్నారు. ప్రతి ఇంటికి ఇంకుడు గుంత నిర్మించుకోవాలని సూచించారు. కొరమలింగం పల్లి ఫీల్డు అసిస్టెంటును తొలగించి ఇతరులను నియమించాలని సూచించారు. వ్యవసాయ బావులను ఉపాధి ద్వారా పూడ్చవచ్చని, జిల్లాలో అన్ని ప్రభుత్వ పాఠశాలల దగ్గర పాడుబడిన బావులుంటే వాటిని పూడ్చివేయాలని ఆదేశించారు. వ్యవసాయ బావుల్లో పూడిక తీత ద్వారా ఉపాధి ద్వారా చేపట్టవచ్చని, పశుగ్రాసం ఉపాధి ద్వారా ఇస్తున్నామని, చెరువుపాటుకాలువలు, పంట కాలువల పూడికతీతలు తీసుకోవచ్చని సూచించారు. రైతులకు ఉపయోగపడే పనులు చేస్తున్నామని పిడి తెలిపారు. జిల్లాలో 26లక్షల పని దినాలు మార్చి వరకు పూర్తిచేయాలని, ఇప్పటికే 240కోట్లు ఖర్చు చేశామన్నారు. జిల్లాలో 144గ్రామపంచాయతిలు ఉపాధి ద్వారా మంజూరు చేయడం జరిగిందని, 74గ్రామపంచాయతీలు అసంపూర్తగా ఉన్న వాటిని కూడా నిర్మించామన్నారు. అంగన్‌వాడీ భవనాలు, మహిళ సంఘం భవనాలు, వ్యవసాయ గోదాంలు ఉపాధి ద్వారా మంజూరు చేయడం జరిగిందన్నారు. లంకాల గ్రామంలో మల్బరి తోట, జిన్నారంలో నర్సరీ, చిత్తనూరు గుట్టల వద్ద కందకాల పనులు, యాంకి, లంకాల గ్రామాల్లో ఇంకుడు గుంతల పనులను పిడి పరిశీలించారు. ఈ సమావేశంలో ఏపిడి వెంకటయ్య, ఎంపిడివో రాఘవ, ఏపివో వెంకట్త్న్రం, సిబ్బంది పాల్గొన్నారు.
స్వచ్ఛ‘షాద్‌నగర్’కు సహకరించాలి
షాద్‌నగర్, మార్చి 4: స్వచ్చ్భారత్-స్వచ్చతెలంగాణ కార్యక్రమంలో భాగంగా స్వచ్చ షాద్‌నగర్ కార్యక్రమానికి ప్రజలందరు సహకరించాలని షాద్‌నగర్ పురపాలక సంఘం కమిషనర్ రామాంజులరెడ్డి కోరారు. శుక్రవారం షాద్‌నగర్ పట్టణంలోని ముఖ్యవీధుల గుండా కౌన్సిలర్లు, పురపాలిక సిబ్బంది ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ రామమాంజులరెడ్డి మాట్లాడుతూ స్వచ్చ షాద్‌నగర్‌కు నిర్వహిస్తున్న 100రోజుల కార్యక్రమానికి ప్రజలందరు సహకరించాలని అన్నారు. పురపాలక సంఘంలో వ్యక్తిగత మరుగుదొడ్లను 100శాతం పూర్తి చేయడంతో పాటు ప్రజలు ఎక్కువగా సంచరించే ప్రాంతాల్లో మరుగుదొడ్లు నిర్మించనున్నట్లు వివరించారు. ప్రభుత్వ ఆసుపత్రి వద్ద, ఎంపిడివో కార్యాలయం వద్ద, హాజిపల్లిరోడ్డులో, పురపాలిక సంఘం కార్యాలయం వద్ద, పోలీస్ స్టేషన్ సమీపంలో మరుగుదొడ్లు నిర్మించేందుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్లు వివరించారు. పల్లెల్లో నుండి వచ్చే ప్రజలు ఎక్కువగా తిరిగే ప్రాంతాల్లోనే వీటిని నిర్మించి సులబ్‌కాంప్లెక్స్ వారికి అప్పగించనున్నట్లు తెలిపారు. స్వచ్చ షాద్‌నగర్‌గా ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తున్నట్లు వివరించారు. వ్యక్తిగత మరుగుదొడ్లతో పాటు ఇంకుడు గుంతలను విధిగా ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. నిర్మించుకున్న ప్రతి ఒక్కరికి డబ్బులు త్వరలోనే అందజేయడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు మహేశ్వరీ, రెటికల్ మీన, కృష్ణవేణి, యుగందర్, ప్రతాప్‌రెడ్డితో పాటు పురపాలక సంఘం సిబ్బంది పాల్గొన్నారు.
* ర్యాలీలో కనిపించని కాంగ్రెస్ చైర్మన్, కౌన్సిలర్లు
* విభేదాలే కారణమా..?
స్వచ్చ్భారత్-స్వచ్చ తెలంగాణ కార్యక్రమంలో భాగంగా షాద్‌నగర్ పురపాలిక సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం షాద్‌నగర్ పట్టణంలో నిర్వహించిన ర్యాలీలో కేవలం టిఆర్‌ఎస్‌కి చెందిన కౌన్సిలర్లు, కమీషనర్ రామాంజులరెడ్డి, సిబ్బంది పట్టణంలోని మొయిన్‌రోడ్డు, కాలేజీరోడ్లలో ర్యాలీ నిర్వహించారు. కానీ కాంగ్రెస్ పార్టీకి చెందిన చైర్మన్ అగ్గనూరి విశ్వంతో పాటు 15 మంది కౌన్సిలర్లు ర్యాలీలో కనిపించలేదు. దీంతో షాద్‌నగర్ పట్టణంలో చర్చనీయాంశంగా మారింది. షాద్‌నగర్ పురపాలక సంఘంలో మొత్తం 23మంది కౌన్సిలర్లు ఉండగా ప్రస్తుతం టిఆర్‌ఎస్‌కు చెందిన వారు ఏడుమంది, కాంగ్రెస్ పార్టీకి చెందిన 15 మంది కౌన్సిలర్లు, కాంగ్రెస్, టిఆర్‌ఎస్ మధ్య తీవ్రమైన విభేదాల కారణంగా హాజరు కాలేదా..లేక మరి ఇతర కారణాల అనే విషయాన్ని ప్రజలు చర్చించుకుంటున్నారు. ఈ విషయాన్ని కమిషనర్ రామాంజులరెడ్డి ప్రశ్నించగా, శుక్రవారం ర్యాలీ నిర్వహిస్తున్నట్లు కౌన్సిలర్లందరితో పాటు చైర్మన్‌కు సర్క్యులర్ పంపించామని, వారు ఎందుకు హాజరు కాలేదో తెలియదని జవాబు చెప్పారు.
జిల్లా ఉద్యమానికి కలిసిరాని
నేతలకు భవిష్యత్ ప్రశ్నార్థకమే
* మాజీ ఎమ్మెల్యే డికె భరతసింహారెడ్డి
* మంగళవాయిద్యాలతో దీక్షలో నారుూ బ్రాహ్మణులు
గద్వాల, మార్చి 4: అన్ని అర్హతలు ఉన్న గద్వాలను జిల్లాగా చేయాలని డిమాండ్ చేస్తూ గద్వాలలో రోజురోజుకు కులసంఘాల నిరసన కార్యక్రమాలు మిన్నంటుతున్నాయి. పట్టణంలోని రాజీవ్‌సర్కిల్‌లో చేపడుతున్న నిరవదిక నిరాహార దీక్ష 20వ రోజు డివిజన్ నారుూబ్రాహ్మణులు మంగళవాయిద్యాలతో నిరసన తెలిపారు. గద్వాల, అలంపూర్ తాలుకాల నుంచి పెద్దసంఖ్యలో నారుూబ్రాహ్మణులు తరలివచ్చి దీక్షాశిబిరానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన శిబిరంలో మాజీ ఎమ్మెల్యే డికె భరతసింహారెడ్డి హాజరై ప్రసంగించారు. హైదరాబాద్ పట్టణం తరువాత జిల్లా కేంద్రానికి అనువైన ప్రదేశం రాష్ట్రంలో గద్వాలకు ఉందన్న విషయం ఏ ఒక్కరినడిగినా తెలుస్తోందని, ఈ విషయంపై ముఖ్యమంత్రి ఆలోచించి కొత్తజిల్లాల ఏర్పాటులో గద్వాలకు ప్రాధాన్యం కల్పించాలని డిమాండ్ చేశారు. నడిగడ్డ ప్రాంతం ప్రాజెక్టుల నిర్మాణాలతో పాటు