తెలంగాణ

ముసద్దీలాల్ సోదరులకు ముగిసిన పోలీసు కస్టడీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 2: హైదరాబాద్‌లోని ప్రముఖ నగల వ్యాపార సంస్థ ముసద్దీలాల్ యజమాని కైలాష్‌చంద్ గుప్తా, నరేందర్‌కుమార్‌లకు విధించిన ఐదు రోజుల పోలీస్ కస్టడీ ముగిసింది. దీంతో సోమవారం సిసిఎస్ పోలీసులు వారిని కోర్టులో హాజరుపరిచారు. కాగా మరో ఐదు రోజులపాటు తమ కస్టడీకి ఇవ్వాలని పోలీసులు కోరనున్నారు. పెద్దనోట్ల రద్దయిన కొన్ని గంటల్లోనే సుమారు వంద కోట్ల మేరకు అక్రమ వ్యాపారాన్ని సాగించిన అభియోగంపై పోలీసులు అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. పోలీసుల విచారణలో నిందితులు తమ నేరాన్ని అంగీకరించినట్టు సిసిఎస్ పోలీసులు తెలిపారు. అయితే తమకు కొంత గడువు ఇస్తే రూ. 80 కోట్లు పన్నుల రూపంలో ప్రభుత్వానికి చెల్లిస్తామని నిందితులు న్యాయస్థానాన్ని కోరారు. బెయిల్ కోసం నిందితుల తరఫు న్యాయవాది కోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌ను కోర్టు కొట్టివేసింది. మరో పది రోజులు తమ కస్టడీకి ఇవ్వాలని పోలీసులు మరో పిటిషన్ దాఖలు చేశారు. సదరు పిటిషన్‌ను కోర్టు పరిశీలించనుంది.