తెలంగాణ

హైదరాబాద్‌లో గంజాయి దందా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 2: హైదరాబాద్ కేంద్రంగా గంజాయి దందా సాగుతోంది. ఓ అపార్ట్‌మెంట్‌లో గంజాయి సాగు జరుగుతోంది. సౌత్‌జోన్ టాస్క్ఫోర్స్ బృందం, గోల్కొండ పోలీసుల సహకారంతో సోమవారం దాడులు నిర్వహించి సయ్యద్ షాహెద్ హుస్సేన్ అనే వ్యక్తిని అరెస్టు చేశారు. అతని నుంచి 8.6 కేజీల గంజాయితోపాటు ఓ వాహనాన్ని స్వాధీనం చేసుకున్నట్టు టాస్క్ఫోర్స్ డిసిపి కోటిరెడ్డి తెలిపారు. మణికొండ ఫ్రెండ్స్ కాలనీకి చెందిన షాబాద్ హుస్సేన్ (33) గత కొంత కాలంగా గంజాయి వ్యాపారం చేస్తున్నాడు. తాండూరు పరిసరాల నుంచి రూ. 3.500లకు కేజీ గంజాయిని తీసుకువచ్చి, రూ. 3,600లకు కేజీ అమ్ముతున్నాడు. అక్రమ వ్యాపారంతో అతి సులువుగా డబ్బు సంపాదించాలని, బంజారాదర్వాజ, జీషాన్ కేఫ్ వద్దగల వైకె రెసిడెన్సీలో ఓ ఫ్లాట్ అద్దెకు తీసుకుని 60 పూల తొట్టెల్లో గంజాయిని సాగు చేయడం ప్రారంభించాడు. సమాచారం అందుకున్న టాస్క్ఫోర్స్ పోలీసులు షాబాద్ హుస్సేన్ ఇంటిపై దాడి చేసి 8.6 కిలోల గంజాయి, 40 గంజాయి నిల్వల కుండలు, ఒక వాహనం, 25 కేజీల కోకో ఫైబర్ పీట్, 3 ఎల్‌ఈడి లైట్లు, ఒక టేబుల్ ఫ్యాన్, నిమ్మనూనె 250 గ్రాములు, ఆక్వాడిన్, పుష్పఫ్లోర్ పౌడర్, 100 గ్రాముల పొటాషియం, ఒక కేజీ క్లే స్టోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. కేసు దర్యాప్తులో ఉన్నట్టు డిసిపి వివరించారు.