తెలంగాణ

నోట్ల రద్దు పెద్ద కుంభకోణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరీంనగర్, డిసెంబర్ 2: నల్లధనం వెలికితీత పేరిట ప్రధాని నరేంద్రమోదీ 2016 నవంబర్ 8న ప్రకటించిన పెద్ద నోట్ల రద్దు భారతదేశ చరిత్రలోనే అతి పెద్ద కుంభకోణమని కాంగ్రెస్ సీనియర్ నేత, ఎఐసిసి పరిశీలకుడు సి.జయప్రకాష్ ఆరోపించారు. నోట్ల రద్దు తరువాత బిజెపి కలకత్తా శాఖకు చెందిన బ్యాంకు ఖాతాలో రూ.3 కోట్లు రూ.500, రూ.1000 నోట్లు జమ చేస్తూ పట్టుబడ్డారని, కుంభకోణానికి ఇది ఒక ఉదాహరణ మాత్రమేనని, ఇంకా అనేకచోట్ల ఇలా జరిగాయని ఆరోపించారు. నోట్ల రద్దు విషయం బిజెపి, దాని అనుబంధ సంస్థలు, వారి అనుయాయులకు ముందే లీక్ చేసి, వారంతా సర్దుకున్న తరువాత నోట్ల రద్దును ప్రకటించారని మండిపడ్డారు. సోమవారం కరీంనగర్‌లోని జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో జిల్లా కాంగ్రెస్ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశం అనంతరం సాయంత్రం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ నల్లధనాన్ని వెలికితీసేందుకే రద్దు చేసినట్లు ప్రకటించిన మోదీ 50 రోజుల్లో ఎంత నల్లధనం బయటపడిందో ప్రకటించకుండా డిజిటలైజేషన్ అంటూ మరో కొత్త పల్లవి అందుకుని ప్రజలను మభ్యపెడుతున్నారని విమర్శించారు. పెద్ద నోట్ల రద్దుతో దేశంలోని పేద, బిక్కి ప్రజలు, రైతులు, కార్మికులు, చిల్లర వర్తక వ్యాపారులు, మధ్య తరగతి కుటుంబీకులు, అసంఘటిత రంగ ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొన్నారని, 1 శాతం నల్లధనం కలిగిన ఉన్న వ్యక్తులను కట్టడి చేయడం కోసం 99 శాతం మంది ప్రజలను హింసకు గురిచేశారని ఆరోపించారు. నోట్ల రద్దు నిర్ణయం తరువాత 50 రోజుల్లో దేశవ్యాప్తంగా 115 మంది అమాయకులు బలయ్యారని, వారి కుటుంబాలకు ప్రధాని క్షమాపణలు చెప్పడంతోపాటు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. దేశవ్యాప్తంగా ఉన్న బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్ బ్యాంక్ ఖాతాల్లో 2016 మార్చి 1 నుండి నవంబర్ 8వరకు నగదు జమల వివరాలను ప్రకటించాలని పదేపదే డిమాండ్ చేసినా కేంద్ర ప్రభుత్వం స్పందించలేదని విమర్శించారు.
సహారా, బిర్లా గ్రూప్‌లకు సంబంధించిన డైరీలో నరేంద్రమోదీకి కోట్లాది రూపాయలు ఇచ్చినట్లు ఉందని, ఈ విషయంలో ఒక స్వతంత్ర సంస్థ ద్వారా విచారణ జరిపించాలని, ఇందుకు మోదీ సిద్ధమేనా అని జయప్రకాష్ ప్రశ్నించారు. కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు కటకం మృత్యుంజయం మాట్లాడుతూ పెద్ద నోట్ల రద్దుకు ముందే తమవారికి మొదలే సమాచారమిచ్చి కోట్లాది రూపాయలు మార్చుకోవడాన్ని ఖండిస్తూ ఎఐసిసి, టిపిసిసి ఆదేశాల మేరకు ఈ నెల 7న కరీంనగర్ కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి పార్టీ శ్రేణులు, ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని మృత్యుంజయం కోరారు.

చిత్రం..విలేఖరుల సమావేశంలో మాట్లాడుతున్న ఎఐసిసి పరిశీలకుడు జయప్రకాశ్