రాష్ట్రీయం

ఎన్టీఆర్‌కు బాబు నివాళులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి ఎన్‌టి రామారావుకు ఎన్టీఆర్ ఘాట్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నివాళులు అర్పించారు. మధ్యాహ్నం 2 గంటలకు చంద్రబాబు నెక్లెస్ రోడ్డులోని ఎన్టీఆర్ ఘాట్‌కు చేరుకున్నారు. అప్పటికే పలువురు ఎమ్మెల్యేలు అక్కడికి వచ్చారు. చంద్రబాబు పార్టీ ఎమ్మెల్యేలతో కలిసి ఎన్టీఆర్‌కు నివాళి అర్పించిన అనంతరం అసెంబ్లీకి వెళ్ళారు.
పాదయాత్రగా వచ్చిన జగన్
ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి శనివారం నలుపు రంగు కండువా ధరించి పాదయాత్రగా అసెంబ్లీకి చేరుకున్నారు. రవీంద్ర భారతి ఎదురుగా ఉన్న చౌరస్తాలో ప్రకాశం పంతులు విగ్రహం వద్దకు మధ్యాహ్నం 2 గంటలకు పార్టీ ఎమ్మెల్యేలు చేరుకున్నారు. జగన్ 2.30 గంటలకు అక్కడికి వచ్చారు. జగన్ సహా పార్టీ ఎమ్మెల్యేలంతా నలుపు రంగు కండువాలు ధరించి అక్కడి నుంచి పాదయాత్రగా అసెంబ్లీకి చేరారు. ఈ సందర్భంగా జగన్ మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నందున, అమరావతిలో రాజధాని నిర్మాణం పేరిట పేద రైతుల నుంచి బలవంతంగా భూములు లాక్కుంటున్నందునకు నిరసనగా నలుపు రంగు కండువాలు ధరించామని చెప్పారు.
ఎన్టీఆర్ ఘాట్‌లో మాజీ ముఖ్యమంత్రి ఎన్.టి. రామారావుకు
నివాళి అర్పిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు

ట్రెజరీ బెంచీల్లో
కూర్చున్న భూమా, అఖిల

హైదరాబాద్, మార్చి 5: ఇటీవలే టిడిపిలో చేరిన వైకాపా ఎమ్మెల్యేలు భూమా నాగిరెడ్డి, ఆయన కుమార్తె అఖిలప్రియ శనివారం ఆంధ్ర అసెం బ్లీ బడ్జెట్ సమావేశాలకు హాజరయ్యారు. ఈ ఇద్దరూ ట్రెజరీ బెంచిలో అంటే అధికార పార్టీ సభ్యులు కూర్చునే వైపే ఆసీనులు కావడం విశేషం. అయితే అధికార పార్టీ సభ్యులంతా పసుపు కండువాలతో సభలోకి వస్తే, భూమా, ఆయన కుమార్తె కండువాలు వేసుకోకుండా వచ్చారు. ఇదే విషయాన్ని సభ అనంతరం కొందరు విలేఖరులు ఆయనతో ప్రస్తావిస్తే టిడిపి తాను కొత్త కాదని, గతంలో మహానాడు వంటి సభలు జరిగినప్పుడు పచ్చ కండువా ధరించానని చెప్పారు. కాగా వీరితోపాటే పార్టీ మారిన వైకాపా ఎమ్మెల్యేలు జలీల్ ఖాన్, ఆదినారాయణ రెడ్డి కూడా అధికార పార్టీ బెంచీలలోనే కూర్చున్నారు.
జలీల్ ఖాన్ అందరి కంటే ముందుగా సభకు వచ్చి అధికార, ప్రతిపక్ష సభ్యులతో కరచాలనం చేశారు. ఎర్ర చొక్కా ధరించి సభకు వచ్చిన సిపిఐ ఎమ్మెల్సీ పిజె చంద్రశేఖరరావు మాత్రం గవర్నర్ ప్రసంగం జరుగుతున్నంత సేపు ప్లకార్డును పట్టుకుని నిలబడడం విశేషం. టిడిపి ప్రజావ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఆయన ప్లకార్డు పట్టుకుని వౌనంగా నిలబడ్డారు.

హాకీ ఆటగాడు
ముఖేశ్‌పై ఎస్సీ, ఎస్టీ కేసు
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, మార్చి 5: హాకీ అంతర్జాతీయ క్రీడాకారుడు ఎన్ ముఖేశ్ కుమార్‌పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. సెలెక్షన్ ట్రయల్స్ కోసం జింఖానా హాకీ గ్రౌండ్స్‌లో ప్రాక్టిస్ చేస్తున్న సీనియర్ హాకీ క్రీడాకారులు ఎం నాగరాజు, జి విజయ్‌కుమార్, సంతోష్‌కుమార్, జి యశ్వంత్ రావులు తమను కోచ్ ముఖేష్ కులం పేరుతో దూషిస్తూ, మానసికంగా వేధిస్తున్నారని ఫిబ్రవరి 6న బేగంపేట పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు విచారణ జరిపిన పోలీసులు ముఖేశ్‌పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నం. 88/2016 నమోదు చేశారు.