తెలంగాణ

ప్రజాసమస్యలపై పోరాటం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 2: ప్రజాసమస్యలపై పోరాటం కొనసాగిస్తామని తెలంగాణ సంయుక్త కార్యాచరణ కమిటి (టిజాక్) చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం స్పష్టం చేశారు. హైదరాబాద్‌లోని టిజాక్ కేంద్ర కార్యాలయంలో సోమవారం టిజాక్ వెబ్‌సైట్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఎన్ని ఒత్తిళ్లు ఎదురైనా రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్ చూపించిన రాజ్యాంగబద్ధమైన మార్గంలోనే పయనిస్తామన్నారు. టిజాక్‌ను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు ఈ వెబ్‌సైట్ ఉపయోగపడుతుందని వివరించారు.
బొగ్గు గనులకు సంబంధించి అండర్‌గ్రౌండ్ మైనింగ్ విధానానే్న ప్రభుత్వం చేపట్టాలని, ఓపెన్ కాస్ట్ మైనింగ్ వల్ల ప్రజలకు అనేక సమస్యలు ఎదురౌతున్నాయని వివరించారు. తెలంగాణ జిల్లాల్లో చెరువులు, కుంటల్లో చేపలను పెంచుతున్నందు వల్ల ఫిషరీస్ పాలసీపై ప్రత్యేక డాక్యుమెంటరీని రూపొందించామని, దానిపై చర్చ జరగాల్సి ఉందన్నారు. ప్రతిపక్షాలు ప్రభుత్వంపై చేసే పోరాటం నిర్ధిష్టమైన వ్యూహంతో ఉండాలని, దాని వల్ల తెలంగాణ ప్రజలకు లాభం చేకూరాలన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం వెంటనే మత్స్యవిధానాన్ని ప్రకటించాలని టిజాక్ కన్వీనర్ పిట్టల రవీందర్ డిమాండ్ చేశారు.తెలంగాణకు సంబంధించి సమగ్రమైన ఒక విద్యావిధానాన్ని రూపొందించాలని టిజాక్ నేత నల్లపు ప్రహ్లాద్ కోరారు. ఈ నెల 7 నుండి టిజాక్ నేతృత్వంలో విద్యాయాత్ర చేపడుతున్నామని, యాత్ర తర్వాత విద్యావ్యవస్థపై పూర్తిస్థాయి నివేదికను రూపొందిస్తామన్నారు.
మైనారిటీల స్థితిగతులపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన సుధీర్ కమిషన్ నివేదికను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయాలని టిజాక్ మరో నేత ఖాజామొయినుద్ధీన్ కోరారు.

చిత్రం..సోమవారం హైదరాబాద్‌లో టిజాక్ వెబ్‌సైట్ ప్రారంభించి ప్రసంగిస్తున్న జెఎసి చైర్మన్ కోదండరాం