తెలంగాణ

చేపనూ చంపేశారు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 3: మత్స్య పరిశ్రమకు మహార్థశ పట్టనుంది. మత్స్యకారులను అన్ని విధాలా ఆదుకుంటామని, వచ్చే రెండేళ్ళలో రెండు ఫిషరీస్ కాలేజీలు, రెండు పరిశోధనా కేంద్రాలు ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు అసెంబ్లీలో ప్రకటించారు. మంగళవారం అసెంబ్లీలో స్వల్ప వ్యవధి ప్రశ్నకింద మత్స్య పరిశ్రమ అంశంపై చేపట్టిన చర్చకు సిఎం కెసిఆర్ సుదీర్ఘంగా సమాధానమిచ్చారు. మత్స్య పరిశ్రమకు వచ్చే బడ్జెట్‌లో నిధులు పెంచుతామని, ఏటా 5వేల కోట్లుకు పరిశ్రమను విస్తరిస్తామని హామీ ఇచ్చారు. తెలంగాణలో చేపల పెంపకానికి వసతులున్నా, సమైక్య రాష్ట్రంలో నిర్లక్ష్యం జరిగిందన్నారు. సమైక్య రాష్ట్రంలో చేపలు, చేపల పరిశ్రమ కేవలం కోస్తాకే పరిమితమైందని, అన్ని రంగాలతోపాటు మత్స్య పరిశ్రమ విధ్వంసం జరిగిందన్నారు. రాబోయే రెండేళ్లలో సీడ్ ఉత్పత్తి కేంద్రాలు ఏర్పాటు చేస్తామన్నారు, వచ్చే ఏడాదిలోనే వీటిని అందుబాటులోకి తెస్తామన్నారు. రాష్ట్రంలో ఐదున్నర వేల కోట్ల చేప పిల్లలను పెంచే అవకాశం ఉందని, 11 లక్షల టన్నుల ఉత్పత్తి లక్ష్యంగా ముందుకెళ్తున్నామని అన్నారు. చిన్న నీటి పారుదల వ్యవస్థ రాష్ట్రానికి అద్భుతంగా ఉందన్నారు. కాకతీయ రెడ్డి రాజులు, నిజాం ప్రభువుల వల్ల రాష్ట్రంలో దేశంలో ఎక్కడా లేనివిధంగా 46,500 చెరువులు ఉన్నాయని సిఎం వివరించారు. జూరాల నుంచి పులిచింతల వరకు పలు రిజర్వాయర్లలో చేపల పెంపకం చేపడతామన్నారు.
సింగూరు, ఎస్సారెస్పీ, కడెం, ఎల్లంపల్లి, నిజాం సాగర్, లంకా సాగర్, వైరా, పాలేరు వరకు రిజర్వాయర్లు ఉన్నాయని, వాటిలో చేపల పెంపకం చేపట్టాలన్నారు. శ్రీశైలం, నాగార్జున సాగర్, పులిచింతల రిజర్వాయర్లలో మత్స్య సంపదలో తెలంగాణ వాటా తేలాలన్నారు. మహబూబ్‌నగర్‌లోని రాజోలు వద్ద తెలంగాణ మత్స్యకారులపై ఆంధ్ర మత్స్యకారులు దాడి చేసినప్పుడు తాను హెచ్చరించానని గుర్తు చేశారు. రాష్ట్రంలోని 3939 చెరువుల్లో 28 కోట్ల చేప పిల్లలను వదిలామన్నారు. చేపల ఖరీదుకు 24వేల కోట్లు ఖర్చయినట్టు వివరించారు. రాష్ట్రంలో ఏ నది, వాగుమీద వంతెన కట్టినా చెక్‌డ్యాం నిర్మించనున్నట్టు ఆయన చెప్పారు. మల్లన్న సాగర్‌నూ మత్స్య కార్మికుల కోసం నిర్మిస్తున్నామని ఉదహరించారు. ఫిషరీస్ కార్పొరేషన్ బలోపేతం చేసి, బేగంబజార్‌లోని బ్రోకర్లను అరికడతామని హామీ ఇచ్చారు. సౌకర్యాలు విస్తరిస్తున్నామని, బెస్తవారు, ముదిరాజ్‌లకు తగాదా లేకుండా చేపలు పట్టేందుకు అవకాశం కల్పిస్తామన్నారు. మత్స్య శాఖలో ఖాళీగావున్న ఉద్యోగాలను భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు. త్వరలో మత్స్య, గొర్రెల పెంపకానికి సంబంధించిన పాలసీలు ప్రకటించనున్నట్టు తెలిపారు. తెలంగాణ జీవికను సుస్థిరపరచుకోవాల్సి ఉందన్నారు.
కాంగ్రెస్ ఎమ్మెల్యే టి జీవన్‌రెడ్డి విమర్శించడం పట్ల సిఎం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ బేగంబజార్‌లో దళారులను పెంచి పోషించింది మీరేనని దుయ్యబట్టారు. సొసైటీల ఏర్పాటుకంటే ముందు అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటుచేసి చర్చించనున్నట్టు సిఎం తెలిపారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే టి రాంమోహన్‌రెడ్డి మాట్లాడుతూ ఫిషరీస్ కాలేజీ ఏర్పాటు చేయాలని సూచించారు. ఇంకా చర్చలో జి కిషన్‌రెడ్డి (బిజెపి), ఆర్ కృష్ణయ్య (టిడిపి) కూడా పాల్గొన్నారు.
‘మండలి’లో మత్స్య పరిశ్రమపై చర్చ
శాసనమండలిలో మత్స్యపరిశ్రమ అభివృద్ధి, చేపల పెంపకంపై ప్రతిపక్ష సభ్యులు షబ్బీర్ అలీ, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డితోపాటు అధికార పార్టీ సభ్యులు పాతూరి సుధాకర్‌రెడ్డి, మజ్లిస్ సభ్యుడు సయ్యద్ అల్త్ఫా రజ్వీ అడిగిన ప్రశ్నలకు మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి సమాధానమిచ్చారు. మత్స్య పరిశ్రమ అభివృద్ధి చేసేందుకు, చేపలు పట్టడం, పెంచటం, రవాణా చేయటం వంటి వృత్తులనే నమ్ముకుని జీవిస్తున్న వారికి చేయూతనిచ్చేందుకు ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టిందని వివరించారు. ఇందుకు ముందుకొచ్చే మహిళలకు చేపల పెంపకంలో ప్రత్యేక శిక్షణనిచ్చి, ప్రోత్సహిస్తున్నట్టు తెలిపారు. చేపల పెంపకంతోపాటు వాటిని ఆరోగ్యకరమైన వాతావరణంలో విక్రయించేందుకు వీలుగా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని వివరించారు. హైదరాబాద్ నగరంలోనూ చేపల విక్రయం ఓ మంచి వాతావరణంలో జరగాలన్నారు. ముఖ్యంగా గ్రేటర్ నగరంలో మేయర్, పాలక మండలి, జిహెచ్‌ఎంసిని సమన్వయం చేసుకుని ఈ దిశగా చర్యలు చేపట్టనున్నట్టు తెలిపారు. చేపల విక్రయానికి సంబంధించి ఆసక్తివున్న మహిళలు స్థానిక కార్పొరేటర్‌ను సమన్వయం చేసుకుని ముందుకొస్తే ప్రభుత్వం తప్పకుండా ప్రోత్సహిస్తుందన్నారు.