తెలంగాణ

బకాయిలు చెల్లించరేం?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 3: పాడి పరిశ్రమను ప్రోత్సహిస్తున్నామని ఒకవైపు చెబుతూనే మరోవైపు విజయ డైయిరీకి పాలు సరఫరా చేసే రైతులకు తొమ్మిది నెలలుగా బకాయిలు చెల్లించడం లేదని నిరసిస్తూ మంగళవారం శాసనసభ నుంచి కాంగ్రెస్ పార్టీ వాకౌట్ చేసింది. వ్యవసాయానికి, రైతాంగానికి అందించాల్సిన ప్రోత్సహకానికి నిధులు విడుదల చేయకపోవడమే ప్రభుత్వం అందించే తోడ్పాటా అని కాంగ్రెస్ పార్టీ తీవ్రస్థాయిలో విరుచుకుపడింది. కాంగ్రెస్ సభ్యుల ఆరోపణలలో వాస్తవం లేదని, బకాయి పడింది మూడు నెలలు మాత్రమేనని పాడి పరిశ్రమాభివృద్ధి శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వివరించినా కాంగ్రెస్ సభ్యులు సంతృప్తి చెందలేదు. సిఎల్‌పి ఉపనేత టి జీవన్‌రెడ్డి, ఇతర సభ్యులు ప్రశ్నోత్తరాల వ్యవధిలో పాడి రైతులకు చెల్లించాల్సిన బకాయిలపై ప్రస్తావించారు. తొమ్మిది నెలల బకాయిలు చెల్లించాల్సి ఉందని లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చిన మంత్రి సభలో మాత్రం మూడు నెలలు మాత్రమే బకాయిపడ్డామని చెప్పడం సభను తప్పుదోవ పట్టించినట్టేనని జీవన్‌రెడ్డి అన్నారు.
లిఖితపూర్వకంగా ఇచ్చిన సమాధానం ఇప్పటిది కాదని, గతంలో ఇచ్చిన సమాధానాన్ని పొరపాటుగా తాజాగా ఇచ్చారని మంత్రి తలసాని వివరించినా కాంగ్రెస్ సభ్యులు శాంతించలేదు. సభ ముందు ఉంచే పత్రాల పట్ల శాసనసభ సచివాలయం ఇంత నిర్లక్ష్యంగా ఎలా వ్యహరించిందో చెప్పాలని కాంగ్రెస్ సభ్యులు నిలదీశారు. వ్యవసాయం, రైతుల గురించి కాంగ్రెస్ హయాంలో ఎనాడు పట్టించుకోని వారికి తమను ప్రశ్నించే నైతిక హక్కు లేదని మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ ఎదురుదాడికి దిగడంతో సభలో మంత్రికి కాంగ్రెస్ సభ్యులకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ప్రభుత్వ విజయ డైయిరీకి పాలు సరఫరా చేసే రైతులకు లీటర్‌కు రూ.4 చొప్పున ప్రోత్సహకం ఇస్తున్నట్టు ముఖ్యమంత్రి కెసిఆర్ స్వయంగా ప్రకటించినా నిధులు ఎందుకు విడుదల చేయడం లేదని జీవన్‌రెడ్డి ప్రశ్నించారు. హైదరాబాద్ నగరానికే ప్రతి రోజు 25 లక్షల లీటర్ల పాలు అవసరం అవుతాయని, విజయ డైయిరీ సరఫరా చేసేది కేవలం 4 నుంచి 5 లక్షల లీటర్లు మాత్రమేనని మిగతా పాలు పొరుగు రాష్ట్రాలు, ప్రైవేట్ డైయిరీల నుంచి అందుతున్నాయని కాంగ్రెస్ సభ్యుడు చిన్నారెడ్డి గుర్తు చేశారు. ప్రభుత్వ డైయిరీని ప్రోత్సహిస్తే కనీసం హైదరాబాద్ నగరానికి కావాల్సిన సగం పాలను అయినా సరఫరా చేసే స్థాయికి చేరుకుంటుందని చిన్నారెడ్డి సూచించారు. మరో సభ్యుడు వంశీచందర్‌రెడ్డి మాట్లాడుతూ బడ్జెట్ సమావేశాలలోనే తాను పాడి రైతుల బకాయిల విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసికెళ్లగా త్వరలో చెల్లిస్తామని హామీ ఇచ్చిందన్నారు. తమ ప్రశ్నకు సూటిగా మంత్రి సమాధానం చెప్పనందుకు నిరసనగా సభ నుంచి కాంగ్రెస్ వాకౌట్ చేసింది.