తెలంగాణ

కైరో తరహా ముట్టడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 4: ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను సక్రమంగా అమలు చేయకపోతే కైరో తరహాలో లక్ష మంది విద్యార్థులతో ప్రభుత్వాన్ని ముట్టడిస్తామని, కైరోలో మాదిరి ప్రభుత్వం గద్దెదిగే పరిస్థితి వస్తుందని కాంగ్రెస్ సభ్యుడు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి హెచ్చరించారు. బుధవారం శాసనసభలో ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై జరిగిన స్వల్పకాలిక చర్చలో ఆయన మాట్లాడుతూ విద్య వైద్య రంగాలకు ఈ ప్రభుత్వం ఏం చేయదల్చుకుందో చెప్పాలని డిమాండ్ చేశారు. విద్యారంగం రోడ్డున పడిందని, విద్యార్థులు, అధ్యాపకులు అప్పులపాలై రోడ్డున పడ్డారని అన్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను కొనసాగిస్తారో లేదో చెప్పాలని నిలదీశారు. డిప్లొమా విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ లేదని చెబుతున్నారని వారికీ బకాయిలు చెల్లించాలని చెప్పారు. కాంగ్రెస్ సభ్యుడు టి రామమోహన్ రెడ్డి మాట్లాడుతూ ఫీజు బకాయిలను జీరో చేస్తామని సిఎం చెప్పి ఏడాది అవుతున్నా ఇంత వరకూ బకాయిలు చెల్లించలేదని అన్నారు.
జనవరి నాటికి అన్ని రకాల బకాయిలు కలిపి రూ. 4400 కోట్లు ఉన్నాయని, ప్రభుత్వ వైఖరితో 103 సాంకేతిక విద్యాసంస్థలు మూతపడ్డాయని పేర్కొన్నారు. 14 లక్షల మంది విద్యార్థులు ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిల కోసం ఎదురుచూస్తున్నారని చెప్పారు. అలాగే ఇంజనీరింగ్ కాలేజీల్లో మిగిలిపోయిన సీట్లలో ఇతర రాష్ట్రాల విద్యార్థులను కన్వీనర్-1 కోటాలో చేర్చుకోవాలని సూచించారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ అంశంతో ఆరు వేల విద్యాసంస్థల భవితవ్యం ముడిపడిందని, అలాగే ఉద్యోగులు, విద్యార్థులు కలిపి 20 లక్షల మంది ఉక్కిరిబిక్కిరి అవుతున్నారని పేర్కొన్నారు. జీతాలు సకాలంలో అందక అధ్యాపకులు ఉద్యోగాలు మానేస్తున్నారని రూ. లక్షల కోట్లు బడ్జెట్‌లో పెట్టి, రెండు మూడు వేల కోట్లు కూడా ఇవ్వకపోవడం చూస్తుంటే ప్రభుత్వ చిత్తశుద్ధిని శంకించాల్సి వస్తోందని అన్నారు. ప్రభుత్వ విద్యావిధానాన్ని పటిష్ఠం చేయాలని లక్ష్మణ్ కోరారు. టిడిపి సభ్యుడు రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ కొత్త సమస్యలకు ఈ ప్రభుత్వం తెరతీసిందని, దీనిని సంక్షేమ పథకంగా కాకుండా పెట్టుబడిగా చూడాలని చెప్పారు. ఎంఐఎం నేత అక్బరుద్దీన్ మాట్లాడుతూ మైనార్టీలకు తీవ్ర నష్టం వాటిల్లుతోందని పేర్కొన్నారు. చర్చలో జి కిశోర్, సున్నం రాజయ్య తదితరులు పాల్గొన్నారు.