తెలంగాణ

రూ.4688 కోట్లు తిరిగి చెల్లించాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 4: తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుండి ఇంత వరకు ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం కింద రూ. 4687.72 కోట్లు చెల్లించామని షెడ్యూల్డు కులాల అభివృద్ధి శాఖ మంత్రి జి జగదీశ్ రెడ్డి చెప్పారు. ఇటీవలి కాలంలో కేంద్రప్రభుత్వం పెద్ద నోట్ల రద్దు నిర్ణయం తీసుకోవడంతో దాని ప్రభావం ఖజానాపై పడిందని, అయితే ఎంత మేరకు ఆ ప్రభావం పడుతున్నదో జనవరి నెలలో అవగతం అవుతుందని చెప్పారు. బుధవారం శాసనసభలో ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై జరిగిన స్వల్పకాలిక చర్చకు మంత్రి బదులిచ్చారు. పేద విద్యార్థుల సంక్షేమానికి ఉద్దేశించిన ఈ పథకాన్ని ప్రభుత్వం పకడ్బందీగా అమలుచేసి తీరుతుందని అన్నారు. సమైక్య రాష్ట్రంలో ప్రారంభించిన ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని తెలంగాణ రాష్ట్రంలో కూడా యథాతథంగా కొనసాగించాలని నిర్ణయించామని చెప్పారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడే నాటికి ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం కింద విద్యాసంస్థలకు చెల్లించాల్సిన మొత్తం రూ. 1880.97 కోట్లు ఉందని అన్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ పొందుతున్న విద్యాసంస్థల సంఖ్య 6843 కాగా అందులో ప్రభుత్వ సంస్థలు కేవలం 1293 మాత్రమేనని, 5550 ప్రైవేటు విద్యాసంస్థలున్నాయని వివరించారు. అంటే మొత్తం ఫీజు రీయింబర్స్‌మెంట్‌లో 18.90 శాతం ప్రభుత్వ సంస్థలకు 9.82 శాతం నిధులు దక్కుతుంటే, 81.10 శాతం ప్రైవేటు విద్యాసంస్థలకు 90.18 శాతం నిధులు దక్కుతున్నాయని చెప్పారు. ఎప్పటికప్పుడు ఫీజు రీయింబర్స్‌మెంట్‌కి సంబంధించి నిధులు విడుదల అవుతూ చెల్లింపులు జరుగుతున్నాయని తెలిపారు.