తెలంగాణ

తప్పుడు సంస్థలపై చర్యలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 4: తెలంగాణ రాష్ట్రంలో విద్యాప్రమాణాలపై రాజీ పడే ప్రసక్తే లేదని, తప్పుడు సంస్థలపై చర్యలు తప్పవని, అదే విధంగా విద్యార్థి సంక్షేమంలో ప్రభుత్వం వెనుకంజ వేసేది లేదని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు పేర్కొన్నారు. బుధవారం శాసనసభలో ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై జరిగిన స్వల్పకాలిక చర్చకు ఆయన బదులిస్తూ ఫీజు రీయింబర్స్‌మెంట్ ప్రభుత్వం మోయలేని పెద్ద భారం ఏమీ కాదని అన్నారు. అయితే దీనికి సంబంధించి కొన్ని వాస్తవాలు ప్రజల వద్దకు పోవాలని చెప్పారు. విద్యార్థుల్లో ఆశలు రేకెత్తించి అశనిపాతం చేయరాదని, వారికి సరైన మార్గాన్ని చూపాలని అన్నారు. ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ ఉద్యోగం సాధ్యం కాదని, రాష్ట్రంలో మొత్తం ఉద్యోగులే మూడున్నర లక్షల మంది ఉన్నారని అందులో రిటైరైన వారి మేరకు రిక్రూట్‌మెంట్లు జరుగుతాయని స్పష్టం చేశారు. ఉపాధి అంటే ప్రభుత్వ ఉద్యోగం మాత్రమే కాదని, చదువుకోగానే ఇంజనీర్ అనే ప్రచారం సరైంది కాదని అన్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ వల్ల ఏటా ప్రభుత్వంపై రూ. 2500 కోట్ల భారం పడుతోందన్నారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేసినపుడు విధించిన నిబంధనలనే తాము కొనసాగిస్తున్నామని, అందులో ఏం మార్పులు చేయలేదని సిఎం వివరించారు. ఇంత వరకు రూ. 4687.72 కోట్లు చెల్లించామని, వీలైనంత తొందర్లో మిగిలిన బకాయిలను కూడా చెల్లిస్తామని అన్నారు.
రాష్ట్రంలో ఉన్నన్ని కాలేజీలు దేశంలో ఎక్కడా లేవని పేర్కొన్న సిఎం ప్రమాణాల విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. కొత్తగా 71 మైనార్టీ కాలేజీలు, 119 బిసి రెసిడెన్షియల్ స్కూళ్లు ప్రారంభిస్తున్నామని, ప్రతి నియోజకవర్గంలో ఒక రెసిడెన్షియల్ స్కూల్ ప్రారంభిస్తామని చెప్పారు. విదేశీ చదువుల కోసం 300 మందికి ఒకొక్కరికి రూ. 20 లక్షల చొప్పున ఇచ్చామన్నారు.
పెద్ద పెద్ద కంపెనీలు క్యాంపస్ ఇంటర్వ్యూలను ఆపేశామని చెప్పినపుడు బాధకలిగి చర్యలు చేపట్టామని, కాలేజీల్లో ప్రమాణాలను పెంచాలని కోరామని, అంతే తప్ప మూసేయాలి, కోసేయాలి, తీసేయాలన్నది తమ అభిమతం కాదన్నారు. కావాలంటే సమయం తీసుకుని ప్రమాణాలు పెంచుకోమని చెప్పామని, అయితే కొన్ని యాజమాన్యాలు తమంత తాముగా కాలేజీలను మూసేసుకున్నాయని వివరించారు. కానిస్టేబుల్ ఉద్యోగాలకు కూడా ఇంజనీరింగ్ విద్యార్థులు దరఖాస్తు చేస్తున్నారని డిజిపి చెప్పారని, గ్రాడ్యుయేట్ల అవసరం ఎంత ఉందో చూసుకుని తదనుగుణంగా చదువులు ఉండాలని సిఎం పేర్కొన్నారు.
పెద్ద నోట్ల రద్దుతో కొంత ప్రభావం పడినా, ప్రభుత్వానికి భయంకరంగా దెబ్బతగలలేదని సిఎం అన్నారు. ఇప్పటికీ ఎలక్ట్రానిక్ వినియోగంలో దేశంలోనే ప్రథమ స్థానంలో ఉన్నామని పేర్కొన్నారు. ఎవరికీ ఇబ్బంది రానివ్వమని, వంద శాతం చెల్లింపు సాధ్యం కాదని పేర్కొన్నారు. అంత మాత్రాన ఎవరికీ ఆందోళన అక్కర్లేదని, మైనార్టీల ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు సిబ్బందిని ఇస్తామని, ప్రత్యేక సాఫ్ట్‌వేర్ రూపొందిస్తామని సిఎం వివరించారు. వీలైనంత త్వరగా మిగిలిన బకాయిలు కూడా చెల్లిస్తామని, క్షోభ పడనక్కర్లేదని పేర్కొన్నారు.