తెలంగాణ

అనాథ పిల్లలకు ఎస్సీ ప్రయోజనాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 5: అనాథ పిల్లలకు ఎస్సీలకు వర్తించే ప్రయోజనాలను కల్పిస్తామని ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రకటించారు. ఇకనుంచి అనాథ పిల్లలకు తల్లీతండ్రీ ప్రభుత్వమే అవుతుందన్నారు. శాసనసభలో గురువారం ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై జరిగిన లఘు చర్చలో బిజెపి పక్షం నాయకుడు జి కిషన్‌రెడ్డి అనాథ పిల్లలకు ఫీజు రీయింబర్స్‌మెంట్ వర్తించడం లేదని సభ దృష్టికి తీసుకొచ్చారు. తన నియోజకవర్గంలో జరిగిన ఒక సభలో అనాథ పిల్లలు తనను కలిసి ఎస్‌ఎస్‌సి వరకు చదువుకున్నామని, ఆ తర్వాత ఎక్కడికి వెళ్లాలో తెలియడం లేదని చెప్పారన్నారు. వారి పరిస్థితి తనను తీవ్రంగా కలిచివేసిందని చెప్పారు. కిషన్‌రెడ్డి సభ దృష్టికి తీసుకొచ్చిన విషయాన్ని మానవీయ కోణంలో ఆలోచించి అనాథ పిల్లలకు ఎస్సీలకు వర్తించే ప్రయోజనాలను కల్పిస్తూ వెంటనే ఉత్తర్వులు జారీ చేయాల్సిందిగా అధికారులను ఆదేశించినట్టు ముఖ్యమంత్రి చెప్పారు. అంతకుముందు కిషన్‌రెడ్డి మాట్లాడుతూ సైదాబాద్‌లో వైదేహి అనే ఆడపిల్లల అనాథాశ్రమం ఉందన్నారు. అక్కడ చదువుకుంటున్న పిల్లలకు తల్లిదండ్రులనుంచి ఆదాయ ధ్రువపత్రం లేదన్న కారణంగా ఫీజు రీయింబర్స్‌మెంట్ వర్తింపజేయడం లేదని వివరించారు. తల్లిదండ్రులు లేకపోవడం వల్లనే వారు అనాథలయ్యారని, అలాంటప్పుడు వారికి ఆదాయ ధ్రువీకరణ పత్రం ఎక్కడినుంచి వస్తుందని ప్రశ్నించారు. అలాగే ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు అందలేదని కొన్ని విద్యాసంస్థలు చదువు పూర్తయిన తర్వాత కూడా సర్ట్ఫికెట్లను తమవద్దనే పెట్టుకుంటున్నాయని కిషన్‌రెడ్డి సభ దృష్టికి తీసుకురాగా, అలా చేసే వారిపై చర్య తీసుకుంటామని ముఖ్యమంత్రి హెచ్చరించారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై త్వరలో అన్ని పార్టీలను పిలిచి చర్చించనున్నట్టు ముఖ్యమంత్రి చెప్పారు.