తెలంగాణ

కాంట్రాక్టు లెక్చరర్లకు మరోమారు శరాఘాతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 5: కాంట్రాక్టు లెక్చరర్లకు 10వ పిఆర్‌సి కనీస బేసిక్‌ను యథాతథంగా అమలుచేయాల్సిన ప్రభుత్వం కేవలం 50 శాతం మాత్రమే చెల్లిస్తామని చెప్పడం ద్వారా మరోమారు ప్రభుత్వం వారికి మొండిచేయి చూపించింది. ప్రస్తుతం కాంట్రాక్టు లెక్చరర్లకు 9వ పిఆర్‌సిలో కనీస బేసిక్‌ను అమలుచేస్తున్నారు. కొత్త పిఆర్‌సి రాగానే అదే పద్ధతిని కొనసాగిస్తారని భావించిన కాంట్రాక్టు లెక్చరర్లకు ప్రభుత్వం నిర్ణయం శరాఘాతంగా మారింది. ఇదేం పద్ధతి అని వారు ప్రశ్నిస్తుంటే మీ ఉద్యోగాలను పర్మినెంట్ చేస్తాం కదా అపుడు పూర్తి వేతనాలు వస్తాయంటూ ఆశలు రేకెత్తిస్తోంది. ఉద్యోగాలు పర్మినెంట్ అయ్యేది ఎపుడు? పూర్తి వేతనాలు వచ్చేదెపుడు అంటూ కాంట్రాక్టు లెక్చరర్లు వాపోతున్నారు.
తమ ఉద్యోగాలను పర్మినెంట్ చేయమని గత పదహారేళ్లుగా కొట్లాడుతున్నామని టిఎస్ ప్రభుత్వ కాలేజీల కాంట్రాక్టు లెక్చరర్ల సంఘం స్టీరింగ్ కమిటీ నేత డాక్టర్ కొప్పిశెట్టి సురేష్ పేర్కొన్నారు. తెలంగాణలో జూనియర్, డిగ్రీ కాలేజీల్లో 4500 మంది కాంట్రాక్టు లెక్చరర్లుగా పనిచేస్తున్నారని , 2011 తర్వాత ఒక్క రూపాయి కూడా వేతనం పెరగలేదని అన్నారు. అప్పులతో కుటుంబాలను పోషించలేని పరిస్థితుల్లో క్రమబద్ధీకరణ ప్రక్రియ పూర్తయ్యేంత వరకూ 10వ పిఆర్‌సి ప్రకారం బేసిక్ పే, డిఎ చెల్లించాలని ఆయన కోరారు.
ఇటు సిఎంకు మరో పక్క డిప్యుటీ సిఎంకు తమ సమస్యలపై ఇప్పటికే అనేక మార్లు వివరించడం జరిగిందని, డిసెంబర్ 28న వేలాది మందితో ధర్నా నిర్వహించామని అన్నారు. అయినా ప్రభుత్వం స్పందించకపోవడంతో 29వ తేదీ నుండి నిరవధిక సమ్మె చేపట్టారని 8 రోజులుగా సమ్మె జరుగుతున్నా ప్రభుత్వానికి నిమ్మకు నీరెత్తినట్టు లేదని పేర్కొన్నారు. డిగ్రీ, జూనియర్ కాలేజీల్లో నాన్ సాంక్షన్డ్ పోస్టులను మంజూరు చేయాలని, అదనపు అర్హలతో సంబంధం లేకుండా డిగ్రీ కాంట్రాక్టు లెక్చరర్లను క్రమబద్ధీకరణ ప్రక్రియ చేయాలని , వొకేషనల్ కాలేజీల్లో రెండో పోస్టును మంజూరు చేయాలని, ఎంఎల్‌టి, ఎంపిహెచ్ డబ్ల్యు గతంలో పనిచేసిన వారిని తిరిగి రెండో పోస్టులో నియమించాలని కోరారు.