తెలంగాణ

చేనేత కార్మికులకు ఇంజనీర్ల చేయూత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 5: రాష్ట్రంలోని చేనేత కార్మికులకు చేయూత ఇచ్చేందుకు ఇంజనీర్లు కూడా చేనేత దుస్తులను కొనుగోలు చేయాలని గ్రామీణ తాగునీటి సరఫరా శాఖ ఇంజనీర్ ఇన్ చీఫ్ సురేందర్‌రెడ్డి కోరారు. జిల్లాల్లోని తాగునీటి విభాగం ఎస్‌ఇ, ఇఇలు, మిషన్ భగీరథ పనులపై గురువారం ఆయన వీడియ కాన్ఫరెన్స్‌ద్వారా సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఐటి, పరిశ్రమల మంత్రి కె. తారకరామారావు చేసిన విజ్ఞప్తి మేరకు చేనేత దుస్తులను కొనుగోలు చేసేందుకు ఇంజనీరింగ్ విభాగం ఉద్యోగులు సహకారం అందించాలని సూచించారు. హైదరాబాద్‌లోని ప్రధాన కార్యాలయంతోపాటు జిల్లాల్లోని ఉద్యోగులంతా పతి సోమవారం చేనేత దుస్తులు ధరించాలని, తద్వారా నేత కార్మికులకు చేయూత ఇచ్చినట్టవుతుందని వివరించారు. ఈ సమావేశంలో సంబంధిత అధికారులు పాల్గొన్నారు.