తెలంగాణ

సభ వాయిదా దురదృష్టకరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్/ ఖైరతాబాద్, జనవరి 5: శాసనసభలో బుధవారం జరిగిన పరిణామాలు ఎంతో బాధాకరమని టిడిపి ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి అన్నారు. వేలాది మంది విద్యార్థులకు అవసరమైన అత్యంత కీలకమైన అంశంపైన చర్చ జరుగుతుండగా అర్ధాంతరంగా సభని వాయిదా వేశారని అన్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ అంశంపై ఈ రోజైనా చర్చించాలని కోరితే ప్రభుత్వం సరైన వివరణ ఇవ్వలేదన్నారు. డిప్యూటీ స్పీకర్‌కు జరిగిన అవమానం భవిష్యత్‌లో స్పీకర్‌కు జరిగే అవకాశం లేకపోలేదన్నారు.
ఫీజుల చెల్లింపుల విషయంలో ప్రభుత్వం కొంతమేర మాత్రమే చెల్లించే విధంగా హామీ ఇవ్వడం జరిగిందన్నారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే తనిఖీల రిపోర్టులను సభ ముందు ఉంచాలని కాంగ్రెస్ నేత భట్టి విక్రమార్క డిమాండ్ చేశారు.
ఉద్యోగాల భర్తీ వాయిదా సరికాదు
తెలంగాణ ఉద్యమం జరిగిందే నిధులు, నియామకాల కోసం అయితే ప్రస్తుత ప్రభుత్వం ఎన్నో సాకులు చెబుతూ ఉద్యోగాల భర్తీని వాయిదా వేస్తోందని ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య విమర్శించారు. ముఖ్యమంత్రి నిరుద్యోగులను దూషించినట్టు మాట్లాడటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్టు చెప్పారు. కొత్త జిల్లాలతో ఏర్పడ్డ ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. పనికి రాని వాళ్లందర్ని సలహాదారులుగా పెట్టిన ప్రభుత్వం నిరుద్యోగులకు మాత్రం ఉద్యోగాలు ఇవ్వడం లేదని విమర్శించారు.
ఉద్దేశపూర్వకంగానే సభలో గందరగోళం
ప్రతిపక్షాలు ఉద్దేశపూర్వకంగానే సభలో గందరగోళం సృష్టిస్తున్నాయని టిఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు జీవన్‌రెడ్డి, గువ్వల బాలరాజు అన్నారు. సభను ఎంతో హుందాగా నిర్వహిద్దామని ప్రయత్నిస్తుంటే ప్రతిపక్షాలు మాత్రం ఇబ్బందులకు గురిచేస్తున్నాయని మండిపడ్డారు. వెంటనే తీరు మార్చుకొని సలహాలు, సూచనలు ఇవ్వాలని కోరారు.