తెలంగాణ

రికార్డుస్థాయిలో ధాన్యం కొనుగోలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 5: తెలంగాణ రాష్ట్రంలో 2016 ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి 3.56 లక్షల మంది రైతుల నుండి 15.13 లక్షల టన్నుల వరిధాన్యం కొనుగోలు చేశామని పౌరసరఫరాల కమిషనర్ సివి ఆనంద్ తెలిపారు. ఈ మేరకు గురువారం ఒక ప్రకటన విడుదల చేస్తూ, ధాన్యం కొనుగోలుకు 2137 కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. రైతుల నుండి కొనుగోలు చేసిన ధాన్యంలో ఏ గ్రేడ్ రకం 12.19 లక్షల టన్నులు కాగా, సాధారణ రకం 2.93 లక్షల టన్నులుగా ఉందని వివరించారు. మొత్తం ధాన్యానికి 2272 కోట్ల రూపాలను రైతులకు చెల్లించారు. చెల్లింపులన్నీ ఆన్‌లైన్ విధానంలో చేశారు. దళారుల ప్రమేయాన్ని నిర్మూలించేందు లక్ష్యంతో ఆన్‌లైన్ ప్రొక్యూర్‌మెంట్ మేనేజ్‌మెంట్ సిస్టం (ఓపిఎంఎస్) ద్వారా కొనుగోళ్లు చేశామన్నారు. రైతులకు చెల్లింపులు కూడా ఆన్‌లైన్ విధానంలోనే బ్యాంకుల్లో డిపాజిట్ చేశారు. ఖరీఫ్ సీజన్‌లో దాదాపు 20 లక్షల టన్నుల వరకు ధాన్యం కొనుగోలు చేయాల్సి వస్తుందని అంచనావేయగా, ఇప్పటి వరకు జరిగిన 15.13 లక్షల టన్నులతో పాటు మరో లక్ష నుండి రెండు లక్షల టన్నుల వరకు కొనుగోలు చేసే పరిస్థితి ఉందన్నారు. గత ఏడాది ఇదే సమయానికి 13.35 లక్షల టన్నుల వరిధాన్యం కొనుగోలు చేశారు. ఈ సంవత్సరం ఇప్పటి వరకు జరిగిన కొనుగోలులో నిజామాబాద్ జిల్లా 2.03 లక్షల టన్నులతో మొదటి స్థానంలో నిలవగా, జయశంకర్ భూపాల్‌పల్లి 1.49 లక్షల టన్నులతో రెండోస్థానంలో, జగిత్యాల 1.43 లక్షల టన్నులతో మూడోస్థానంలో నిలుస్తోంది. కమిషనర్ సూచనల మేరకు జాయింట్ కలెక్టర్లు ధాన్యం కొనుగోలుపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించారు. ధాన్యం విక్రయించే రైతుల వివరాలు, సాగుచేసిన విస్తీర్ణం, పంట దిగుబడి, ఆధార్‌కార్డు, బ్యాంక్ అకౌంట్ తదితర వివరాలన్నీ అధికారికంగా కొనుగోలు కేంద్రంలో నమోదు చేశారు. ఈ వివరాలను ఒపిఎంఎస్‌లో అప్‌లోడ్ చేశారు. ఈ వివరాలన్నీ పౌరసరఫరాల సంస్థకు చేరాయి. వీటిని పరిశీలించిన తర్వాత పౌరసరఫరాల సంస్థ మేనేజర్ ఐడికి నిధులను విడుదల చేశారు. ఆ తర్వాత వీటిని బ్యాంకుద్వారా నేరుగా రైతుల ఖాతాల్లో జమచేశారు. మార్కెట్లోకి ధాన్యం వచ్చే సమయానికి జిల్లాల పునర్వ్యవస్థీకరణ జరిగింది. అయినప్పటికీ, పాత జిల్లా కేంద్రంగా కార్యక్రమాలను నిర్వర్తించడంతో ధాన్యం సేకరణ సజావుగా సాగింది.