తెలంగాణ

నీటిపైపులకు సమాంతరంగా టి-ఫైబర్ పైపులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 5: మిషన్ భగీరథ కోసం వేస్తున్న పైపులతో పాటు టి-ఫైబర్ లైన్లను కూడా శ్రద్దతో వేయాలని, భగీరథ-టిఫైబర్ వర్కింగ్ ఏజన్సీలు సమన్వయంతో పనిచేయాలని ఐటి శాఖ మంత్రి కె. తారకరామారావు విజ్ఞప్తి చేశారు. టిఫైబర్ పనులపై కెటిఆర్ గురువారం ఇక్కడ సమీక్షించారు.
నీటి పైప్‌లైన్లతో పాటు ఫైబర్‌డక్ట్‌లను వేస్తేనే పైప్‌లైన్లకు బిల్లులు చెల్లిస్తామంటూ గ్రామీణ తాగునీటి శాఖ పెట్టిన నిబంధనతో పనులు వేగంగా సాగుతున్నట్టు సమీక్షాసమావేశంలో వెల్లడైంది. 2018 మధ్య వరకు భగీరథ పనులు పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్ణయించారు. టిఫైబర్ డక్ట్‌ల ఏర్పాటుకు నిధులకు ఎలాంటి ఇబ్బందిలేదని మంత్రి హామీ ఇచ్చారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పరస్పర సహకారంతో ఈ పనులు వేగంగా జరుగుతున్నాయి. టిఫైబర్ ప్రాజెక్టుతో పాటు టివర్క్స్‌పై కూడా మంత్రి సమీక్షించారు. ఎలక్ట్రానిక్స్, హార్ట్‌వేర్ పరిశోధనకోసం టివర్క్స్‌ను ప్రారంభిస్తామని మంత్రివెల్లడించారు. నగరంలో ఇప్పటికే ఇందుకోసం 12 ప్రాంతాలను పరిశీలించామన్నారు. ఒకటి రెండు వారాల్లో టివర్క్స్ ఏర్పాటు చేయబోయే ప్రాంతాన్ని ప్రకటిస్తామని కెటిఆర్ వెల్లడించారు.

చిత్రం..టిఫైబర్ పనులపై గురువారం అధికారులతో సమీక్షిస్తున్న మంత్రి కెటిఆర్