తెలంగాణ

అర్హత గల బిఇడి కాలేజీలను వర్శిటీలకు అనుబంధం చేయండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 6: తెలంగాణలో అర్హత ఉన్న ప్రైవేటు బిఇడి కాలేజీలను విద్యా చట్టం 1982 సెక్షన్ 20 కింద సంబంధిత విశ్వవిద్యాలయాలకు అనుబంధం చేయాలని హైకోర్టు తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది. తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేశ్ రంగనాథం, జస్టిస్ ఎ శంకర్ నారాయణతో కూడిన ధర్మాసనం ఎదుట తమ కాలేజీలకు రాష్ట్రంలో వర్శిటీల నుంచి అనుబంధం గుర్తింపు లభించలేదని కొన్ని బిఇడి కాలేజీల యాజమాన్యాలు పిటిషన్లను దాఖలు చేశాయి. బిఇడి సీట్ల కేటాయింపు రెండవ దశలో ఈ కాలేజీలను వెబ్ కౌనె్సలంగ్‌లో చేర్చాలని హైకోర్టు తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యా మండలిని ఆదేశించింది. ఈ కాలేజీలకు ఎన్‌సిటిఇ గుర్తింపు కూడా ఉందని హైకోర్టు పేర్కొంది. ఎన్‌సిటిఇ గుర్తిస్తూ ఇచ్చిన ఆదేశాలను పక్కనబెట్టే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదని సింగిల్ జడ్జి కోర్టు ఇచ్చిన ఆదేశాలతో హైకోర్టు ధర్మాసనం ఏకీభవించింది.