తెలంగాణ

సైబర్ నేరాలపై అప్రమత్తం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్/గచ్చిబౌలి, జనవరి 9: ఉద్యోగాలు, బ్యాంకు అధికారుల మంటూ మోసాలకు పాల్పడుతున్న నేరగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ ఎం భగవత్ సూచించారు. సైబర్ నేరాలపై అప్రమత్తత అవసరమని, ఈనేరాలపై ప్రజలకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. సోమవారం సైబరాబాద్ కమిషనరేట్‌లో నిర్వహించిన ‘నగదు రహిత లావాదేవీలు-సైబర్ సెక్యూరిటీ’ అనే అంశంపై నిర్వహించిన వర్క్‌షాప్‌లో ఆయన మాట్లాడారు. పోలీస్ సిబ్బందికి సైబర్ సెక్యూరిటీపై తరచూ వర్క్‌షాప్‌లు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. సైబర్ నేరాల్లో అధిక శాతం బ్యాంకుల పేరుతో లోన్, ఐటి సంస్థల పేరుతో ఉద్యోగాలు వంటి వాటిని ఆశ చూపి నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారన్నారు.
అన్‌లైన్ లావాదేవీలు చేసే సమయంలో చాలా జాగ్రత్త వహించాలని సూచించారు. పాస్ వర్డ్ ఉపయోగించే సమయంలో జాగ్రత్తగా ఉండాలని ఫిషింగ్ మెయిల్స్‌పై అప్రమత్తత అవసరమని పేర్కొన్నారు. చాలామంది 2006నుండి ఇప్పటి వరకు పాస్‌వర్డ్ మార్చుకోలేదని, తరచూ పాస్‌వర్డ్ మార్చుకోవాలని సూచించారు. మెయిల్స్‌కి, ఫేస్‌బుక్, అన్‌లైన్ లావాదేవీలకు ఒకే పాస్‌వర్డ్ ఉపయోగిస్తుంటారని అలాచేయవద్దని తెలిపారు. నూతన ఒరవడిలో పంథా మారుస్తూ సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారని, అలాంటి వారి పట్ల అప్రమత్తత అవసరమని వివరించారు. చివరికి బ్యాంకు ఖాతా తెరచిన సమయంలో ఇచ్చిన వివరాలు అందులో ఉన్నా, నామినీ పేర్లతో కూడా మోసాలకు దిగుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రతి ఒక్కరు తమ వివరాలను గోప్యంగా ఉంచుకోవాలని సూచించారు. బీహార్, పశ్చిమబెంగాల్, న్యూఢిల్లీ వంటి ప్రాంతాలలో ఉండి నిందితులు నేరాలకు పాల్పడుతున్నారని చెప్పారు. ఈసందర్భంగా గతంలో జరిగిన నేరాలను వివరించిన భగవత్ నగదు రహిత లావాదేవీలకు ప్రభుత్వ కూడా ప్రాధాన్యతనిస్తుండడంతో ప్రజలను చైతన్య పరచాల్సిన అవసరం ఉందన్నారు. సెంటర్ ఫర్ డెవలప్‌మెంట్ అఫ్ అడ్వాన్స్ కంప్యూటింగ్ (సిడాట్) ప్రతినిధి ఐఎల్ నర్సింహారావు మాట్లాడుతూ సైబర్ నేరాలపై అవగహన పేరిగినప్పడే నేరాలు తగ్గుతాయన్నారు.

చిత్రం..సైబర్‌క్రైమ్ సెక్యూరిటీపై జరిగిన అవగాహన సదస్సులో
మాట్లాడుతున్న రాచకొండ పోలీస్ కమిషనర్ మహేశ్ ఎం భగవత్