తెలంగాణ

అన్నీ అవాంతరాలే సిబ్బంది కొరతతో ఇబ్బంది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 10: పౌరసరఫరాల శాఖ ప్రజలతో నేరుగా సంబంధాలు కలిగి ఉండటం, భారీ ఎత్తున నిత్యావసర సరకులను పంపిణీ చేయడం, ఆదాయం తెచ్చే శాఖగా కాకుండా సంక్షేమ శాఖగా కొనసాగుతుండటంతో అడుగడుగునా అవాంతరాలే ఎదురౌతున్నాయని కమిషనర్ సి.వి. ఆనంద్ తెలిపారు. మంగళవారం ఆయన ఇక్కడ మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ, తాను పౌరసరఫరాల శాఖ కమిషనర్‌గా బాధ్యతలు తీసుకుని ఐదు నెలలు పూర్తయిందన్నారు. ఐపిఎస్ అధికారిగా ఉండటంతో పోలీసు శాఖలో వివిధ హోదాల్లో పనిచేశానని, పౌరసరఫరాల శాఖ కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించడంతో కొత్తరకం బాధ్యత చేపట్టినట్టయిందని పేర్కొన్నారు. ప్రజలకు సంబంధించిన అంశం కావడంతో అనేక విషయాలు నేర్చుకున్నానని, తప్పుడు విధానాలను అరికట్టడం మూలంగా ఖజానాకు భారీగా నిధులు ఆదా అవుతున్నాయన్నారు. పౌరసరఫరాల శాఖ అధికారుల ఆలోచనా విధానంలో మార్పులు తీసుకురాగలిగానన్నారు. తమ శాఖ ఏటా 10 వేల కోట్ల రూపాయల టర్నోవర్‌ను కలిగి ఉందని, అయితే అవసరమైన సిబ్బందిలో సగం మంది కూడా లేకపోవడంతో పరిపాలనాపరంగా ఇబ్బందులు ఎదురౌతున్నాయన్నారు. సుదీర్ఘకాలంగా హైదరాబాద్, దాని చుట్టుపక్కల పనిచేస్తున్న సిబ్బందిని జిల్లాలకు బదిలీ చేశామన్నారు. జిల్లాల పునర్వ్యవస్థీకరణ జరగడంతో సిబ్బంది బదిలీలను చేపట్టడానికి అవకాశం లభించిందని వివరించారు. వివిధ కారణాల మూలంగా 2011 నుండి జమాఖర్చుల లెక్కల తనిఖీ జరగలేదన్నారు.
ధాన్యం సేకరించిన రైతులకు చెల్లింపుల్లో కొన్ని సమస్యలు ఎదురయ్యాయని, ఈ పరిస్థితిని సునాయాసంగానే అధిగమించామన్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకోవడంతో మిల్లర్లు, రవాణా యజమానులు, చౌకదుకాణాల డీలర్లలో సానుకూల ప్రభావం కనిపిస్తోందన్నారు. ధాన్యం సేకరణకు సంబంధించిన కార్యకలాపాలు ఎస్‌బిఐతో క్యాష్ క్రెడిట్ ప్రాతిపదికన జరుగుతున్నాయని ఆనంద్ వెల్లడించారు. మిల్లర్ల నుండి బియ్యం, గోనెసంచులను సేకరించడంలో జాప్యం జరిగితే వడ్డీ పెరిగిపోతోందని వివరించారు. పౌరసరఫరాల శాఖలో మిల్లర్ల బాధ్యత కీలకమైందని ఆనంద్ తెలిపారు. తప్పు చేసిన మిల్లర్లకు ధాన్యం కేటాయింపు నిలిపివేశామన్నారు. వివిధ రకాల చర్యల మూలంగా రాష్ట్ర ఖజానాకు 855 కోట్ల రూపాయలు లభించాయని, పొదుపు చర్యల వల్ల 800 కోట్ల రూపాయలు ఆదా అయ్యాయన్నారు.
2017 కు రోడ్‌మ్యాప్
2017 సంవత్సరానికి రోడ్‌మ్యాప్ సిద్ధం చేశామని కమిషనర్ ఆనంద్ తెలిపారు. ఈ శాఖలో కొత్తగా ఐదు విభాగాలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఐటివిభాగం, ఎన్‌ఫోర్స్‌మెంట్ వింగ్, ఆర్థిక నిర్వహణ, పర్యవేక్షణ విభాగం, సాంకేతిక విభాగం, ఇంజనీరింగ్ విభాగాలను ఏర్పాటు చేస్తున్నామని వివరించారు. కొత్త విభాగాల వల్ల 8-9 కోట్ల రూపాయలు ఖర్చవుతున్నప్పటికీ, కొన్ని వందల కోట్ల రూపాయలు ఆదా అవుతుండటం వల్ల ఈ ఖర్చు లెక్కలోకి రాదని స్పష్టం చేశారు. ఇప్పటికే పౌరసరఫరాల సంస్థ బోర్డు సమావేశంలో ఇందుకు అనుమతి లభించిందన్నారు.

దక్షిణ మధ్య రైల్వే
జిఎంగా బాధ్యతలు
స్వీకరించిన వికె యాదవ్
సికిందరాబాద్, జనవరి 10: దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్‌గా వినోద్‌కుమార్ యాదవ్ మంగళవారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఇండియన్ రైల్వే సర్వీసు 1980 బ్యాచ్‌కు చెందిన వికె యాదవ్ 1982లో అసిస్టెంట్ ఎలక్ట్రికల్ ఇంజనీర్‌గా పదవీ బాధ్యతలతో తన కెరీర్‌ను ప్రారంభించి ఇండియన్ రైల్వేలోని వివిధ విభాగాల్లో పలు ప్రాంతాల్లో విశిష్టమైన సేవలను అందించి తనకంటూ ఒక ప్రత్యేకతను చాటుకున్నారు. తాజా గా న్యూఢిల్లీలోని రైల్‌వికాస్ నిగమ్ లిమిటెడ్‌లో రైల్వే ఎలక్ట్ఫ్రికేషన్ ప్రాజెక్టు డైరక్టర్‌గా పనిచేస్తున్న వికె.యాదవ్‌ను దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనే

జర్‌గా నియమించడంతో ఆయన మంగళవారం తన పదవీ బాధ్యతలను స్వీకరించారు.