ఆంధ్రప్రదేశ్‌

రేషన్ కోసం పొలం బాట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మడకశిర, జనవరి 10: రేషన్ కోసం జనం పొలం బాట పట్టారు. నిన్న ఎఆర్ రొప్పం...నేడు గౌడనహళ్ళి.. ఈ-పాస్ సిగ్నల్స్ సమస్య అటు డీలర్లు, ఇటు కార్డుదారులను ఇబ్బందులకు గురిచేస్తోంది. అనంతపురం జిల్లా మడకశిర మండలం గౌడనహళ్ళి చౌకధాన్యం డిపో నెంబర్ -14 లో గత రెండు రోజులుగా బయోమెట్రిక్ సిగ్నల్స్ రాకపోవడంతో సరుకుల పంపిణీ నిలిచిపోయింది. అయితే సంక్రాంతి కానుకలు ఈనెల 11వ తేదీ లోపు పంపిణీ చేయాలని అధికారులు ఆదేశించడంతో మంగళవారం ఉదయం 7 గంటల నుండి డీలర్ మారేగౌడ్ సిగ్నల్స్ కోసం వేచి చూడగా లభ్యం కాలేదు. దీంతో కార్డుదారులు, డీలర్ కలసి గ్రామానికి రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆంజనేయస్వామి దేవాలయం సమీపంలోని పంట పొలాల్లోకి వెళ్లారు. అక్కడ మరో సిమ్‌కార్డు వేసుకోవడంతో సిగ్నల్స్ వచ్చింది. దీంతో అక్కడే వినియోగదారుల నుండి వేలిముద్రలు తీసుకొని సరుకులు పంపిణీ చేశారు. ఎఫ్‌పి షాపు పరిధిలో మొత్తం 647 రేషన్‌కార్డులు ఉండగా ఇప్పటి వరకు కేవలం 200 కార్డులకు మాత్రమే సరుకులు, 500 కార్డులకు చంద్రన్న కానుకలు అందజేసినట్లు డీలర్ తెలపారు.