తెలంగాణ

వేసవిలో విద్యుత్ కోతలుండవు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 12: తెలంగాణ రాష్ట్రంలో రానున్నవేసవి కాలంలో 9500 మెగావాట్ల విద్యుత్ డిమాండ్ ఏర్పడుతుందని, దీనిని తట్టుకునేందుకు విద్యుత్ శాఖ అన్ని ఏర్పాట్లు చేసిందని విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి ప్రకటించారు. సిబ్బంది నిర్లక్ష్యం వల్ల వ్యవసాయంలో ఒక్క ఎకరం పొలం ఎండిపోయినా చర్యలు తప్పవన్నారు. రైతులు విద్యుత్ కనెక్షన్‌తో పాటు విద్యుత్ సమస్యలకు ఎవరికీ ఒక్క రూపాయి కూడా ఇవ్వవద్దన్నారు. గురువారం ఆయన ఇక్కడ మింట్ కాంపౌండ్‌లో టిఎస్‌ఎస్‌పిడిసిఎల్ కార్యాయంలో రబీ సీజన్‌లో పగటి పూట 9 గంటల కరెంటు సరఫరాపై ఉన్నతాధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం గృహ, పారిశ్రామిక రంగాలకు 24 గంటలు విద్యుత్ ఇస్తున్నామన్నారు. ఈ నెల 6వ తేదీన ఎన్నడూ లేని విధంగా 8300 మెగావాట్ల విద్యుత్ డిమాండ్ ఏర్పడిందన్నారు. రబీ సీజన్‌లో పంటలకు ఇబ్బంది లేకుండా 9 గంటల విద్యుత్ సరఫరాకు అన్ని చర్యలు తీసుకున్నామన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 8300 మెగావాట్ల విద్యుత్ అందుబాటులో ఉందన్నారు. పగటి పూట వ్యవసాయానికి 9 గంటల విద్యుత్ ఇవ్వడానికి రాష్ట్ర వ్యాప్తంగా 5500 మెగావాట్ల విద్యుత్ అవసరమవుతుందన్నారు. ట్రాన్స్‌ఫార్మర్లు ఓవర్ లోడ్లతో ఫెయిలయ్యే అవకాశం ఎక్కువగా ఉందన్నారు. అటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. పాడైన ట్రాన్స్‌ఫార్మర్లను 24 గంటల్లో బాగు చేయాలన్నారు. పగటిపూట వ్యవసాయానికి 9 గంటల విద్యుత్ సరఫరా వల్ల రాత్రిపూట హైవోల్టేజితో గృహోపకరణాలు కాలిపోకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. అదనపు మోటార్లను రైతులు వినియోగించే అవకాశం ఉన్నందున పెరిగే లోడ్‌కు అనుగుణంగా ఏర్పాట్లు చేయాలన్నారు. పెండింగ్ దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలన్నారు. పాతలైన్లు, స్తంభాలను మార్చాలన్నారు. వీధి దీపాలు పగటిపూట వెలగకుండా రోడ్డు పక్కన ప్రమాదాలకు కారణమవుతున్న స్తంభాలు, వేలాడే తీగెల సమస్యలను వంద రోజుల్లో పరిష్కరించేందుకు వారంలో వివరాలు సేకరించాలన్నారు. వ్యవసాయ అవసరాలకు స్తంభాలు వేయడానికి సంబంధించి రూ. 50 వేలను 75 వేలకు పెంచామన్నారు. పెండింగ్‌లో ఉన్న వ్యవసాయ విద్యుత్ సర్వీసులను ఈ ఏడాది మే వరకు విడుదల చేయాలన్నారు. దరఖాస్తు చేసిన మూడు వారాల్లోగా తగు సమాచారం అందించాలన్నారు. క్షేత్ర స్థాయి అధికారులు ప్రజా ప్రతినిధులతో సమన్వయం చేసుకుంటూ రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాలన్నారు.

చిత్రం..కరెంటు సరఫరాపై ఉన్నతాధికారులతో జరిగిన సమీక్షా సమావేశంలో మాట్లాడుతున్న విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి